Others

కరాటే కిడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనె్నండేళ్లే.. కిక్ ఇచ్చిందంటే ఖంగు తినకతప్పదు. అమ్మాయి కదా అని ఈ చిన్నారితో తలపడితే ఎదుర్కోడం కష్టమే. తన కిక్‌లతో రాళ్లను సైతం పిండి చేసేస్తోంది. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోకుండా కరాటేలో రాణిస్తోంది అమృతారెడ్డి. పిల్లల్లో అసాధారణ ప్రతిభ దాగి ఉంటుంది. కొంతమంది మాత్ర మే నలుగురు ముందు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. అలాంటివారిలో అమృత ఒకరు. ఎలాంటి భయం లేకుండా అమృతారెడ్డి కూడా కరాటే పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణిస్తోంది. నేటి సామాజిక పరిస్థితుల్లో ఆడపిల్లలు నిర్భయంగా.. ఆత్మ విశ్వాసంతో జీవించటానికి కరాటే దోహదం చేస్తుందని నమ్మిన ఆ తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అమృతారెడ్డి ఈ క్రీడలో తన సత్తా చాటుతోంది. అమృతారెడ్డి తండ్రి కూడా కరాటే మాస్టర్.
ఎన్నో అద్భుత ప్రదర్శనలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు అయిన సందర్భంగా ఈ వండర్ కిడ్ అద్భుత ప్రతిభ కనబరిచి ఔరా అనిపించింది. తెలంగాణ ఏర్పడి 1096 రోజులైనందున 1096 ఇనుప మేకులపై పడుకుని 36 నెలలైన సందర్భంగా 36 గ్రానైట్ రాళ్లను పొట్టపై పెట్టించుకుని పగుల గొట్టించుకుని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం సంపాదించుకుంది. అలాగే 365 టైల్స్‌ను తలపై పెట్టించుకుని పగులగొట్టించుకుంది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఈ చిన్నారి తన రాష్ట్రం పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంది. బ్లాక్‌బెల్ట్ సాధించిన ఈ చిన్నారి భవిష్యత్తులో ఒలింపిక్ పోటీల్లో గెలవటమే తన లక్ష్యమని చెబుతోంది. ఒలింపిక్‌లో దేశానికి పతకం తీసుకువస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతుంది.
రెండేళ్లకే కరాటే..
తండ్రి గోపాల్‌రెడ్డి కరాటే మాస్టర్ కావటంతో అమృత రెండేళ్లకే కరాటే నేర్చుకోవటం ప్రారంభించింది. గోపాల్‌రెడ్డి తన ఇద్దరి కుమార్తెలకు కూడా చిన్నప్పటి నుంచి కరాటే నేర్పించారు. ఈ మార్షల్ ఆర్ట్ వారికెంతో ఆత్మరక్షణగా ఉంటుందని ఆయన నమ్మకం. ఇప్పటికే నేషనల్ స్థాయి పోటీల్లో అమృత పాల్గొన్నది. అం తర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేందుకు తనను తాను సిద్ధం చేసుకుంటుంది. అభ్యాసనం చేస్తే ఎలాంటిదైనా నేర్చుకోవచ్చని నిరూపిస్తూ కరాటేలో కఠినమైన టెక్నిక్‌లను సైతం అలవోకగా నేర్చుకుంటుంది. ఇంత చిన్న వయసులోనే పెద్ద విజన్‌ను కల్పించుకుని ముందుకు సాగుతుంది.
ఆహారం..జాగ్రత్తలు
పనె్నండేళ్లు వయ సు పిల్లలు బర్గర్లు, పిజ్జాలు, చాక్లెట్లు తినటానికి ఆరాటపడతారు. కాని అమృ త వీటిని అసలు ముట్టదు. ఈవ యసు నుంచే అహార నియమాలు చక్కగా పాటిస్తుంది. ఏదిపడితే అది తినకుండా క్రమశిక్షణగా ఉంటుంది. అనుకున్న గోల్ సాధించాలంటే ఇలాం టి క్రమశిక్షణాయుతమైన జీవితం అవసరమని ఈ చిన్నారి చెబుతుంది. కరాటే అంటే కాళ్లు,చేతులు కదిలించటమే కాదు ఈ రెండింటిని సమన్వయం చేసుకుని అద్భుతమైన విన్యాసాలు చేస్తూ.. ఈ క్రీడల్లో అద్భుతమై విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుందాం.