Others

100 గంటలా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన హీరోయిన్లు అప్పుడప్పుడూ చిలకపలుకులు పలుకుతుంటారు. పలాని సినిమాలో పలానా పాత్రకోసం చాలా పరిశోధన చేశానని, అలాంటి వ్యక్తులు ఉండే చోటుకువెళ్లి పరిశీలించి మరీ వారిలా నటించే ప్రయత్నం చేశామని చెప్పుకొస్తుంటారు. అది ఎంతవరకు చెప్పాలో అంతవరకూ చెబితేనే నమ్మబుల్‌గా వుంటుంది. మరీ పరిమితిమించి చెబితే సోది చెప్పేస్తుందిరా బాబూ అని అనుకోవడం షరా మామూలే. అలాంటి ఐటెం ఇప్పుడు కత్రినా కైఫ్ పాలిట నమోదైంది. ప్రస్తుతం రణబీర్‌కపూర్‌తో ఆమె నటించిన సినిమా ఒకటి విడుదలకు సిద్ధమవుతోంది. రణబీర్‌తో బ్రేకప్ అయ్యాక జగ్గా జస్యూస్ సినిమాలో నటించడానికి నిర్మాతలకు నానా చుక్కలు చూపించింది.
చివరి నిమిషంలో లీగల్ యాక్షన్ భయంతో షూటింగ్‌లకు వచ్చినా, ఇప్పుడు ప్రమోషన్‌కు మాత్రం నానా హడావుడి చేస్తుంది. పనిలో పనిగా ఎక్కడ దొరికితే అక్కడ రణబీర్ కపూర్‌ను పబ్లిక్ ముందే ఉతికి ఆరేస్తోంది మాటలతో. అదే ఫ్లోలో ఈ సినిమాలో తాను జర్నలిస్టు పాత్రలో నటించానని, ఇందుకోసం జర్నలిస్టులను దాదాపు 100 గంటలపాటు పరిశీలించానని చెప్పడంతో బాలీవుడ్‌లో అదో పెద్ద జోకై కూర్చుంది. వంద గంటలపాటు కత్రినా పరిశీలించి మరీ నటించిందటరోయ్.. అంటూ జోకులేసుకుంటూ ఆ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా మీడియా అంటే ఆమడదూరం పరిగెత్తే కత్రినా, అదే పాత్రలో నటించాల్సి రావడం వింతే మరి! దానికితోడు వంద గంటలు పరిశీలించి మరీ..!!