AADIVAVRAM - Others

మూడో వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమడోలు గ్రామంలో ఉంటున్న రామన్న ఓ చిన్న రైతు. తనకున్న అర ఎకరం పొలం సాగుచేసుకుంటూ భార్యాపిల్లలను పోషిస్తున్నాడు. పొరుగున వున్న రంగన్న పొలం దున్నడం అయ్యాక... అతని నాగలి ఎడ్లు తీసుకుని తన పొలం దున్నుకునేవాడు. రామన్న మంచితనం వలన ఉచితంగానే తన నాగలి, ఎడ్లు ఇచ్చేవాడు రంగన్న.
ఆ సంవత్సరం రామన్న పొలం దున్నుతుండగా ఒక కొయ్య నాగలికి తగిలింది. దాన్ని ముట్టుకునేసరికి దేవతామూర్తిగా మారింది. రామన్న ఆశ్చర్యపడి ఆ దేవతకు నమస్కరించాడు. ‘‘ఓ రామన్నా, నీ వల్ల నాకు శాప విమోచనం అయింది. ఏదైనా వరం కోరుకో’’ అంది దేవత. దానికి రామన్న ‘‘నా అర ఎకరం పొలం ఆరు ఎకరాలు కావాలి’’ అన్నాడు. ‘‘సరే... మరో వరం కోరుకో’’ అంది దేవత.
‘‘ఆ పొలం దున్నడానకి జత ఎడ్లు... నాగలి కావాలి’’ అని అడిగాడు.
దానికి దేవత ‘సరే’’ అంటూ ‘‘ఎవరైనా వరం కోరుకోమంటే బంగారం, డబ్బు కోరుకుంటారు. నువ్వేంటి? పొలం, ఎడ్లు అంటావు’’ అంది.
‘‘అమ్మా... నువ్వు అడిగితే బంగారం, డబ్బు ఇస్తావని తెలుసు. దానివలన నాకు సుఖంతో పాటు బద్ధకం, ఆపైన అనారోగ్యం, భయం కూడా వస్తాయి. అదే నువ్వు ఇచ్చిన ఆరు ఎకరాల పొలం దున్ని పండిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ వస్తాయి. నా పంట నేనే పండించుకున్నానన్న తృప్తి వుంటుంది’’ అని బదులిచ్చాడు.
‘‘అమ్మా... మరో మాట. ఆరు ఎకరాల పొలం సాగులో కొందరికి పని కల్పించే వీలు కూడా వుంటుంది’’ అన్నాడు నమ్రతగా.
‘‘చాలా బాగుంది. అందుకే నువ్వు ఏ పంట వేసినా బంగారంలా పండేలా మూడో వరం ఇస్తున్నాను. తథాస్తు.’’ అని మాయమైంది దేవత.

- కూచిమంచి నాగేంద్ర, 7093931474