AADIVAVRAM - Others

రోజూ పప్పన్నం నిత్య కళ్యాణమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: పప్పు తింటే గ్యాసు వస్తుందా? అది రోజూ తినకూడదంటారు నిజమేనా? పప్పు తింటే కలిగే లాభాలు ఏమిటి?
జ: ‘ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య/ ఉండ్రాళ్ల మీదికీ దండు పెంపు/ కమ్మని నెయ్యయ్య కడు ముద్ద పప్పయ్య/ బొజ్జ నిండా తినుము పొరలుకొనుచు’ అంటూ వినాయకుడికి ముద్దపప్పుని నైవేద్యంగా పెట్టేది స్థూలకాయం తగ్గుతుందనే! భోజనం దేహి రాజేంద్రా! ఘృతసూప సమన్వితం..’ అనే ప్రసిద్ధ శ్లోకంలో పప్పన్నం పెట్టవలసిందిగా రాజును కోరతాడు కవి. పప్పన్నం కుల మతాలకు అతీతమైన ఒక శారీరక అవసరం. ఒక వైద్యపరమైన అంశం కూడా!
మందబుద్ధిగా ఉన్నవాణ్ణి ‘ముద్దపప్పు’ అంటారు. దానర్థం పప్పు తింటే బుద్దిమాంద్యం ఏర్పడుతుందని కాదు, అది కదలకుండా వేసిన చోటే ఉంటుందని! కానీ, పప్పన్నం శరీర చలనానికి, చైతన్యానికి, నవజవాలు నింపడానికి కారణం అవుతుంది. పప్పన్నం భోజనంలో ఒక తప్పనిసరి!
‘పప్పన్నం ఎప్పుడు పెడతావు?’ లాంటి పిలుపులు, పలకరింపులు ఒకప్పుడు ఉండేవి. జొన్నకూడు, చింతతొక్కు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్క ఇవే ప్రధాన ఆహారంగా ఉన్న రోజులు గుర్తున్న వయోవృద్ధులు ఇంకా సజీవంగా ఉన్నారు. పెళ్లిలాంటి సందర్భాల్లోనే పప్పుతో కూడిన షడ్రసోపేతమైన భోజనం తినే అవకాశం ఉండేది. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, బఠాణీ, చిక్కుడు ఇలా ప్రొటీన్లు అధికంగా ఉండే ద్రవ్యాలన్నీ ఖరీదైనవే! కాబట్టి, ఆరుగాలం కష్టించినా గంజిలో మెతుకెరుగని పేద ప్రజలకు ప్రొటీన్ల కొరత తీవ్రంగా ఉండేది. అందుకే అంత ఆత్మీయంగా పెళ్లెప్పుడు చేసుకుంటావు అనడగడానికి పప్పన్నం ఎప్పుడు పెడతావని ఆశగా అడిగేవారు. రోజూ పప్పన్నం తినటం అంటే నిత్యకళ్యాణమే!
యావద్భారత దేశంలో తెలుగునాట పప్పన్నానికి ప్రాధాన్యత ఎక్కువ. ‘ఇలా చేస్తే పప్పులో కాలేసినట్టే’ ‘ఇక్కడ నీ పప్పులు ఉడకవు’ ‘పప్పుకూటికి ముందు వెట్టిమూటకు వెనక’ ‘అప్పు చేసి పప్పుకూడు’ లాంటి తెలుగు జాతీయాలు తెలుగు వారికీ ముద్దపప్పుకూ ఉన్న అనుబంధాన్ని చాటి చెప్తాయి.
రోజులు మారాయి. ప్రాజెక్టులు, జలవనరులు పెరిగాక జొన్నన్నం స్థానంలో తెల్లన్నం వచ్చింది. పంటకు, పంటకు విరామంలో అంతర పంటలుగా మినుములు, పెసలు, శనగల్లాంటివి పెంచేవాళ్లు. కాబట్టి ఆ రోజుల్లో పప్పు ధాన్యాలు కూడా అందుబాటు ధరల్లో దొరికేవి. ప్రపంచం మొత్తం మీద పండుతున్న కందుల్లో మూడు వంతుల పంట కేవలం భారతదేశంలోనే పండేది. కేవలం కందుల్ని పండించి ఎగుమతి చేసుకుంటే చాలు మన దేశ దారిద్య్రం తీరిపోయి ఉండేది. కానీ, మన ధ్యాస పత్తి, పొగాకు, మిరప పంటల మీద, చేపల చెరువుల మీదా ఉన్నంతగా పప్పు్ధన్యాల మీద లేకపోవటాన కందిపప్పు పంట తగ్గిపోయి, గత ఐదు సంవత్సరాలుగా తీవ్రమైన కరువొచ్చింది. దాని ధరలకు రెక్కలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు సరిగా ఉడకని రుచీ సువాసన లేని కందిపప్పుని విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
కందిపప్పు, పెసరపప్పు ధరలు ప్రియం కావటం వలన శరీరానికి ప్రొటీన్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. మాంసం, గుడ్లు సామాన్యుడికి మించిన భారంగా మారుతున్న వైనం అందరికీ తెలిసిందే! ప్రజలకు ప్రొటీన్లు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వానికి అలాంటి విధానం ఉండాలి.
ప్రొటీన్ల కొరత వలన లివరు దెబ్బతింటుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. శరీరానికి అవసరమైన ఆల్బుమిన్ లాంటి జీవ ప్రొటీన్లను లివర్ తయారుచేస్తుంది. ప్రొటీన్లు శరీరానికి తగినంత అందకపోతే లివర్ మీద వొత్తిడి పెరుగుతుంది. జీవనక్రియల నిర్వహణలో లివర్ తన సమర్థతను కోల్పోతుంది. లివర్ కణాల్లో కొవ్వు ఎక్కువగా చేరిపోతుంది. దీనే్న ‘్ఫటీ లివర్’ ‘లేదా ‘స్టియటోసిస్’ అంటారు.
కొవ్వుతో నిండిన లివర్ వలన జీర్ణశక్తి మందగించటం, కడుపులో అసౌకర్యంగా ఉండటం, ఆహారం తీసుకోబుద్ధి పుట్టకపోవటం లాంటి జీర్ణకోశ సమస్యలు ఏర్పడతాయి. స్థూలకాయానికి, షుగరు వ్యాధికి ఇది దారితీస్తుంది కూడా! పప్పు తింటే గ్యాసు రావడానికి కందిపప్పు లేదా పెసరపప్పు కారణం కాదు. లివర్ బలహీనంగా ఉండటం కారణం. నిజానికి ఈ సమస్యను లివర్ తనకు తానే పరిష్కరించుకో గలుగుతుంది. దెబ్బతిన్న కణాల స్థానే ఆరోగ్యవంతమైన కణాలను లివరు సృష్టించుకోగలదు కూడా! దాని అనుకూలమైన పరిస్థితిని మనం శరీరానికి అందించి సహకరించాలి. లేకపోతే చివరికి సిర్రోసిస్ లాంటి వ్యాధులకు పరిణమిస్తుంది.
ప్రొటీన్లు చాలినంత అందకపోవటం వలన లివర్ బలహీనపడటంతో మొదలైన కథ ప్రాణాంతక పరిస్థితి దాకా వెడ్తోన్న విషయాన్ని గమనించారు కదా! ఏదీ దీర్ఘవ్యాధిగా పుట్టదు. దాన్ని తొలి దశలోనే అర్థం చేసుకుని, సరిచేసుకుంటే కథ సుఖాంతం అవుతుంది. కానీ, అజాగ్రత్త వలన ఇంతదాకా తీసుకెళ్లేది మనమేనని కూడా గమనించాలి.
కందులు, పెసల్లాంటి పప్పులు కేన్సర్ వ్యాధి నిరోధకంగా పని చేస్తాయి. ప్రతిరోజూ పప్పు తప్పనిసరిగా తినే వారికి మహిళల్లో రొమ్ము కేన్సర్ ముప్పు, పురుషుల్లో ప్రొస్టేట్ కేన్సర్ ముప్పు తక్కువగా ఉంటుందని ఈ కొత్త అధ్యయనాలు చెప్తున్నాయి.
ప్రపంచ దేశీయులందరికీ ఎవరి సంప్రదాయ వంటకాలు వారికి ఉన్నాయి. కానీ ముద్దపప్పును మించిన వంటకం ఇంకొకటి లేదు. దాన్ని ‘లైఫ్ సేవింగ్ డిష్’ (ఎల్‌ఎస్‌డి) అని రచయిత సిమోన్ మజుందార్ పిలిచారు.
ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో పచ్చ కందిపప్పు, తెల్ల కందిపప్పు, ఎర్ర కందిపప్పు ఇలా కందిపప్పులో చాలా రకాల గురించి వివరించారు. తెల్ల కందిపప్పు ఆరోగ్యానికి మంచిది కాదనీ, పచ్చకందిపప్పు చలవ నిస్తుందనీ, ఎర్ర కందిపప్పు వేడి చేస్తుందని చెప్తారు. తెల్ల కందిపప్పుకు పసుపు రంగు వేసి అమ్ముతున్న మోసాలు ఇప్పుడు పెరిగాయి. పచ్చ కందిపప్పు కడుగుతున్న కొద్దీ పచ్చ నీళ్లొస్తున్నాయని గృహిణుల ఆరోపణ. దగాకోరులపైన దళారులపైన అదుపులేని ప్రభుత్వ వ్యవస్థ కారణంగా ఇలాంటివి జరుగుతాయి. కడుక్కొని తుడుచుకోవటం తప్ప మనం చెయ్యగలిగిందేమీ లేదు.
మనిషి వౌలికంగా మాంసాహారి. జైన బౌద్ధ ధర్మాల ప్రభావం వలన ప్రయత్న పూర్వకంగా శాకాహారి అయ్యాడు. ఆయుర్వేద శాస్త్రం వివిధ జంతువుల మాంసాల మంచీ, చెడు ప్రభావాల గురించి విపులంగా వివరించింది. కానీ, శరీర దారుఢ్యాన్ని పొందాలంటే మాంసానికి ప్రత్యామ్నాయంగా పప్పు్ధన్యాలేనని కూడా చాటి చెప్పింది.
పెసలూ, మినుములకన్నా కందులు తేలికగా అరుగుతాయి. తింటే ఉబ్బరం కలుగదు. దోరగా వేయించి వండితే తేలికగా అరుగుతాయి. శరీరంలో వేడిని తగ్గిస్తాయి. పప్పుగా వండుకోవటానికి శనగ, పెసరకన్నా అనువుగా ఉంటాయి. నీళ్ల విరేచనాల వ్యాధిలోనూ, కలరా లాంటి వ్యాధుల్లోనూ, జీర్ణకోశ వ్యాధులన్నింటిలోనూ కందిపప్పుని తినవచ్చు.
ప్రతిరోజూ భోజనంలో పప్పుని తప్పనిసరిగా తినండి. ఏది తిన్నా తినకపోయినా ముద్దపప్పు ఒక్కటీ భోజనావసరం తీరుస్తుంది. శరీర పోషకాల అవసరాలు కూడా తీరుస్తుంది. కూరగాయలు, పప్పు కలిపిన కలగూర వంటకాలు కూడా మేలు చేసేవే! కందిసున్ని కష్టంగా అరుగుతుంది గానీ, దండిగా ఉంటుంది. కంది, పెసర వంటకాలను కొద్దిగా నెయ్యితో తినటమే రుచికరం. ఆరోగ్యకరం. పప్పు దోషానికి నెయ్యి విరుగుడుగా పని చేస్తుంది.

**
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com