Others

బాల్యానికి భరోసా ఇద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటి నా బాల్యానికి భరోసా ఇవ్వలేకపోతున్నాం. ఆడేపాడే వయసులో వారికి పెళ్లిళ్లు చేసి కన్నవారు తమ భారం తీరిపోయిందని వదిలించుకుంటున్నారు. పెళ్లి పేరుతో వారి జీవితాలను ఛిద్రం చేస్తున్నారు.. బాల్య వివాహల నిషేధ చట్టం ఉన్నా.. దేశంలో బాల్య వివాహలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏటా 1.4 కోట్లమంది బాలికలు పెళ్లీడు రాకుండానే పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. లక్షమంది ఆడపిల్లలకుగాను 2335 మందికి పసివయసులోనే పెళ్లి చేస్తున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగే లక్షమంది మగపిల్లలకుగాను 2459 మందికి వివాహలు చేస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బాల్య వివాహలు ఎక్కువగా రాజస్థాన్, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో జరుగుతున్నట్లు ఈ సర్వేలో గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాజస్థాన్‌లోని బిల్వారా, టాంక్, ఆజ్మీర్, చిత్తూర్‌ఘర్, రాజసామాండ్ తదితర ప్రాంతాల్లో బాల్యవివాహలు అధికంగా జరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత వల్ల ఈ పెళ్లిళ్లు జరుగుతున్నట్లు వెల్లడైంది. గ్రామీణ ప్రాంతా ల్లో 67శాతం, పట్టణ ప్రాంతాల్లో 33శాతం పెళ్లిల్లు జరుగుతున్నట్లు వెల్లడైంది. పిల్లల ఎదుగుదలకు అనర్థదాయకంగా పరిణమిస్తున్న ఈ బాల్యవివాహల వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.