Others

సులభోపాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి మార్గమునే ‘్భక్తి యోగమని’ అంటారు. నారదుడు, వాల్మీకి, హనుమంతుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, భక్త కన్నప్ప, భక్త రామదాసు, అన్నమయ్య, రామకృష్ణ పరమహంస, మీరాబాయి, పోతన వంటి వారంతా ఈ నవ విధములైన భక్తి మార్గములలో వారికి అనుకూలమైన మార్గములలో పయనించి ఆత్మజ్ఞానాన్ని పొంది మనకు మార్గదర్శకులైనారు. మనకు ఆధ్యాత్మిక రహదారిని చూపించారు.
వారు చూపిన భక్తి తొమ్మిది రకాలు అవి 1.శ్రవణము 2.కీర్తనము 3.స్మరణము 4.అర్చనము 5.వందనము 6.సఖ్యము 7.ఆత్మనివేదనము 8.పాదసేవనము 9.దాస్యముఈ భక్తి మార్గాల్లో ఏదో ఒక మార్గం ద్వారా సర్వేంద్రియములను భగవంతునియందే నిలిపి, తన సర్వస్వమును ఆ భగవంతునికి అర్పించుటయే నిజమైన భక్తి.
భగవంతుని యందు మనకు గల గొప్ప ప్రేమభావమే ‘్భక్తి’. దేవుని గుణగణములను వినుట, భగవంతుని లీలా విశేషగాథలను వినుట, దైవిక పురాణములను చదువుట వినుటఇవన్నీ కూడా భక్తి భావనలే. సమస్త ప్రాణుల యందు దయ, ప్రేమ కల్గియుండుట, అందరికి ప్రియమగునట్లు మాట్లాడుట. ప్రాణుల పై చూపే దయార్థ్రహృదయమే భక్తి భావనగా మారుతుంది.
పరిపూర్ణ విశ్వాసంతో, చిత్తశుద్ధితో భగవంతుని ఆరాధించడమే నిజమైన భక్తి, ధర్మప్రవర్తనతో జీవించటమే భక్త్భివన మొల కెత్తడానికి సరియైన శుభసూచికం. ఆత్మజ్ఞానము కొరకు సాధన చేసి తద్వారా శాశ్వతానందం పొందటానికి సులువైన మార్గం భక్తి. ‘్భక్తి రేవ గరీయసి’ అన్నట్లు ప్రతి ఒక్కరికీ వారి వారి జీవన విధానాన్ని బట్టి, స్థాయిని బట్టి సాధించుటకు వీలైనది భక్తి మార్గము ఒక్కటే.్భక్తి మార్గానికి మోక్ష సాధనకు మనస్సు నిర్మలంగా నిశ్చలంగా ఉండటం అత్యంత అవసరం. భక్తిఅంకురం ఏర్పడితే మనసులను భగవంతునిపై ఏకాగ్రం చేసి ఆత్మజ్ఞాన మార్గములో పయనించేటట్లు చేస్తుంది. శాశ్వతమైన ముక్తిని ప్రసాదింపజేస్తుంది.
భక్తి మార్గము సామాన్యులందరికీ సులువైనది. తేలికైనది. ఐహిక వాంఛలవలయంలో వున్నవారు, సంసార బంధములో వున్నవారు, ఎవరైనా సరే భక్తి మార్గాన్ని ఎంచుకుంటే చాలు వారు ఈలోకంలో సుఖాలను పొందుతారు. పరలోకంలోనూ శాశ్వతానందాన్ని పొందుతారు. ఈ భక్తిని సగుణరూపంలోనైనా నిర్గుణరూపంలోనైనా సాధించవచ్చు. కొందరు విగ్రహారాధనలు చేసి వివిధ అలంకరణలు చేసి, వివిధరకాలైన నివేదనలు చేసి భగవంతుని ప్రేమను పొందుతారు. మరికొందరు కేవలం ధ్యానం చేతనే భగవంతుని అపారమైన ప్రేమను పొందుతారు. ధ్యానం అంటే ‘‘నేను ఎప్పుడూనూ ఆత్మస్వరూపుడనేగాని, జీవుడను గాను అనే విషయం ఆత్మ సాక్షాత్కారమును కల్గించు మార్గమే ధ్యానం. చంచలమైన మనసును నిగ్రహపరిచి విషయవాసనల జోలికి పోనివ్వక నిశ్చలంగా భగవంతునిపైనిలుపుటకు ధ్యానం ఒక సులువైన మార్గం.
భక్తిమార్గంలో నడవడానికి వయోభేదం ఎంతమాత్రం లేదు. బాలురైన ధ్రువుడు, మార్కండేయుడు తమ చిన్ననాటి ఏకాగ్రతతో భగవంతుని ధ్యానించి మెప్పించి చిరంజీవులైనేటికీ ఆదర్శమూర్తులై నిలచిఉన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ ఈ విధంగా చెప్పియున్నారు. ‘‘ఎవరైతే ప్రతి నిత్యమూ నన్ను పరిపూర్ణ విశ్వాసంతో, అత్యంత భక్తిశ్రద్ధలతో నన్ను ధ్యానించుతూ అన్ని వేళలా నా యందే నిష్టకలిగి యుంటారో, అట్టివారియొక్క సర్వయోగ క్షేమములనూ నేనే వహించుచున్నాను’’.

- చివుకుల