Others

‘బరువెక్కిన’ బాల్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారుల్లో ఊబకాయానికి సంబంధించి ప్రపంచంలోనే మన దేశం రెండో స్థానం ఆక్రమించింది. భారత్‌లో 14.4 మిలియన్ల మంది పిల్లలు వయసుకు మించిన బరువుతో సతమతమవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. పిల్లల్లో ఊబకాయానికి సంబంధించి ప్రస్తుతం చైనా మొదటి స్థా నంలో నిలిచింది. అధిక బరువు కారణంగా పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న చిన్నారుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా చూస్తే రెండు బిలియన్లు దాటింది. కొవ్వు పెరగడం వల్ల రోగాల బారిన పడుతూ మరణిస్తున్న పిల్లల సంఖ్య ఆందోళనకరంగానే ఉన్నట్లు అధ్యయనంలో నిపుణులు తేల్చారు. ఊబకాయం వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ 2015లో నాలుగు మిలియన్ల మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. శరీర బరువు సూచీ (బిఎంఐ)కి మించి దాదాపు నలభై శాతం మంది చిన్నారులు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థకు చేటు కలిగిస్తున్నాయని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఊబకాయం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్ల పి ల్లలు, పెద్దలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రతి ముగ్గురిలో కనీసం ఒకరు శరీరంలో కొవ్వు కారణంగా పలురకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శరీర బరువు సూచీ (బిఎంఐ)కి మించిపోయి బరువు పెరగడంతో విశ్వవ్యాప్తంగా 108 మిలియన్ల చిన్నారులు, 600 మిలియన్ల పెద్దలు ఊబకాయంతో బాధపడుతూ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. తాజా అధ్యయనం ప్రకారం చైనాలో 15.3 మిలియన్ల పిల్లలు, భారత్‌లో 14.4 మిలియన్ల చిన్నారులు అధిక బరువుతో అవస్థలు పడుతున్నారు. పెద్దలకు సంబంధించి చూస్తే- అమెరికాలో అత్యధిక సంఖ్యలో (79.4 మిలియన్ల మంది) ఊబకాయం బారిన పడ్డారు. ఊబకాయంతో ఉన్న పెద్దలకు సంబంధించి చైనా (57.3 మిలియన్లు) ద్వితీయ స్థానంలో నిలిచింది.
ఊబకాయం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు, ప్రాణాపాయం కలిగించే ఇంకొన్ని వ్యాధుల బారిన పడుతున్నారని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్ట్ఫోర్ ముర్రే హెచ్చరిస్తున్నారు. ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పద్ధతులను నిర్లక్ష్యం చేస్తున్నందునే చాలామంది మితిమీరి బరువు పెరుగుతున్నారని, ఊబకాయం చాలావరకూ స్వయంకృతాపరాధమని నిపుణులు అంటున్నారు. ఏటా కొత్త సంవత్సరం ప్రారంభం రోజున- ‘బరువు తగ్గాలని’ చాలామంది అనుకుంటారని, అయితే ఏడాది గడిచే సరికి ఎలాంటి ఫలితాలు ఉండడం లేదని అధ్యయనంలో తేల్చారు. కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ సమస్య నుంచి బయటపడడం అసాధ్యమని నిపుణులు భావిస్తున్నారు. ఆరోగ్యంపై ఊబకాయం ప్రభావానికి సంబంధించి 195 దేశాల్లో అధ్యయనం చేశాక పలు ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. అధిక బరువు, శరీర బరువు సూచీ, క్యాన్సర్లకు మధ్య ఉన్న సంబంధంపైనా అధ్యయనం చేశారు. 1980వ సంవత్సరం తర్వాత సుమారు 70 దేశాల్లో ఊబకాయం సమస్య రెండింతలైంది. కొన్ని దేశాల్లో పెద్దల్లోనే ఊబకాయం సమస్య ప్రబలంగా కనిపిస్తోంది. మరికొన్ని దేశాల్లో మాత్రం పిల్లల్లోనే అధిక బరువు సమస్య ఆందోళనకర స్థాయికి చేరుతోంది.

-వింధ్య