Others

సంక్షోభంలో బ్యాంకింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ ఆర్థిక వ్యవస్థలో పొదుపును, పెట్టుబడులను పెంచడంలో బ్యాంకులదే కీలకపాత్ర. బ్యాంకుల జాతీయకరణ లక్ష్యం కూడా ఇదే. సామాజిక రంగంలోనూ బ్యాంకులు పేదలకు అనేక కార్యక్రమాలు అమలు చేశాయి. అయితే, ఇటీవల ఈ దిశగా ప్రగతి మందగించింది. బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో చిక్కుకుంది. బ్యాంకుల వద్ద నిరర్థక ఆస్తులు విపరీతంగా పెరిగాయి. దీంతో బ్యాంకింగ్ రంగం దెబ్బతినడమే కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల పని తీరు బాగుండలేదు. మొత్తం బ్యాంకింగ్ వ్యాపారంలో ఈ బ్యాంకుల వాటా 72 శాతం, లాభాలు మాత్రం 42 శాతమే. రుణ ఎగవేతదారుల జాబితాలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నారు.
1991 తర్వాత ఆర్థిక సంస్కరణల కాలంలో మొండి బకాయిలు తగ్గుముఖం పట్టాయి. రుణాలలో మొండి బకాయిల శాతం 1996-97లో 15.7 ఉంటే 2008-09లో 2.3కి తగ్గింది. ఈ పరిస్థితి ఎంతోకాలం కొనసాగలేదు. ఈ శాతం 2012-13 నాటికి 3.4కి, 2014-15కి 4.6కి, 2015-16కి 7.6కి పెరిగింది. వాణిజ్య బ్యాంకుల మొండి బాకీలు డిసెంబర్ 2015 నాటికి 4,01,590 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ 30, 2016 నాటికి మొండి బకాయిలు 6.3 లక్షల కోట్ల రూపాయలుగా వున్నాయి. త్వరలోనే ఇది 7 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని అంచనా. మొండి బాకీల పెరుగుదలకు అనేక కారణాలున్నాయి. ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల భారీ ప్రాజెక్టులు కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి. బ్యాంకులు ఇచ్చిన రుణాలు మొండి బాకీలుగా మిగిలాయి. రుణబాకీలు పునర్ వ్యవస్థీకరణ జరిగినా పరిస్థితిలో మార్పులేదు. 1970లు, 1980లలో నిర్వహించిన బ్యాంకు రుణమేళాల వల్ల కీడే జరిగింది. వీటివల్ల ఉద్దేశ పూర్వకంగా బాకీలు చెల్లించని వారి సంఖ్య పెరిగింది. మాఫీ జరుగుతాయన్న ఆశతో చాలామంది రుణాలు చెల్లించడం లేదు.
మొండి బకాయిలకు ప్రాధాన్య రంగ రుణాలు కారకమైనా, ఎక్కువ బాధ్యత వహించవలసిన రంగాలు వౌలిక వసతులు, ఇనుము-ఉక్కు పరిశ్రమ, టెక్స్‌టైల్స్, విమానయానం, గనులు వంటివి. బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల కూడా మొండి బకాయిలు పెరిగాయి. ఒక పరిశ్రమ కష్టాల్లో పడితే తొలిదశలోనే బ్యాంకులు చర్యలు తీసుకోవాలి. ఖాయిలా పడ్డ పరిశ్రమల వల్ల మొండి బకాయిలు తీవ్రస్థాయికి చేరాయి. కొన్ని మొండి బకాయిలను బ్యాంకులు వదలుకోవచ్చు. అయితే రుణాల మంజూరులో మరింత శ్రద్ధ చూపాలి. తగురీతిలో సమీక్షించి రుణాలను ఏవిధంగా వినియోగిస్తున్నది పరిశీలించాలి. ప్రస్తుతం గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో బ్యాంకింగ్ కార్యక్రమాల విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొండి బకాయిలను అరికట్టడానికి బ్యాంకులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఒక రుణం నిరర్ధక ఆస్తిగా మారిందని తెలిస్తే ఆ సంస్థ యాజమాన్యాన్ని మార్చే అధికారం బ్యాంకులకు ఉంది. బ్యాంకులు ఈ విషయంలో శ్రద్ధ చూపాలి. దేశంలో మొండి బాకీలకు 50 అతిపెద్ద ఖాతాలే కారణమని తేలింది. ఉద్దేశ పూర్వకంగానే ఈ ఖాతాదార్లు రుణాలను ఎగస్తున్నారు. మొండి బాకీలను తగ్గించడానికే బాడ్ బ్యాంక్ స్థాపించాలని ఒక ప్రతిపాదన ఉంది. దీనిద్వారా ప్రభుత్వ బ్యాంకుల నష్టాల్ని తగ్గించవచ్చని ఒక ఆలోచన. కేవలం మూలధనం సమకూర్చడం ద్వారా సమస్య సమసిపోదని ప్రభుత్వం గ్రహించాలి. మొండి బకాయిలను తగ్గించడంలో ఆడిటర్లకూ బాధ్యత ఉంది.

-ఇమ్మానేని సత్యసుందరం