Others

ఎండల్లో హాయిహాయిగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండాకాలం వచ్చిందంటే చాలు అమ్మాయిలు చర్మసౌందర్యం పట్ల మరింత శ్రద్ధ చూపించటం మొదలుపెడతారు. మిగిలిన కాలాల్లో కాంతులీనుతూ ఉండే చర్మం ఎండాకాలం వచ్చేసరికి మొహం పొడిబారి పోయినట్టు, జీవం లేనట్టు తయారవుతుంది. అలాంటప్పుడు రోజులో ఒక్క 10 నిమిషాలు ఈ సమస్యకోసం టైం కేటాయిస్తే చాలు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఎండల్లో కూడా హాయిహాయిగా ఉండచ్చు.
ఎండలలో బయట తిరిగి ఇంటికి రాగానే ముందుగా మొహాన్ని శుభ్రం చేసుకోవటం మంచిది. సబ్బులతో పనిలేకుండా ఇంట్లోనే క్లెన్సింగ్‌మిక్స్‌ను తయారుచేసుకోవచ్చు. కాస్త బాదంపప్పు, ఓట్స్, పాలు, రోజ్‌వాటర్ కలిపి మొహానికి పట్టించి కాసేపు ఉంచుకుని కడిగేసుకుంటే చాలు.
ఎండా కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మొహానికి ఫేషియల్ చేయించుకోవటం కూడా అవసరం. ఇంట్లోనే ఈజీగా ఫేషియల్ చేసుకోవాలంటే అలొవెరా జెల్‌లో ఆరెంజ్ జ్యూస్ కలిపి మొహానికి పట్టించి 20 నిమిషాల తరువాత కడిగేసుకోవచ్చు.
కీరదోస కూడా మొహంమీద మురికిపోవటానికి చాలా బాగా పనిచేస్తుంది. కీరా పేస్టులో కొద్దిగా పాలు కలిపి మొహానికి రాసుకుంటే మొహం మీదుండే మురికి మొత్తం పోతుంది.
సన్‌స్క్రీన్ లోషన్ అందరూ వాడతారు. అయితే అలా వాడేటప్పుడు దానిలో ఎస్‌పిఎఫ్ అంటే సన్‌ప్రొటెక్షన్ ఫాక్టర్ కనీసం 15 ఉండేలా చూసుకోవాలి. ఇది మన చర్మాన్ని 15 శాతం ఎక్కువ కాపాడుతుంది. ఏమీ అప్లయ్ చేయని చర్మం ఎండబారిన పడటానికి 20 నిముషాలు పడుతుంది. అదే సన్‌స్క్రీన్ వాడితే 300 నిమిషాలు ఎండ మనమీద దాని ప్రభావాన్ని చూపించలేదు.
అరటి పండు, తేనె కలిపి మెత్తగా పేస్టులాచేసి మొహానికి పట్టించి అరగంట తరువాత కడిగేసుకున్నా చాలు. మొహంలో మంచి నిగారింపు వస్తుంది.
ఎక్కువగా ఎండల్లో తిరగాల్సిన పని ఉన్నవాళ్ళు మొహం మీద జిడ్డు మొత్తాన్ని తొలగించుకోవటానికి స్ట్రాబెర్రీ లేదా బొప్పాయి పండు గుజ్జును మొహానికి పట్టించి పది నిమిషాల తరువాత కడిగేసుకుంటే ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
ఇవన్నీ ఎలాఉన్నా ఎండల్లో కూడా హాఋ హాయిగా ఉండాలంటే టీ, కాఫీలకి దూరంగా ఉంటూ కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, బార్లీ, చోడుపిండి అంటే రాగి జావ, తాజా ఆకుకూరలు, కూరగాయలు, చక్కని ఫ్రూట్ జ్యూస్‌లు తగిన విధంగా తీసుకుంటే చాలు ఎండ మనదగ్గరకి రావటానికి కూడా భయపడుతుంది.