Others

రథోత్సవానికి ముస్తాబవుతున్న పూరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నింటి ఆధారభూతుడైన సర్వసాక్షి పరదైవం తన్ను తాను ధర్మసంస్థాపనకోసం అనేక రూపాలుగా సృజియించుకుంటుంటాడు. ఓసారి పరమాత్మ తనను దారువులో నిలుద్దామనుకొన్నాడు. దారువులో తనకు అత్యంత ఇష్టమున్నవాణ్ణి తన రూపాన్ని రూపొందించమనితన భక్తునితో చెప్పాడు. కాని ఓ నియమం పెట్టాడు. ఆ నియమం పాటించలేదన్న కినుకతో సగం సగం పూర్తయి న రూపాలతోనే పూరీ క్షేత్రంలో జగాలనేలే జగన్నాథుడిగా స్థిరపడ్డాడు. పూరీక్షేత్రంలో పూర్తి రూపమేర్పడని జగన్నా థుని ఉత్సవాలు, ఆచారాలు, సంబురాలు ఇట్లాంటివన్నీ కూడా విభిన్నంగా జరుగుతుంటాయ. ఎక్కడైనా తన భార్యాసమేతంగా దర్శనమిచ్చే భగవంతుడు పూరీ క్షేత్రంలో మాత్రం తన సోదర, సోదరీ సమేతుడిగా దర్శనమిస్తాడు. ఈ సోదరసోదరీ సమేత జగన్నాథునికి అత్యంత ఆసక్తి తదాయకమైన రథోత్సవం ప్రతి ఏటా ఆషాడమాస శుద్ధ విదియనాడు ప్రారంభమవుతుంది. ఈ రథోత్సవాన్ని చూడడానికి కూడా చర్మ చక్షువులు చాలవు. ఈ రథోత్సవాన్ని చూచి తరించాల్సిందే కాని, వర్ణించడానికి ఆ బ్రహ్మకైనా దుస్సా థ్యం అంటారు. జగన్నాథుడు తన నందిఘోషపైనను, బలభద్రుడి తాళధ్వజంపైనను దర్పదలన అనే రథంపైన సుభద్ర ఆసీనులు కాగానే ఈ రథాలను అత్యంత సంతోష దాయకాలతో జనసందోహం జగన్నాథుని సాయుజ్యానికి ముందుకు లాగుతూ వెళ్తారు.

-జి. కల్యాణి