Others

నాకు నచ్చిన చిత్రం-- మనసే మందిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జీవితంలో పవిత్రమైన ప్రేమకున్న స్థానం చాలా గొప్పది. ప్రేమకు మూలం త్యాగం. అటు ప్రేమను, ఇటు త్యాగాన్ని గెలుచుకున్న వ్యక్తి కీర్తి సోపానానికి పాత్రుడవుతాడు. ఒక్కరినే ప్రేమించి పదిమంది కోసం జీవించి, తన ప్రేమను త్యాగం చేసి ప్రాణానికి ప్రాణం ఇచ్చిన వ్యక్తి దైవసమానుడు అవుతాడు. అటువంటి ఉత్తమ వ్యక్తి హృదయం దేవాలయం అవుతుంది. ఆ మానవుడు మరణించినా అమరుడే అవుతాడు. అతని నివాసమే మందిరంగా మారిపోతుంది. డాక్టర్ రఘు, సీత ప్రేమించుకున్నా సఫలం కాకపోవడంతో అతడు ఒక నర్సింగ్‌హోం స్థాపించి కేన్సర్ రోగులకు చికిత్స చేస్తూ వారి పాలిట దేముడిగా మారతాడు. అనుకోని పరిస్థితులలో రాము అనే వ్యక్తిని పెళ్లిచేసుకున్న సీత, కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన భర్తను కాపాడమని వేడుకుంటుంది. ఒకసారి చాటుగా వారి సంభాషణలు విన్న రాము, వారి పవిత్ర ప్రేమను, సీతకు తన పట్ల ఉన్న అనురాగాన్ని గ్రహించి ఏ కారణం చేతనైనా తాను మరణిస్తే డాక్టర్ రఘును పెళ్లిచేసుకోవాలని సీత దగ్గర మాట తీసుకుంటాడు. తన భర్త మరణిస్తే తానూ మరణిస్తానేగానీ ఇతరులను వివాహం చేసుకోబోనని డాక్టర్ రఘుతో సీత గట్టిగా చెబుతుంది. తన సర్వశక్తులు ఒడ్డి రామును బ్రతికించి ఆ శ్రమలో తన ప్రాణాలు కోల్పోతాడు డాక్టర్ రఘు. రాము-సీత అతని జ్ఞాపకార్థం పెద్ద కాన్సర్ హాస్పిటల్ నిర్మిస్తారు. నిజమైన ప్రేమ, త్యాగం, మానవత్వం, మానవ విలువలకు, సంఘర్షణలకు దర్పం పట్టే పాత్రలో అక్కినేని, సావిత్రి, జగ్గయ్య జీవించారు. ప్రముఖ దర్శకుడు శ్రీ్ధర్ ప్రతీ సన్నివేశాన్ని నడిపిన తీరు అభినందనీయం. ఇంత ఉదాత్తమైన చిత్రానికి ఎం.ఎస్.విశ్వనాధ్ స్వర రచనలో, ఆచార్య ఆత్య్రేక రచనలో జాలువారిన గీతాలు ‘‘తలచినదే జరిగినదా’’(పి.బి.ఎస్), చల్లగ ఉండాలి (ఘంటసాల), అల్లారుముద్దు కదే (సుశీల) వంటి గీతాలు నేటికీ అలరిస్తున్నాయి. తాను ప్రేమించిన యువతి వేరొకరిని వివాహం చేసుకుని తన దగ్గరకు వైద్యానికి వస్తే ప్రాణదానం చేసి అశువులు బాసిన ఒక వైదుడి కథ. వైద్య వృత్తి గౌరవాన్ని పెంచిన చిత్రం.

-ఎస.ఎస్.శాస్ర్తీ, విశాఖపట్నం