Others

త్యాగమే మహోన్నతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షీరసాగర మథనం జరిగిన తర్వాత దేవతలు అమృత పాన తృప్తితో శ్రీహరిని కీర్తించి దేవతలు సుఖ సంతోషాలు పొందారు. దానవులు తాము మోసపోయా మని చింతితులయ్యారు. దేవతలే తమ కన్నా అధికులుగా ఉండడానికి వారి మనసు అంగీకరించలేకపోయంది. వారి లోని తామస గుణం వారిని నిలువనీయలేదు. ఏదో చేసి దేవతలకన్నా అధికులమని అనిపించుకోవాలని వెర్రి ఆలోచనలు చేసారు. బలి చక్రవర్తి తన కులగురువైన శుక్రాచార్యులను సేవించాడు. శుక్రాచార్యుని బోధతో విశ్వజిద్యాగం చేసాడు. అగ్ని దేవుడు ఆ యాగంతో సంతృప్తిచెందాడు. దివ్యరథం, ఒక దివ్యమైన ధనుస్సు, రెండు అక్షయతూణీరాల అనుగ్రహించాడు. తాత అయిన ప్రహ్లాదుడు ఎప్పటికీ వాడిపోకుండా ఉండే పద్మమాల ఇచ్చాడు. శుక్రాచార్యులు చంద్రబింబం లాంటి స్వచ్ఛమైన శంఖం ఒకటి ఇచ్చాడు.
విష్ణువుపై విరోధంతోకాక ప్రీతిని పెంచుకోవాలనుకొన్నాడు. మహావిష్ణువు మెప్పించడం కోసం ఎన్నో యజ్ఞాలు యాగాలు నిర్వహించాడు. విప్రులకు అనేక దానాలు చేసాడు. ధర్మం తప్పకుండా తన నడవడిని మార్పు చేసుకొన్నాడు. నీతిగాను, న్యాయంగా సమతూకంతో జీవితాన్ని జీవించేవాడు. పెద్దల యెడ గౌరవాన్ని, భక్తిని ఎలా కలిగున్నాడో పిన్నల పట్ల కూడా ప్రేమాదరాలను చూపించేవాడు. గురువులను గౌరవించేవాడు.
అటువంటి బలిని దానవులతోపాటుగా దేవతలూ అభిమానించసాగారు. అప్పుడు దానవులంతా దేవతలతో యుద్ధం చేద్దామన్నా బలి లోకకల్యాణకరమైన పనులు చేయాలే తప్ప పరులను హింసించకూడదని దైత్యవీరులకు హితబోధ చేశాడు. దానము, త్యాగమే మహోన్నతమైనవని పరుల సొమ్ము పాముతో సమానమని వారికి తేటతెల్లము చేసాడు. దానం చేసినపుడు దానగ్రహీత కనుల్లోని సంతోషాన్ని చూడగలిగితే అదే మనకు సంతృప్తిని కలిగిస్తుందని మీరు దానం చేయమని వారిని ప్రోత్సహించాడు.
అటువంటి బలికోసం విష్ణుమూర్తి తనకు తానై వామనుడై దిగివచ్చాడు. అదితికశ్యపులకు కుమారుడై జన్మించాడు. గుజ్జు రూపంలో వున్న మహావిష్ణువుకు వామనుడు అనే పేరు వాడుకలోనికి వచ్చింది. అతని బాల్యక్రీడలకు, మురిపముగొలిపే మాటలకీ తల్లిదండ్రులైన అదితి కశ్యప మహర్షులేగాక వారి ఇరుగు పొరుగు వారంతా సంతోషపడేవారు. దేవతలు ఎప్పుడు తమను ఆదుకొంటాడో అని చూసేవారు. దానవులు ఎపుడు తమ దగ్గరకు వచ్చి తమను నిర్వీర్యం చేస్తాడేమోనని ఎల్లపుడూ వామనుణ్ణే స్మరిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో అదితికశ్యపులు వామనునికి ఉపనయాదికములను చేసారు. సూర్యుడు సావిత్రీ మంత్రము నుపదేశించగా, బృహస్పతి యజ్ఞోపవీతాన్ని, కశ్యపుడు వౌంజినీ, అదితి కౌపీనాన్ని, ధరణి కృష్ణాజినమును, సోముడు దండాన్నీ, గగన దేవత ఛత్రాన్ని, బ్రహ్మ కమండలమును, సరస్వతీ దేవి అక్షమాలికను, సప్తర్షులు కుశ పవిత్రాలను ఇచ్చారు. వామనుడు మరుగుజ్జు రూపంలో ఉండి యజ్ఞయాగాలు చేసే బలి దగ్గరకు వెళ్లి కేవలం మూడడుగల నేలను దానం ఇవ్వమని అడిగాడు. శుక్రా చార్యులతో సహా అందరూ వచ్చిన వటువు మహావిష్ణువు ఆయన దేవతలకోసం వచ్చిన వాడు నిన్ను అణచివేస్తాడని చెవి నిల్లు కట్టుకొని పోరారు.
అయనా తాను నమ్మిన సిద్దాంతానికి, తాను ఆచరించే ధర్మానికి విరుద్ధంగా తన దగ్గరకు వచ్చి దానం అని చేయ చాచిన వామనుడి ఉత్తి చేయ చూపలేనని మూడడు గులను దానం ఇస్తానని ముందుకువచ్చాడు బలి చక్రవర్తి. ఇంతితవాడై వచ్చిన వాడు అంతంతయై ఆకాశ మంతయై నిల్చున్నా ఇచ్చే ఆనందమే మిన్న అన్నాడు బలిచక్రవర్తి. బలిపై అను రాగాన్ని పెంచుకున్న మహా విష్ణువు దేవతలకు స్వర్గాన్ని చ్చివేసి పాతాళానికి బలిని రాజును చేసి తానే బలిచక్రవర్తి రాజ్యానికి కాపలాదారునిగా నిల్చున్నాడు ఆ కృపాళువు మహవిష్ణువు.

- అక్షిత