Others

గోరక్షకుడు భరద్వాజుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవులను గోపాలుడు కాస్తే, వాటిని భరద్వాజుడు కాపాడి వాటి రక్షణకు శ్రీకారం చుట్టాడు. సీతారాములకు స్వాగతము పలికి ఆతిధ్యమిచ్చి పర్ణశాలను చూపినవాడు భరద్వాజుడు. అలాగే భరతుడు, రామున్ని వెత్తుకుంటూ వచ్చిన వాడికి, ఆతిధ్యమిచ్చి రామమార్గమును చూపినవాడు, భరద్వాజుడు. సప్తఋషులలో ఒకడు. మానవుల జీవన విధానానికి, వికాసానికి పశువుల ఆవశ్యకతను భరద్వాజుడు గుర్తించి ‘పశువులను ప్రేమించు, పరోపకార విధానము గుర్తించు’ అను నినాదాన్ని ప్రజలకు అందించాడు. ముప్పది కోట్ల దేవతలకు, నిలయమైన గోమాత యొక్క మహిమను వివరించి గోహత్య చేయకూడదు’ అనే భావాత్మక సందేశాన్ని మొట్టమొదట వ్యక్తంచేసి ఆచరణలోకి తెచ్చిన మహార్షి భరద్వాజుడు.
భరద్వాజుడు వేదగర్భిత జ్ఞానాన్ని శోధించాడు, వ్యోమయాన శాస్తమ్రు యంత్రశాస్త్రానికి ఆద్యుడు. శకున విమానం, సుందర విమానం, రుక్క విమానం, త్రిపుర విమానం, పుష్పక విమానం మొదలగు అనేక రకాల, విమానాలను ఏ లోహంతో ఏవిధంగా రూపొందించాలో వివరిస్తూ ఆయన వ్యోమయాన శాస్త్రాన్ని రచించాడు. అదే ‘యంత్ర సరస్వతీం’ అనే గ్రంథం.
విమాన తయారు పద్ధతి కాపీకొట్టిన, రైట్ సోదరులు ప్రచారంలోకి వచ్చారు. భరద్వాజుడుని గమనించవలసిన భారతీయులు గమనించలేదు. అతడి శక్తిని తెలుసుకున్నారు గానీ, శక్తిప్రయోగానికి మన భారతీయులు ప్రయత్నించలేదు. మనిషి గుండెలోకి వెళ్లారు గానీ, గగనాన ఉన్న నక్షత్రాల్లోకి వెళ్లలేదు. అదే విధంగా మన భారతీయులు, గోమాత విశిష్ఠను తెలుసుకొనలేదు. గోమాతను కాపాడుటలో అశ్రద్ధ అలసత్వం తెల్పుతూ వస్తున్నారు. ఒకరు చెబితేగానీ, మన విశిష్ఠతను తెలుసుకొనలేక పోతున్నారు. విశ్వామిత్రుడు గోచోరత్వతో భంగపడ్డాడు. గోవులు ఋషుల సొత్తు, వాటి అపహరణ గానీ, గోహత్యలు కానీ ఋషులకు హానికరము చేసినట్లే అవుతుంది. అపచారం, అహంకారమవుతుందని వేదాలు ఘోషిస్తున్నాయి. భరద్వాజుడు బృహస్పతి, మమతల పుత్రుడు. ఇతడి గోత్రము అన్ని గోత్రాలకంటే విస్తృతమైనది. కలియుగ శ్రీవేంకటేశ్వరస్వామి గోత్రం భరద్వాజ గోత్రం, భరద్వాజ గోత్రం శ్రీ సత్యసాయిబాబావారి గోత్రం. గోత్రంలో గోవిందుడు ఉన్నాడు, గోవిందుడి ప్రియమైనది గోవు. గోపాలురు, గోపికలు, గోవర్ధన పర్వతం ఎత్తి ప్రకృతినే శాసించినవాడు గోపాలుడు.
భరద్వాజ మహార్షి కడు శక్తిమూర్తి, జ్ఞానమూర్తి. తన మేథాశక్తిని మానవ వికాసానికి ధారపోసిన ఆదర్శమూర్తి. భారతీయులందరికీ భరద్వాజ మహార్షి మార్గదర్శి. వారి శక్తియుక్తులను మానవ కళ్యాణానికి వినియోగించుటయే కర్తవ్యముగా ప్రతివ్యక్తీ గుర్తించాలి. వారి ఆదేశాలను ఆచరించాలి.
గంగ, గోవు, గీత, గాయత్రీ, గోపాలుడు ఈ ఐదు సమస్త పాపాల్ని హరించేవి. గోమాత మూత్రం పంచితమై కొంచెం త్రాగినంత మాత్రాన మనల్ని పరిశుద్ధుల్ని గావిస్తుంది. గోమాత మలం పేడ అయి మన ఇండ్లు వాకిళ్లు అలుకుకొనేందుకు ఉపయోగిస్తారు. పొలాల్లో ఎరువుగా పనికివస్తుంది. ఇంతటి గొప్పతనం ఉన్నగోవును గురించే చెప్పే భరద్వాజుని మరిస్తే గోవును భక్షిస్తే ఇక మనకు ఒరిగేదేమిటి? మహర్షి అనుగ్రహాన్ని మనం ఏవిధంగా పొందుతాం. మనచేయవలసిన కర్తవ్యాన్ని ఇప్పటికైనా గ్రహిస్తేచాలు.

- జమలాపురం ప్రసాదరావు