Others

పాఠం చెప్పే పద్ధతి మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది డిజిటల్ యుగం. ఈనాటి తరానికి భిన్నమైన నైపుణ్యాలు అవసరం. నేను అమెరికాలో ఉన్నప్పుడు నేను వాడుతున్న సెల్‌ఫోన్ పాడైంది. అది మా అచ్చుకు ఇచ్చి దాన్ని సరిచేయమన్నాను. అచ్చు కూడా ఆ పని చేయలేకపోయాడు. అచ్చు చిన్నకొడుకు ఆ సెల్‌ను మా చేతుల్లోంచి గుంజుకున్నాడు. దాన్ని ఏం చేశాడో తెలియదు. ‘ఇదిగో.. సెల్ బాగైంద’ని రెండు నిమిషాల్లో నా చేతుల్లో పెట్టాడు. ఈనాడు పిల్లలకు కొత్త వస్తువును చూడటం, దాని ఆపరేషన్స్ కూడా గ్రహించగలుగుతున్నారు. ఇది ఈ తరం లక్షణం.
గత శతాబ్దంలో ఒక్కొక్క పరికరం 10 నుంచి 20 సంవత్సరాలు వాడకంలో ఉండేది. ఈనాడు రెండు మూడు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఏ పరికరం అయినా ఏ మోడల్‌ది అయినా వాడకంలో ఉండటం లేదు. కొత్త పరికరాన్ని వాడుకోవాల్సిన అవసరం కూడా తెలియవలసి ఉంది. ఒకప్పుడు పరీక్షలలో కూడా ఏ పాఠ్య పుస్తకం నుంచో, పాత ప్రశ్నపత్రాల నుంచో ప్రశ్నలు ఇచ్చేవారు. ఆ ప్రశ్నలతో కోచింగ్ సెంటర్లలో ప్రాక్టీస్ చేయించేవారు. ఈనాడు ఇంటర్వ్యూలలో మనం చూడని ఏదో ఒక పరికరం ఇస్తారు. దాని ఆపరేషన్ కూడా అభ్యర్థి అప్పటికప్పుడు తెలుసుకుని, దాన్ని ఆపరేట్ చేసి చూపించగలగాలి.
‘విద్యార్థి ఇంటర్వ్యూలో టెన్షన్‌లో ఉంటాడు. కొత్త పరికరాన్ని అర్థం చేసుకోవటమే కష్టం కదా! అభ్యర్థి బాహ్యశక్తి పైనే అతడి భవిష్యత్‌ను నిర్ణయిస్తే అది ఎంతవరకు సమంజసమని ఒక పారిశ్రామికవేత్తను అడిగాను.
‘ఈనాడు పుస్తకంలో ఉన్నటువంటి విషయమైనా, వాడుకలో వున్న పరికరమైనా ఆపరేట్ చేసే పరిజ్ఞానం ఉండాలి. కొత్త పరికరాన్ని ఎంత తొందరగానో గుర్తించగలుగుతారు. అదే ఈ శతాబ్దం లక్షణం అని’’ ఆ పారిశ్రామికవేత్త సమాధానం చెప్పాడు.
అందుకే ఐఐటి పరీక్షలో ప్యారాగ్రాఫ్ ప్రశ్నను ప్రవేశపెట్టారు. ఆ పేరాగ్రాఫ్‌లో మనం చూడని ఒక కానె్సప్ట్‌ను వివరిస్తారు. దానిని ఒక ప్రశ్న వేసి పేరాగ్రాఫ్ ప్రశ్నలిస్తారు. దాని అప్లికేషన్ ఎలా చేయాలో అడుగుతారు. ఈనాడు విద్యార్థి తనకు తెలియని కొత్త విషయాలను అర్థం చేసుకోవాలి. అదీ పరిమిత కాలంలో అర్థం చేసుకోవాలి. అదే ప్రతిభకు గీటురాయిగా మిగులుతుంది. దీన్నిబట్టి తరగతి గదిలో చదువుచెప్పే పద్ధతిలోనే సంపూర్ణ మార్పులు రావాలి.

- చుక్కా రామయ్య