Others

పవన్ చిత్రంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్తారింటికి దారేది చిత్రంలో అత్తగా నటించిన నదియాకు ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో కూడా అలాంటి పాత్రలు ఉండబోతున్నాయట. ఇప్పటికే ఈ సినిమా కోసం నటి ఖుష్బూను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మరో పాత్ర కూడా కీలకమైనది ఉన్నదట. ఈ పాత్రకోసం సీనియర్ నటి ‘సొగసు చూడతరమా’ ఫేం ఇంద్రజను ఎంపిక చేయనున్నారట. ఇటీవల కూడా రెండు మూడు సినిమాల్లో కనిపించిన ఇంద్రజకు సరైన గ్రిప్ మళ్లీ దొరకలేదు. ఎందుకంటే, ఆమె పాత్ర అంతంతమాత్రంగా ఉండడంతో. కానీ ఇప్పుడు నటిస్తున్న ఈ చిత్రంతో మరోసారి ఇంద్రజ లైమ్‌లైట్‌లోకి రానున్నదట. తండ్రి మరణంమీద ప్రతీకారం తీర్చుకునే రెండు కీలకమైన పాత్రల్లో ఒకటి ఇంద్రజ నటిస్తోందట. ఒకవేళ అలాంటి పాత్రలో కనుక ఇంద్రజ నటించింది అంటే నదియా రేంజ్‌లో గుర్తింపు రావడం ఖాయం. అలా ఇంద్రజ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలని అందరూ కోరుకుంటున్నారు.