Others

అమృత ఫలం దానిమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దానిమ్మ పండుకు అనేక శతాబ్దాలనుండీ ప్రాచుర్యం వుంది. ఈజిప్టు ప్రాంతంలో వివిధ ప్రదేశాలలో, గృహాలలోనూ దానిమ్మ ఎక్కువగా పెంచబడుతుండేది. అందమైన ఎర్రని దానిమ్మ గింజల్లో అత్యధికంగా పోషక విలువలు, విటమిన్లు ఉన్నాయి. దానిమ్మ పండును వాడటంవలన అనేక ఆరోగ్య ఫలాలు అందుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆరోగ్యానికే కాకుండా సంతా న సాఫల్యానికి పూర్తిస్థాయి యవ్వ
నోత్తేజానికి తిరుగులేని పండు దానిమ్మ. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అమృతఫలం. ప్రతిరోజూ ఒక గ్లాసు దానిమ్మరసం తాగుతుంటే డయాబెటిస్, ప్రోస్టేట్ కాన్సర్లను విజయవంతంగా ఎదుర్కోవచ్చును. పీచు కూడా దానిమ్మలో అధికంగా ఉండటంవలన మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దానిమ్మ
గింజలు నములుతుంటే ఎక్కువ సమ యం ఆకలి కాదు. అధికఆహారం తీసుకోవాల్సిన అవసరం రాదు.
గుండె రక్తనాళాలకు సరైన ఆహార పదార్థం ఇది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో రక్తపోటును నియంత్రించడంలో దానిమ్మలోని ఔషధ గుణాలు బాగా సహకరిస్తాయి. పండులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి సమృద్ధిగా ఉండి దాదాపు అన్ని రకాల రుగ్మతలను అరికట్టడంలో సహకరిస్తుంది.
జీర్ణక్రియ మెరుగుపడటానికి, ప్రేగుల శుద్ధి పడటానికి, ఆడవారిలో మెనోపాజ్ దశలో వచ్చే సమస్యలకు హార్మోన్ల సమతుల్యతకు దానిమ్మ రసం వాడకం గొప్ప పరిష్కారం. సలాడ్ల తయారీలోనూ, అనేక రకాల మల్టీ విటమిన్ జ్యూస్‌ల తయారీలలోనూ దానిమ్మను తప్పక వాడతారు. ఇవి పెరటిలోనూ, కుండీలలోనూ కూడా పండించే వీలుంది.

- హిమజా రమణ