Others

పోతురాజుల వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ పుట్టింటికి వస్తుంటే తమ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి అమ్మను ఎదురెళ్లి స్వాగతించడానికి, అమ్మకు బోనం సమర్పించడానికి ఆనందంతో చిందులు వేసే సంతోషమే పోతురాజుల వీరంగం. అమ్మ శక్తిని, అమ్మ మహిమను ఏకరువు పెడుతూ ప్రతి మహిళనూ అమ్మగా ఆరాధిస్తూ వారితో కూడా అడుగులో అడుగు వేయడానికి శరీరమంతా పసుపురాసుకుని కాళ్ళకు గజ్జెలు, కళ్ళకు కాటుక, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, నోటిలో పచ్చటి నిమ్మకాయ, నడుము చుట్టూ వేపమండలు, కొరడాగా చేసుకున్న పసుపుతాడును ఝుళిపిస్తూ తప్పెట వాద్యాలకు అనుగుణంగా చిందులేస్తూ ఆనందోత్సాహాల మధ్య పోతరాజులు కదిలివెళ్లి అమ్మను స్వాగతించే ఘట్టం పోతురాజుల వీరంగం. పోతురాజులు అమ్మకు సహోదరులుగా భావించి అమ్మకు మారుగా తమకు అండగా ఉండమని పోతురాజులనూ అమ్మలందరూ ఆహ్వానిస్తారు .

అంబారి ఊరేగింపు: అమ్మవారి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుపై ఉంచి మంగళవాయిద్యాలతో పురవీధులగుండా ఊరేగించుకుంటూ ‘‘అమ్మబయలెల్లినాదో...’’, ‘‘పోలేరమ్మో... గంగాళమ్మో... గంగరావిచెట్టు కింద మాంకాళమ్మో...’’ పాటలు పాడుతూ తీసుకుని వెళ్ళి సాగనంపి ఉత్సవాన్ని ముగిస్తారు.

బోనాలు
ఆదిశక్తి మహంకాళి సర్వానికి కారణాకారుణురాలైన మహామాయ మహాశక్తి స్వరూపిణికి సమర్పించే నైవేద్యమే బోనం. ఆ తల్లి కన్నబిడ్డలందరూ గుమికూడి ఒకరితో ఒకరు కలసి మేళతాళాలతో బంధుమిత్ర సహోదర సమేతంగా బయలెల్లి తల్లికి నివేదించే నివేదననే బోనం. చల్లని తల్లి తమను చల్లగా చూడాలని కోరుకుంటూ తలారా స్నానం చేసి పచ్చదనాన్నిచ్చే పసుపును అలదుకొని మంగళాలను సౌభాగ్యాలనిచ్చే కుంకుమను నుదుటిన ధరించి తల్లిని నోరారా పిలుస్తూ అందరినీ సమీకరించుకొని పవిత్రమైన కుండలో బోనం పెట్టి పైన తల్లిని ఆవాహన చేసి దీపాన్ని వెలిగించి ఆ కుండను తలపై పెట్టుకుని తప్పెట్ల మోతలతో, మంగళవాద్యాలతో నృత్యాలు చేసే పుఠుషులు వెంటరాగా అమ్మవారి గుడికి తరలివస్తారు. ఇది చూడవలసిందే కాని వర్ణించవలసింది కాదు సుమా!