Others

జీవనసుధారసం రామాయణ కథాకావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నే టి సమాజంలో రామాయణ, భారత కథ తెలియనివారు సర్వసాధారణంగా ఉండరంటే అతిశయోక్తి లేదు. సమాజంలోని ప్రతి వ్యక్తి రామాయణం చదవడం ద్వారా గాని,వినడమో నాటకం సినిమా లాంటి మాధ్యమాల వలన రామకైతను తెలుసుకుని జీవన సుధారసాన్ని గ్రోలినవారే.
శ్రీరామకథను ఎలా తెలుసుకున్నా కథా ప్రభావం మనుషుల జీవితాలపై చెరగని ముద్ర వేస్తుం ది. ఈ కథాప్రభావంతో మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుంది. జీవన విలువలుపెంచుతుంది. మనిషి మంచి మార్గంలో నడుచుకొనడానికి మార్గం సుగమం చేస్తుంది. మనిషి ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేయస్తుం ది. మనిషి మనీషిగా ఉత్తములుగా తీర్చిదిద్దే మహాకావ్యం రామాయణ మది అరవింద మహర్షి దగ్గరనుంచి ఎంతో మంది సెలవిచ్చారు.
రామాయణంలో ప్రతీ పాత్రా ఉదాత్తమైనదే. మనిషికి ఉండవలసిన గుణాలను పక్షుల ద్వార రాక్షసుల ద్వారా కూడా వాల్మీకి చెప్పించాడు. మనిషి ఏవిధంగా ఉండకూడదో ఒకవేళ అలా ఉంటే ఏవిధమైన శిక్షకు గురి అవుతాడోరావణాది రాక్షసుల ద్వారా తెలియచేశాడు. సీతమ్మ పాత్ర లోకంలో ప్రతి మహిళా అర్థం చేసుకోవాల్సిందే. సీతమ్మ ఎంతటి త్యాగమూర్తో, ఎంతటి దయామూర్తో, ఎంతటి అనురాగవల్లీయో తన బాధ్యత ను ఎన్ని కష్టాలు వచ్చినా ఎలానిర్వహించిందో తెలుసుకోవాలి. తన్ను బాధపెట్టిన వారిని సైతం ఉదారంగా చూసిన దయామూర్తి సీతమ్మ. భార్యాభర్తలు ఎలా ఉండాలో అను రాగమూర్తులుగా ఉంటూ సమాజానికి సేవచేయాలో చెప్పడానికి సీతమ్మపాత్రనే తార్కాణంగా నిలుస్తుంది.
మనిషి హంసలాగా తన బుద్ధిని ఉపయోగించి పాలను గ్రహించి నీటిని వదిలేసినట్లు, మంచిని గ్రహించి చెడును వదలివేయాలి. ఉత్తేజం, చైతన్యం, ప్రేరణ, స్ఫూర్తి, ఉల్లాసం, ఆనందంలాంటివి కేవలం మనిషి ప్రవర్తన ద్వారా తెలుస్తాయ. ఇవి ఇతరులకు ద్రోహం తలపెట్టకుండా ఉన్నపుడు, తోటివారికి సహాయ పడుతున్న ప్పుడు మాత్రమే కలుగుతాయ. ఆ సహాయం అనేది ఎవరికి ఎందుకు చేయాలో మారుతి పాత్ర మనకు చెబుతుంది. కార్యం సాధించడానికి పట్టుదలతోపాటుగా కార్య సాఫల్యానికి కావలసిన నైపుణ్యం, మార్గాన్ని సుగమం చేసుకొనే బుద్ధి పటిమ లాంటి లక్షణాలు ఎలా ఉండాలో రామభక్త ఆంజనేయుడు ప్రతి సంఘటన ద్వారా తెలియచేస్తాడు.మంచి పని చేయడానికి తనకు శక్తి లేకపోయనా అన్యాయం, అక్రమం ఎదుర్కోవడానికి ముందుకే వెళ్లాలని అన్యాయశక్తి ఎక్కవగా ఉందని వెనుకంజ వేయకూడదనే తత్వాన్ని జటా యువు చెబుతుంది. మంచి పని నిర్వహించ డానికి ఎంతకాలమైన ఎదురు చూసి సరియైన సమయంలోమంచి పని చేసితీరాలని సంపాతి చెబుతుంది.
ప్రతి మనిషి ప్రేమ, దయ, కరుణ, జాలి, పరోపకారం, త్యాగం వంటి మంచి గుణాలు కలిగి ఉంటే మానవుడే మాధవుడు అవుతాడు. మానవుడే దివ్యునిగా ఎదగడానికి మానవునిలోని బుద్ధి కుశలతే కారణమని రామాయణం చెబుతోంది.
మనిషి మంచి మార్గంలో పయనిస్తే విజయం సాధిస్తాడని, చెడు మార్గంలో పయనిస్తే నాశనం అవుతాడని పురాణాలు, ఇతిహాసాలు అనేక కథలు ఇవేకాక దైనందిన జీవితమూ కూడా ఈవిషయానే్న చెబుతుంది. కాని, అజ్ఞానంతో స్వార్థంతో జీవించక పరులకు ఉపయోగపడుతూ నిస్వార్థంగా జీవించగలిగి త్యాగమే మహోన్నతమని తెలుసుకొన్ననాడు ప్రతి మానవుడు రాముడు గా ఎదుగుతాడు. ఇదే రామాయణ కథ మనకు అందించే జీవన సుధా రసం.

-జి. కల్యాణి