Others

నాకు నచ్చిన చిత్రం.. తాతా -మనవడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1973లో ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై ప్రముఖ నిర్మాత కె.రాఘవ, దాసరి నారాయణరావుని దర్శకుడిగా పరిచయం చేసి నిర్మించిన కుటుంబ కథా చిత్రం ‘తాతా మనవడు’. రమేష్ నాయుడి స్వరరచనలో అద్భుతమైన గీతాలు చిత్రంలో ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లలమీద ఎంత మమకారం పెట్టుకొని పెంచుతారు. చివరికి తల్లిదండ్రుల కలలన్నీ కల్లలు చేసి ఆ పిల్లలు రెక్కలు రాగానే వారి వారి దారి చూసుకుంటే, చివరికి ముదుసలి వయసులో మిగిలిన తల్లిదండ్రుల పరిస్థితి ఎలా వుంటుంది అన్న అద్భుతమైన పాయింట్‌ను తీసుకుని దర్శకులు దాసరి నారాయణరావు తన తొలి చిత్రంగా అందించిన ‘తాతా మనవడు’ నేటి సమాజానికి వర్తించే నీతితో సాగుతుంది. ఎస్వీఆర్ కొడుకు సత్యనారాయణ. భార్య అంజలీదేవి. కొడుకు గొప్పగా చదివి ఎదగాలని తండ్రి ఆశిస్తే, కొడుకు నిరంతరం విలాసాలవైపు దృష్టిపెడతాడు. ఓ గొప్పింటి అమ్మాయి రాజసులోచనను అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటాడు. తన తల్లిదండ్రులు గొప్ప శ్రీమంతులని చెప్పడంవల్ల పేదవాళ్ళైన తన తల్లిదండ్రులను ఆమె వద్దకు తీసుకెళ్ళడు. చివరికి తన తండ్రి పేరు కూడా అబద్ధం చెబుతాడు. ఇదంతా గమనించిన తల్లిదండ్రులు తమ కొడుకైనా సుఖంగా ఉంటే చాలనుకొని దూరంగా ఉంటారు. యాదృచ్ఛికంగా తల్లే కొడుకు ఇంట్లో దాసి పని చేయాల్సి వస్తుంది. అక్కడనుండి సినిమాలో పండించిన డ్రామా అద్భుతంగా ఉంటుంది. మనవడ్ని చూసుకొని మురిసిపోయే నానమ్మ, ప్రేమను గమనించిన మనుమడు ఆ తాత, నాన్నమ్మలను వదలడు. చిత్రంలో ఇంకొక నాటకం కూడా వుంటుంది. ముసలివాళ్లైన తల్లిదండ్రులను వదిలించుకోవడానికి చనిపోకముందే తండ్రిని స్మశానంలో పడేస్తాడు కొడుకు. తన తండ్రి చేసిన ఈ పనిని చూసి అతని కొడుకు ఓ గుంత తవ్వుతాడు. అదెందుకు అని ప్రశ్నిస్తే, నీ తండ్రిని ఎలా పాతిపెట్టావో, బతికుండగానే నిన్ను పాతడానికి ఈ గుంట తీస్తున్నానని చెప్పిన మాట నేటి తల్లిదండ్రులను చూడని యువతరానికి చెంపదెబ్బలా తగులుతుంది. విశేషం ఏమంటే, దాదాపు 30 సంవత్సరాల క్రితం తీసిన ఈ సినిమాలో జరుగుతున్న విషయాలు నేటికీ సమాజంలో చూస్తూనే ఉన్నాం. అదీ దర్శకుడు దాసరి గొప్పదనం.

-సుసర్ల సర్వేశ్వర శాస్ర్తీ, విశాఖపట్నం