Others

మళ్లీ.. కాదంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి మొదటి సినిమాకి తమన్నాకు ఎంత గుర్తింపు వచ్చిందో, రెండో సినిమాకు అనుష్కకు అంతకన్నా ఎక్కువ గుర్తుంపు లభిస్తోంది. ప్రస్తుతం అనుష్క బాహుబలి విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈనేపథ్యంలో ఆమెకు పెళ్లి కుదిరిందని అటు శాండల్‌వుడ్, టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగా తన ఇష్టదైవం కర్ణాటక కొల్లూరులోని మూకాంబికా దేవాలయానికి వెళ్లి పూజలు జరపడం, అందుకు కుటుంబం అంతా కలిసి వెళ్లడం ఈ అనుమానాలకు తావిచ్చింది.
అయితే ఇదంతా ఒట్టిదేనని, ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదని అనుష్క కొట్టిపారేసింది. తాను అమ్మవారి భక్తురాలినని, అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చిపోతూ ఉంటానని క్లారిటీ ఇచ్చేసింది. సో.. ఇప్పుడప్పుడే అనుష్క పెళ్లిపీటలు ఎక్కదన్నమాట!