AADIVAVRAM - Others

కనువిప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరత్ చంద్ర, భరత్ కుమార్ పదవ తరగతి వరకు క్లాస్‌మేట్స్ మాత్రమే కాదు, మంచి స్నేహితులు కూడా. భరత్ లక్షాధికారి కొడుకు. శరత్ తండ్రి నరసింహం పెద్ద తాగుబోతు. ఏ పనీ చేయడం చేతగాదు. శరత్ తల్లి రోజంతా కష్టం చేసినా వచ్చే కూలీ డబ్బుతో కుటుంబం గడవడమే కష్టమై పోయింది. మరో మార్గం లేక ఈ ఏడాది శరత్ చదువు మానేశాడు. భరత్‌కి ఈ విషయం తెలిసి బాధనిపించింది. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు.
శరత్‌కి కొంత డబ్బు సాయం చేస్తే చదువుకుంటాడు కదా! అని మనసులో అనుకొన్నాడు. ‘ఒక్కసారి, రెండుసార్లు ఇవ్వగలవ్! ఆ తరువాత.. మళ్లీ మామూలేగా!’ అంది అతని అంతరాత్మ. ‘ఐతే ఎలా?’ మనసుని ప్రశ్నించాడు.
‘కష్టే ఫలి! కష్టపడ్డ వాడు ఎప్పటికైనా పైకి వస్తాడు. కష్టం విలువ తెలిసేలా చేయాలి’ అంది మనసు.
భరత్‌కు విషయం అర్థమైంది. శరత్ తండ్రి నరసింహాన్ని ఎలాగైనా మార్చాలనుకున్నాడు. ఓ రోజు రాత్రి శరత్ ఇంటికొచ్చాడు భరత్. ప్రతిరోజు మాదిరిగానే నరసింహం సారా కొట్టుకెళ్లి పీకల దాకా తాగి ఊగుతూ ఇంటికొచ్చి భార్యాపిల్లల్ని తిడుతూ, తినకుండానే పడుకున్నాడు. అతని ప్రవర్తనకు ఆ కుటుంబమంతా ఆ పూట ఉపవాసమే. ఇదంతా గమనించాడు భరత్.
ప్రతిరోజూ శరత్ తండ్రి నరసింహం వెళ్లే సారా కొట్టుకి వెళ్లాడు భరత్. యజమానితో ఒక దినానికి ‘సర్వీస్ బాయ్’ పని ఇచ్చేట్టు మాట్లాడుకొన్నాడు. యజమాని ఇచ్చిన యూనిఫాం వేసుకున్నాక భరత్ తనలో తనే నవ్వుకొన్నాడు. పాడి రైతు ఇల్లిల్లు తిరిగి పాలను అమ్ముకోవాలి. కాని ఎంత దూరమైనా మద్యం అమ్మే వాని వద్దకెళ్లి మద్యపానమనే అనారోగ్యాన్ని కొంటారు మనుషులు’ అనుకొన్నాడు.
ఇంతలోనే సారా కొట్టులోకి నరసింహం తాగడానికి వచ్చాడు. సర్వీస్ బాయ్‌గా భరత్‌ని చూసి ఆశ్చర్యపోయాడు. ‘బాగా డబ్బున్నోళ్లు మీరు. మాలాంటి వారిని పది మందినైనా కొలువులో పెట్టుకొని జీతమిచ్చే కుటుంబం మీది. అలాంటిది ఇంత చిన్న వయసులో ఇక్కడ పని చేయడమేంటి? ఇక్కడ పనిచేస్తే మీరూ తాగుబోతులవుతారు. ఇలాంటి పనులు చేయొద్దు బాబూ!’ అన్నాడు నరసింహం.
‘పెద్దలు మీరు కూడా ఇక్కడికి రాకండి. మీలాంటి ఓ తండ్రి రోజూ తాగడానికి డబ్బులన్నీ తగలేసి తాగితాగి ఆరోగ్యం పాడుచేసుకొని చచ్చిపోతే ఆ కుటుంబం గడవక వీధి పాలవుతుంది. మీ కన్నకొడుకు కూడా నాలాగా ఇక్కడికి రాకుండా ఉండాలంటే మీరు తాగడం మానండి’ అంటూ కన్నీరు పెట్టుకొన్నాడు భరత్.
ఆ కన్నీళ్లతో నరసింహం చలించిపోయాడు.
‘నిజమే. తాగుబోతు తండ్రుల వల్ల ఎన్ని కుటుంబాలు నరక యాతన అనుభవిస్తున్నాయో?! నా వల్ల నా కుటుంబం ఇబ్బందుల పాలవుతోంది. ఇక నుంచీ తాగుడు మానేసి... పని చేసి కుటుంబాన్ని పోషిస్తాను’ అనుకొన్నాడు నరసింహం.
స్నేహానికి ఆస్తి, అంతస్తులు అవసరం లేదు. ఆదుకునే మనస్సుంటే చాలు. మంచి మిత్రుడు తాను కష్టపడినా ఎదుటి మనిషిలో మార్పు తీసుకు వస్తాడు అనుకుంటూ తన ప్రాణ స్నేహితుడు భరత్ ఇంటికెళ్లి తన తండ్రికి కనువిప్పు కలిగించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు శరత్.

-నాశబోయన నరసింహ