Others

అందమైన అబద్ధం!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు టాలీవుడ్ నటీనటులు మీడియా ముందో, వారి ఫేస్‌బుక్‌ల్లోనో వినిపించే చిలుక పలుకులు వింటే నవ్వొస్తోంది. ‘దర్శకుడు కథ చెబుతున్నపుడే కనెక్టైపోయాను. తప్పక చేయాల్సిన కథ. సందేశం ఉంది. నాది మానవత్వం, మంచితనం మూర్త్భీవించిన పాత్ర. అందుకే ఆలోచించకుండా సైన్ చేసేశాను’ అని కొందరంటారు. ‘ముందు కథ నాకు నచ్చాలి. నా పాత్రకు ప్రాధాన్యత వుండాలి. ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకునే పాత్ర, నటనకు ఆస్కారం వున్న పాత్రలే అంగీకరిస్తాను’ అని గొప్పలు చెప్పేవారు ఇంకొందరు. ‘నా చేతిలో నాలుగు ప్రాజెక్టులున్నాయి. మరో మూడు డిస్కషన్‌లో ఉన్నాయి, ఫైనలైజ్ కావాలి. ఐదేళ్లవరకు నా డైరీ ఖాళీ లేదు. నాకు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు కాబట్టి ఈ సినిమా అంగీకరించా’ అని మరికొందరు చెప్పడాన్ని వింటూనే ఉన్నాం. పైనచెప్పుకున్న వాటన్నింటికీ ఓ కామన్ కొటేషన్ మాత్రం కంటిన్యూ అవుతుంటుంది. అది ‘నాకు పారితోషికం ముఖ్యంకాదు’ అని. హీరోలు, హీరోయిలు తమ పాత్రలకు ఇన్ని మంచి లక్షణాలు చూసుకుని, తమ కథల ఎంపికకు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా -మెజారిటీ సినిమాలు ఎందుకు ఢమాల్‌మంటున్నాయి? ఈ ప్రశ్నకు వాళ్లదగ్గర సమాధానం ఉంటుంది, కానీ చెప్పలేరంతే. కారణం -్భరీ పారితోషికం. డబ్బొస్తుంటే ఎవరు వద్దంటారు చెప్పండి. కోట్ల పారితోషికం ఆఫర్ చేస్తున్నపుడు -కథను చూసి కాదని చెప్పేవాళ్లు ఉంటారనుకోవడం వెర్రితనం. వారం వారం నాలుగేసి సినిమాలు థియేటర్లకు వస్తున్నా ఎందుకు ఆడటం లేదంటే -ఎత్తిపోతల పథకం ఆరంభం.. చిత్రం చిరునామా గల్లంతన్నట్టే ఉంటుంది కనుక. మంచి కథ, మంచి పాత్రవుంటే చిత్రం అట్టర్ ఫ్లాప్ ఎలా అవుతుంది? ఎందుకవుతుంది?
ఇప్పుడొస్తున్న చిత్రాల్లోని నటీనటుల గొప్ప పాత్రలను పరిశీలిస్తే -ప్రతి చిత్రంలో ఓ తల్లి, ఓ తండ్రి. ఇద్దరు బంధువులు. హీరో, హీరోయిన్.. వాళ్లకు పనీపాటా లేని స్నేహితులు. ఎక్కడో ఓ లాయరు. వీధిచివరో డాక్టరు. ఓ కాలేజీ లేదంటే పోలీస్‌స్టేషన్. గ్రూప్ సాంగ్ కోసం యాభై అరవై మంది ఎక్స్‌ట్రాలు. ఘోర ఫైట్ల కోసం గడ్డాల మీసాల అనుచరులు.. ఇవేగా ప్రస్తుత సినిమాల్లోక కనిపించే పాత్రలు. నలుగురు విలన్లు, వెంట యాభైమంది బాడీబిల్డర్లు.. ఇవేవైనా గుర్తుంచుకునే పాత్రలా? స్ర్తిపాత్రలెన్ని వున్నా అలా కన్పించి ఇలా వెళ్లేవే. నాయిక తల్లి.. నాయకుని తండ్రి.. ప్రాధాన్యతంటూ ఉండదు. నటించతగ్గ, గుర్తుంచుకోతగ్గ పాత్ర ఒక్కటీ కనిపించదు. హీరోయిన్ల పాత్రల విషయానికి వస్తే అప్పుడప్పుడు కనిపించడం, కాలేజి వద్దో, హోటల్ వద్దో, మరేదో గార్డెన్‌లోనో ‘ఐ లవ్యూరా’ అనడం.. ప్రేమ మైకంలో విదేశాల్లో మాస్ సాంగ్సేసుకోవడం... ఇలాంటి పాత్రల్ని ఎంపిక చేసుకోవడానికి ఎంతకంత కష్టపడి ఆలోచించాలి. వాటిల్లో గొప్పతనమేముందని?
టాలీవుడ్‌లో స్ర్తిపాత్రలు నామ్‌కే వాస్తే. పురుషుల పాత్రలకొస్తే హెడ్ విలన్, బుర్రలేని అతని పుత్రరత్నం, వెంట రౌడీలు, వాళ్ల చేతుల్లో తన్నులుతినే హీరో తండ్రి, పగ తీర్చుకునే హీరో.. కర్రలు, రాడ్లు, గన్‌లు, పిస్టల్స్, నాటు బాంబులు, సుమోలు.. ఇవీ ప్రాపర్టీలు. కోట్ల పారితోషికం కోసం కాకపోతే, ఇలాంటి పాత్రల్ని ఎంపిక చేసుకోవడానికి కసరత్తులు చేయాలా? దర్శకుడు చెబుతున్నపుడే కనెక్టైపోవాలా? సినిమా చూసిన మూడోరోజకే మర్చిపోయే పాత్రలు చేస్తున్న హీరోలు, కథల గురించి, వాటిలోని పాత్రల గురించి ఎందుకంత అందమైన అబద్ధాలు చెప్పటం.

-మురహరి ఆనందరావు