Others

అందమైన అమ్మలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు-
అమ్మ పాత్రలు వేయాలంటే నిర్మలమ్మో, అన్నపూర్ణమ్మో అన్నట్టుండేది టాలీవుడ్. ఆ తరువాత కొంతకాలం పాటు అటు స్టార్ హీరోలకూ, ఇటు కుర్ర హీరోలకూ -సుధే తల్లయ్యింది. ‘ఏరా.. అరే’ అనే సంబోధనలో ఆప్యాయతను కురిపించి సుధ చాలాకాలం పాటు బెస్ట్ మదర్ హోదాను కొనసాగించింది. హీరోయిన్ అందంగా ఉందంటే తల్లికూడా అంతే అందంగా ఉండే ఉండాలి? అన్న క్వొశ్చన్ తెరమీదికి వచ్చిన తరువాత -అమ్మ పాత్రలూ అందంగా, ఆధునికంగా మారిపోయాయి. హీరోలు, హీరోయిన్లు ఆధునికంగా కనిపిస్తున్నపుడు, వాళ్లను పెంచినవాళ్లు మాత్రం ముతక చీరల్లోనో, మాసిన కొంగు నడుముకి చుట్టుకునో ఎందుకు కనిపిస్తారు? అందుకే -టాలీవులో అమ్మలు ఇప్పుడు ఆధునికంగా కనిపిస్తున్నారు. అమ్మను అందంగా చూపించడానికి ఒకప్పటి కాలంనాటి అమ్మలను పక్కన పెట్టేశారు కూడా. అందుకే పేరుకే అమ్మగానీ, టాలీవుడ్‌లో అమ్మ పాత్రలు వేస్తున్న వాళ్లను అందంగా, ఆధునికంగా, హైఫై సొసైటీకి తగినట్టే చూడగలుగుతున్నాం. నిన్నమొన్నటి హీరోయినే్ల ఇప్పుడు తల్లి పాత్రలు పోషిస్తున్నారు కనుక -ఆడియన్స్ కూడా అలవాటైపోయిన మైండ్‌సెట్‌తో యాక్సెప్ట్ చేసేస్తున్నారు. మొన్నటికిమొన్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో రాజమాత పాత్ర పోషించిన హేమమాలిని ఒకప్పటి డ్రీమ్‌గాళ్. చాలా ఏళ్ల తరువాత దర్శక, నిర్మాతలు చేసిన ప్రయత్నాలు ఫలించి ఆమె టాలీవుడ్‌లో ‘శాతకర్ణి’ సినిమా చేసింది. అందమైన అమ్మకనుక అందుకు తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ తీసుకున్న హేమమాలిని, శాతకర్ణి భార్య పాత్ర పోషించిన శ్రీయతో అందంలో పోటీపడిందంటే ‘అమ్మో’ అనుకోవాలి. ఇక బాహుబలి తల్లి శివగామినే తీసుకుందాం. ఒక దశలో టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రమ్యకృష్ణ. అందం, ఆహార్యం, అభినయం, మొహమాటంలేని గ్లామర్ ప్రదర్శనలతో ఒకదశలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేంజ్‌కి చేరిన రమ్యకృష్ణ, దర్శకుడు కృష్ణవంశీని పెళ్లాడిన తరువాత కొంతకాలం గ్యాప్ తీసుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అందమైన అత్త, అమ్మ పాత్రలతో కట్టిపడేసిన రమకృష్ణ, ‘బాహుబలి’తో స్టార్‌మదర్ రేంజ్‌కి చేరుకుంది. తల్లిపాత్ర కోసం డెయిలీ రెమ్యూనరేషన్ తీసుకుని -శివగామి తిరుగులేని తల్లి అనిపించుకుంది.
ఇక అందమైన అత్త, అమ్మ పాత్రలకు ప్రత్యేకత తీసుకొచ్చిన నటిగా నదియాను చెప్పుకోవాలి. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఆమె క్రేజ్ చెప్పుకోదగినంత లేకున్నా, క్యారెక్టర్ పాత్రలతో హీరోయిన్లను మించిపోయింది. ‘మిర్చి’లో ప్రభాస్‌కు తల్లిగా, ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పవన్‌కళ్యాణ్‌కు స్వాభిమాన అత్తగా ఒదిగిపోయింది. ఆ రెండు చిత్రాలతోనే దక్షిణాది చిత్రాల్లో బిజీ అయిపోయిన నదియా -అందమైన, ఆధునికమైన అమ్మ, అత్త పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కాలంలోనే హీరోయిన్‌గా తనదైన శైలి చిత్రాలు చేసిన సహజనటి జయసుధ, ఇప్పుడు ఎవర్‌గ్రీన్ అమ్మ. ఒకడుగు ముందుకేసి నాయినమ్మ పాత్రలకూ బెస్ట్ చాయిస్‌గా నిలిచింది జయసుధ. సహజనటి ఇమేజ్‌లో రెమ్యునరేషన్ కూడా స్థాయికి తగినట్టు తీసుకుంటున్న జయసుధ -ఇంకొంతకాలం అమ్మ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గానే కొనసాగించనుంది.
చిన్న వయసులోనే అమ్మ పాత్రల్ని సమర్థంగా పోషిస్తోన్న పవిత్ర ప్రకాష్, రోహిణి, మధుబాల లాంటి తారలంతా ‘క్యారెక్టర్’ పాత్రలకు పూర్తిగా నిండుదనం తీసుకొస్తున్నారు. సాఫ్ట్‌గానూ, చలాకీగానూ, మరింత మురిపెంను చూపించే సన్నివేశాలను రక్తికట్టించడంలో వీళ్లంతా ఉద్దండులే. ఇక మొన్నటి హీరోయిన్లు రేవతి, శరణ్య, తులసిలాంటి నటీమణులూ అమ్మ పాత్రలకు నిండుదనం తెస్తూ -అమ్మంటే ఇలా ఉండాలనే ‘రుచి’ని చూపిస్తున్నారు. పాత్రోచిత ప్రదర్శనతో అమ్మదనంలోని కమ్మదనాన్ని ఆడియన్స్‌కు అందిస్తున్నారు. టాలీవుడ్‌లో అందమైన ‘అమ్మ’ పాత్రలకు అధిక ప్రాధాన్యత వస్తుండటంతో -నిన్నటి హీరోయిన్లూ ఒక్కొక్కరుగా ‘క్యారెక్టర్’ పాత్రలు పోషించేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రగతి, హేమలాంటి ఆర్టిస్టులు ఇప్పటికే అమ్మ పాత్రలు పోషించి చూపిస్తే, నిన్నటి వరకూ హీరోయిన్లుగా కనిపించిన రాశి, మీనాలాంటి అందగత్తెలూ ‘అమ్మ’ పాత్రలపై ఆసక్తి చూపిస్తున్నట్టు వినికిడి. కథానాయిక పాత్రలకు కాలం చెల్లిన అందగత్తెలంతా -టాలీవుడ్‌లో అమ్మ పాత్రలకు సెటిలైపోవచ్చన్న ధీమా కనిపిస్తోంది.

-ప్రవవి