AADIVAVRAM - Others

విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుందేలు అవమానభారంతో కుంగిపోతోంది. తోటి కుందేళ్లన్ని ‘తాబేలుతో పరుగు పందెంలో ఓడిపోయావా?’ అంటూ గేలి చేస్తున్నాయి. తనలో తను ఆత్మవిమర్శ చేసుకుంది. నా అహంకారం, తాబేలు పట్ల చులకన భావం నేను ఓడిపోయేలా చేశాయి. లాభం లేదు. మరొకసారి తాబేలును పోటీకి పిలిచి గెలిస్తే గాని నా పరువు నిలబడదు అనుకుని తాబేలును పరుగు పందానికి సిద్ధం చేసింది. ఈసారి పోటీలో కుందేలు ఎక్కడా విరామం తీసుకోక పరుగు మీద శ్రద్ధ పెట్టి అవలీలగా గమ్యం చేరుకుంది. తాబేలు వినయంగా ఓటమిని ఒప్పుకుంది. విజయం రుచి చూసిన కుందేలు ‘నీలాటివారు నిదానమే ప్రధానం అనే పంథాలో మాత్రమే విజయాలు పొందుతారు. నేను వేగంతో విజయాన్ని పొందుతాను’ అని డప్పాలు పలికింది.
‘‘సరేలే మిత్రమా నీలో వేగం, చురుకుదనం నిన్ను గెలిపించాయి. కాని అప్పుడప్పుడు ఆలోచనా బలం కూడా ఉండాలి’’ అని అంది.
దానికి కుందేలు తనను తక్కువ చేసి మాట్లాడుతుందనుకుని పొరపాటు పడి ‘‘సరే రేపు మళ్లీ పోటీ పెట్టుకుందాం. నీ ఆలోచనతో నీవు గెలుస్తావో, నా వేగంతో నేను గెలుస్తానో చూద్దాం’’ అంది.
మర్నాడు పోటీకి సిద్ధమవడానికి ముందు తాబేలు ‘‘మిత్రమా నిన్న ఆ మార్గం గుండా వెళ్లాం. ఈరోజు ఈ మార్గం గుండా వెళదాం’’అంది.
‘‘సరే ఏ మార్గం గుండా వెళితే ఏమిటి గెలిచేది నేనే కదా’’ అని కుందేలు పరుగు లంకించుకుంది. తాబేలు నిదానంగా సాగుతోంది. కుందేలు వెళ్లే మార్గంలో ఒక సెలయేరు అడ్డుగా ఉంది. అది దాటితేనే కాని గమ్యాన్ని చేరలేదు. ఈ యేరు ఎలా దాటాలా అని ఆలోచనలో పడింది. ఇంతలో తాబేలు వచ్చి చక్కగా సెలయేరులో ఈదుకుంటూ ఒడ్డుకు చేరి మెల్లగా తన విజయగమ్యాన్ని చేరింది. కుందేలు బిక్కమొహం పెట్టుకుంది. తాబేలు మాటలో నిజాన్ని గ్రహించింది కుందేలు. పోటీకి దిగే ముందు ఈ మార్గంలో నీటి ప్రవాహం ఉందని గ్రహించలేదు. ఆలోచన లేకుండా సై అన్నాను. ఇది నా తప్పే అనుకుంది.
విజయం పొందిన తాబేలు కుందేలుతో ‘‘ఏమంటావు మిత్రమా’’ అని ప్రశ్నించింది.
‘‘ఈ మార్గం గుండా కనుక ఓడిపోయాను’’ అని సమాధానమిచ్చింది.
‘‘అందుకే పోటీకి ముందు ఆలోచించాలి. సరే కానీ రేపు ఈ మార్గం గుండానే వెళ్లి ఇద్దరమూ విజయం సాధిద్దాం’’ అంది తాబేలు.
‘‘అదెలా’’ అంటూ ఆశ్చర్యంగా అడిగింది కుందేలు.
‘‘అదెలాగో నేను చెబుతాను. నువ్వు పోటీకి సిద్ధంగా ఉండు’’ అంది తాబేలు.
మర్నాడు పోటీకి రెండూ పోటీకి దిగాయి.
కుందేలు సెలయేటి ఒడ్డునే ఆగిపోయింది.
నెమ్మదిగా తాబేలు అక్కడికి చేరింది.
‘‘మిత్రమా నీవు నా మూపురముపై కూర్చో. నేను నిన్ను అవతలి ఒడ్డుకు చేర్చుతాను’’ అంది. కుందేలుకు తాబేలు పట్ల నమ్మకం ఉంది. సరేనని తాబేలుపై కూర్చుని అవతలి ఒడ్డుకు చేరింది.
అవతలి ఒడ్డుకు చేరిన వెంటనే కుందేలు పరుగు ప్రారంభించింది. శ్రమ పడి ఉన్న కుందేలు చాలా నెమ్మదిగా సాగుతోంది. కుందేలుకు మధ్యలో ఆలోచన కలిగి ఆగి వెనక్కి వచ్చి ‘‘మిత్రమా తాబేలు నన్ను క్షమించు. నేను గెలుపుని మాత్రమే చూసుకున్నాను. నీవు సహకారం కూడా చేశావు. నీవు అన్నది నిజమే ఇద్దరం సహకార భావంతో విజయాన్ని పొందుదాం. నాపై కూర్చో నిన్ను వేగంగా గమ్యానికి చేర్చుతా’’ అంది.
సహాయ గుణం, స్నేహబలమే కదా విజయపథంలో నడిపించేవి.

- చావలి శేషాద్రి సోమయాజులు, సెల్ : 9032496575