Others

ప్రగతికి సోపానం.. గోరక్షణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవు హైందవజాతి తల్లి. భారతీయుల సంస్కృతి గోవుకు నమస్కరించటం. ‘గావో విశ్వస్య మాతరః’ అని ఈ దేశపు సనాతన ధర్మ దివ్యశంఖారావం. అంటే సమస్త విశ్వానికీ తల్లి గోవు అని ఎలుగెత్తి చాటింది. ‘సమస్త సంపదలకు మూలం గోవు’ అంటుంది అధర్వణ వేదం. ‘గోస్తుమాత్రా న విద్యతే’ ఆవుకు సాటియైనది లేదని యజుర్వేద మంత్రం. ‘సావిశ్వాయుః సావిశ్వకర్మ సా విశ్వాధాయాః’ ప్రపంచానికి శక్తిని ప్రసాదించేది గోవు అని వేదం ఉవాచ.
‘గోవు మహిమను ఎంత వర్ణించినా తక్కువే ’ అంటుంది శతపథ బ్రాహ్మణం. ఇలా వేదోపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల నుండి ఎన్నైనా దృష్టాంతాలను ఉటంకించవచ్చు. ‘గోవు మన శ్రద్ధా కేంద్రం’ గోవు- వ్యవసాయం అనేవి ఆర్థిక ప్రగతికి సోపానాలు అని దయానంద సరస్వతి అభిప్రాయం. కనుక మనం గో సంరక్షణ చేస్తే గోవులు మనలను అభివృద్ధి పథంలోకి తీసుకొని వెళ్తాయి. గోవు పోషణ రక్షణ భారతీయులైన ప్రతి ఒక్కరిపైనా ఉంది. భారతదేశపు ధార్మిక వాఙ్మయంలో గోవును మాతగా పూజ్యనీయ స్థానం లో ఉంది. గోవును దైవం ఆరాధించే సంస్కృతి భారతీయులది. ప్రాణ శక్తినిచ్చే సూర్యుడు, పంటలిచ్చి పోషించే భూమి, దాహార్తిని తీర్చే జలప్రవాహాలు ఇట్లాంటి అన్నింటిని దైవీ శక్తులుగా భావించడం, ఆరాధించడం అతిప్రాచీన కాలంనుంచి భారతీయుల లో ఉంది. సహాయం, ఉపకారం చేసేవారిని ఎల్లవేళలా దైవాంశసంభూతులుగా సంభావించడం అనేది భారతీయ సంప్రదాయం. గోవు నుంచి వచ్చే పదార్థాలన్నీ దాదాపుగా మానవులకు ఉపయుక్తాలే. కనుక ఆవును పెంచడం అంటే సంపదను వృద్ధి చేసుకోవడం. ఆరోగ్యం కూడా ఒకవిధంగా సంపదనే. ఆస్తిపాస్తులకన్నా ఆరోగ్యంగా ఉంటే దేనినైనా సాధించడానికి వీలు కలుగుతుంది. విశ్వామిత్రుని దౌర్జన్యశక్తిని ఒక్క్ధేనువు కాపాడగలిగింది. అట్లానే గోవులను రక్షించే మన హైందవలేక భారత జాతి యావత్తును గోవులే రక్షిస్తాయి అనడంలో ఇసుమంత అతిశయం అబద్ధం కానీ లేవు.

ఎ. సీతారామారావు