AADIVAVRAM - Others

ఫ్రాణాంతకమైన ఫ్రెంచి వేపుడు ( మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: బజార్లో దొరికే ఆలూచిప్స్, ఇతర వేపుడు వంటకాలను తినవచ్చా?
-జె.దినకర్ (జగిత్యాల)
జ: చావుకు పెడితే గానీ లంఖణానికి రారని ఒక సామెత. చావు ఎవరికైనా ఎప్పుడైనా తప్పదు. కానీ, రేపెప్పుడో వచ్చేదాన్ని ఇప్పుడే తెచ్చుకునే పనులు మనం చేస్తున్నపుడు హెచ్చరించాల్సిన బాధ్యత వైద్య సమాజానికుంది. ఆలుదుంపల వేపుడు ఇష్టంగా తింటున్నప్పుడు దాని గురించి నిజాలు తెలుసుకోవటం అవసరం కూడా.
టూత్‌బ్రష్ లాగా ఉండే మీసకట్టుని ఫ్రెంచికట్ అంటారు. దొంగ సెలవులు పెట్టి డ్యూటీలు ఎగ్గొట్టడాన్ని ఫ్రెంచి లీవు లంటారు. ఫ్రెంచి పేరుతో ఇలాంటి వ్యవహారాలు తెలుగులో అనేకం వ్యాప్తిలో ఉన్నాయి. ఫ్రెంచి వేపుడు వాటిలో ఒకటి. ఆలూ దుంపల తురుము లేదా తరుగుని నూనెలో పోసి వేయించి, దానిపైన మసాలా కారం చల్లితే అదే ఫ్రెంచి వేపుడు. ‘శ్నాక్స్’ని అమెరికాలో ఇలా తింటారు. అమెరికాని అన్ని విధాలా మించిపోవాలనే ఏకైక ధ్యేయంతో ఉన్న తెలుగువాళ్లు ‘ఫ్రెంచి ఫ్రై’లను అన్నంలో కూరగా తింటున్నారు.
తింటే ఏవౌతుందనే అంశం మీద 2017 జూన్ 15న మెడ్ న్యూస్ టుడే జర్నల్లో Honor Whiteman ప్రచురించిన ఒక వ్యాసం మన ఆహార విధానం గురించి అనేక ఆలోచనల్ని రేకెత్తించేదిగా ఉంది. ఆలుదుంపలు బ్రిటిష్ యుగంలో అమెరికా నుండే మనకు సంక్రమించాయి. వాళ్లకు పొటాటోలు ప్రధాన ఆహార ద్రవ్యం. స్వాతంత్య్రోద్యమ కాలంలో బ్రిటీష్ మీద ఉన్నట్టే, ఈ ఆలుదుంపల మీద కూడా ద్వేషం ఉండేది మన వాళ్లకి. స్వాతంత్య్రం వచ్చాక నెమ్మదిగా వాటిని అలవాటు చేసుకోవటం ప్రారంభించారు. అర్ధరాత్రి పూట అనుకోకుండా వచ్చే అతిథికి అప్పటికప్పుడు వండేందుకు ఎక్కువగా వీటిని ఉపయోగించే వాళ్లు.
ఫ్రెంచి వేపుడు పద్ధతిలో వండుకోవటం వలనే ఆలుదుంపలు విషపూరితం అవుతున్నాయి. అమెరికన్ వ్యవసాయ శాఖ ఒక నివేదికలో ఆలుదుంపల ఫ్రెంచి వేపుడు వాడకం 1960లో 35% ఉంటే 2000 నాటికి అది 64%కి పెరిగిందని పేర్కొంది. ఈ 17 ఏళ్లలో అది కనీసం 80% వరకూ పెరిగినా ఆశ్చర్యం లేదు.
4,440 మంది కీళ్లవాత రోగుల మీద ఆలుదుంపల ప్రభావం గురించి ఎనిమిదేళ్లపాటు జరిపిన అధ్యయనంలో ఆలు వేపుడు వంటకాలు అపకారం చేసేవిగా ఉన్నాయని ఒక నివేదికను ఈ సందర్భంగా ఉదహరించారు. ఫ్రెంచి ప్రైస్, పొటాటో చిప్స్, హాష్ బ్రౌన్స్ ఇవి తినని వాళ్లలో ఈ ప్రమాద ఘంటికలు తక్కువని కూడా ఈ నివేదిక చెప్తోంది. ‘్దళ చిళజిఖళశఆ ష్యశఒఖౄఔఆజ్యశ యచి చిజళజూ ఔ్యఆ్ఘఆ్యళఒ ఘఔఔళ్ఘూఒ ఆ్యఇళ ఘఒఒ్యషజ్ఘఆళజూ తీజఆ్ద ఘశ జశషూళ్ఘఒళజూ యూౄఆ్ఘజఆక జఒరీ’ అని ఈ పరిశోధన నిర్ధారించింది. ఆలుదుంపల కారణంగా సంభవిస్తున్న మరణాలను అధ్యయనం చేయటం ఈ వ్యాసం లక్ష్యం.
ఆలుదుంపలే కాదు కోమలమైన కూరగాయలు వేటిని అధిక ఉష్ణోగ్రత దగ్గర వేయించినా అందులో ఎక్రిలమైడ్ రసాయనం పుడుతుందని, అది కేన్సర్‌కు దారితీస్తుందనీ అనేక పరిశోధనలు ప్రపంచ మానవాళిని హెచ్చరిస్తున్నాయి. ఆలుదుంపల గురించి ప్రత్యేక చర్చకు ఒక కారణం ఉంది. దుంప కూరల్లో కెల్లా కోమలమైనవి ఆలుదుంపలు. కఠినమైనది కర్రపెండలం. కర్రపెండలానికి ఇచ్చే ఉష్ణోగ్రతని ఆలుదుంపలకు ఇవ్వటం వలన ఆ ఆహారం విషపూరితం అవుతుంది. ఇవి చాలా చిన్న విషయాలు. సాధారణంగా మనం అశ్రద్ధ చేసేవి. ఇవే భయానక వ్యాధులకు కారణం అవుతున్నాయి.
ఈ చర్చల సారాంశాన్ని ఇలా మనం అర్థం చేసుకోవచ్చు.
1.వేపుడు కూరలు తెలుగు వారి ప్రాచీన ఆహార సంస్కృతిలో భాగం కాదు. వాటిని పాశ్చాత్యుల నుండే తెచ్చుకున్నాం. పకోడీ (పకోడీలో కోడి అంటే జొన్నపిండి. దానితో వండిన వంటకం పకోడీ), చక్కిలం (బియ్యప్పిండితో చేసిన చక్రాలు, కారప్పూస వగైరా) ఇలాంటివి నూనెలో వేసి వేయించుకుని ఆ రోజుల్లోనూ తిన్నారు. కానీ, అవి ఎప్పుడో ఒకసారి సరదాగా తిన్నవే! జొన్నపిండి, బియ్యప్పిండిల కన్నా శనగపిండి కోమలమైనది. శనగపిండి వంటలను నూనెలో వేయిస్తే ఎక్కువ ‘ఎక్రిలమైడ్’ పుడుతుంది.
2.వండవలసిన అవసరం లేని క్యారెట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటా, కొత్తిమీర, సొరకాయ, బూడిద గుమ్మడి, క్యాబేజీ ఇలాంటి వాటిని సాధ్యమైనంత వరకూ వండకుండానూ, వండినా చాలా తక్కువ ఉష్ణోగ్రత దగ్గర వండుకు తినాలి. నిమ్మరసం, టమోటాలు పొయ్యిమీద కెక్కకూడదు.
3.రోజువారీ తినడానికి ఇగురు కూరలే అనుకూలం. వాటిలో చింతపండు రసం, అల్లం వెల్లుల్లి గ్రేవీ, శనగ పిండి లాంటివి అతిగా కలపటం లేదా నూనెలో వేయించటం వలన కూరలు అనేక విధాలుగా అపకారం చేస్తున్నాయి. ఇలాంటి కూరల్ని ఎప్పుడో ఒకసారి సరదాగా తినాలే గానీ రోజూ తినాలనుకోకూడదు.
4.మన వేపుడు కూరలన్నీ ఫ్రెంచి వేపుడుని మించినవే గానీ, తక్కువేమీ కాదు. వేపుడు కూరలు విషాహారాల్లో ముఖ్యమైనవి.
వేపుడు కూరల విషయంలో మన దృక్పథంలో మార్పు రావాలని ఈ అమెరికన్ పరిశోధకులు నొక్కి చెప్తున్న విషయం. మన ఆహారపు అలవాట్ల మీద సర్వేలు చేసి, ఆ నివేదికలను బహిర్గతపరచి, తగిన సూచనలిచ్చే యంత్రాంగం మన దేశంలో లేదు. ఉండి ఉంటే, కనీసంలో కనీసంగా 80 శాతం మంది తెలుగు వాళ్లు వేపుడు కూరలను ప్రధాన ఆహారంగా తీసుకుంటున్న నిజం వెల్లడి అవుతుంది. అర్ధాయుష్కులుగా మారటానికి ఇవి ప్రధాన కారణాలౌతున్నాయి.
**
- డా. జి.వి.పూర్ణచందు
సెల్ : 9440172642
purnachandgv@gmail.com
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002