Others

కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటనారంగంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, ఇది సహజమని, జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అని అంటోంది బుల్లితెర నటి రష్మీదేశాయ్. నటిగా తనకంటూ గుర్తింపు వచ్చినప్పటి నుంచి ప్రైవేటు జీవితానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు కొంత దూరాన్ని మెయిన్‌టెయిన్ చేస్తున్న రష్మీ దేశాయ్ తనకున్న సమయంలో కొంత సొంత వ్యాపారానికి కేటాయస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని కెరీర్‌ను తీర్చిదిద్దుకోవటం ఎలాగో నేర్చుకుంటున్నట్లు వెల్లడించింది. ఎవరైనా తమ సంతోషం కోసం తామే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉం దని చెబుతోంది. అందుకే తన కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఈ వర్థమాన తార చెబుతోంది. మూడీగా ఉండటంపై మాట్లాడుతూ.. సృజనాత్మకంగా ఆలోచించేవారెప్పుడు మూడీగా ఉంటారని గమ్మత్తుగా సమాధానం ఇచ్చింది. ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అలాగే పాత్రలను ఎంపిక చేసుకుంటానని అంటోంది.