Others

ఎందుకీ చదువులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న విద్య వ్యక్తిత్వ వికాసాన్ని నిర్మించేది కాదు. విద్య అన్నది పిల్లల్లో స్వేచ్ఛ, త్యాగం, సేవ, నిస్సాంగత్యం వంటి ఆదర్శాలు ఇనుమడింప చేయగలగాలి’ అన్నారు స్వామి వివేకానంద. నేడు పిల్లలు మార్కులు, ర్యాంకుల కోసం మాత్రమే విద్యనభ్యిసిస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారు దేహదారుఢ్యం కలిగి, ఐదవ తరగతి చదివిన వారికి హమాలీ ఉద్యోగాలివ్వడానికి ఒక ప్రకటన చేశారు. సామాన్య అభ్యర్థులతోపాటు అయిదుగురు ఎంఫిల్ చేసినవారు, 253 మంది మాస్టర్ డిగ్రీ చేసినవారు, సుమారు వెయ్యిమంది పట్ట్భద్రులు కూడా ఈ హమాలీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారట. విద్యావ్యవస్థలో ప్రమాణాల పతనానికి ఇది నిదర్శనం.
ఇపుడు బడిపిల్లల అవస్థలు వర్ణనాతీతం. వారి కష్టాలు చెబితే వినేవారు ఎవరు లేరు. తల్లిదండ్రులు కూడా వారి బాధలు వినే స్థితిలో లేరు. తల్లిదండ్రుల ఒత్తిడి, ఉపాధ్యాయుల ఒత్తిడి మితిమీరిపోతున్నాయి. ఒక విధంగా వారు ఇప్పుడు పద్మవ్యూహంలో ఉన్నారు. సిలబస్ ప్రతి ఏటా పెరిగిపోతోంది. పుస్తకాల భారం దినదినాభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు ఇన్ని పుస్తకాలు చదువుతున్నా పిల్లలు తప్పులతో రాస్తున్నారు. ఎలాగో చదువు పూర్తి అయినా ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదు. దానికి విశ్వప్రయత్నం చేయాలి. అందుకు మళ్లీ పోటీ పరీక్షలు.
నిద్రలేచింది మొదలు పుస్తకాల బరువు మోస్తూ వాటితో కుస్తీ పడుతు శారీరకంగా, మానసికంగా పిల్లలు అలసిపోతున్నారు. ఒక బ్యాంకు ఉద్యోగి తన కుమారుడిని ఇంజనీరుగా చేయాలని తీవ్రంగా ఒత్తిడి చేయగా- అది విషమించి ఆత్మహత్యకు దారి తీసింది. మార్కులతో విద్యార్థుల మేధస్సును అంచనా వేసే మన విద్యా విధానం ప్రకారం- వివేకానంద స్వామి సగటు మార్కులు తెచ్చుకున్నవాడు. ఆనాడు అతనితో చదివి బంగారు పతకం పొందిన విద్యార్థి ఎవరికైనా తెలుసా? తెలియదు. కానీ వివేకానందస్వామి భారతీయతకు సాధికార ఆదర్శం. ఆయన పేరుమీద ఎన్నో పతకాలను- ఆయనకన్నా ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులు తీసుకున్నారు. భారతీయ సమాజాన్ని ప్రభావితం చేసిన కొందరు తమ చదువులలో ఆరి తేరిన వారు కాదు. నేటి విద్యార్థుల లక్ష్యం దేశోద్ధారణ కాదు. ఒక మంచి ఉద్యోగం పొందడం. పిల్లలు మోసే పుస్తకాల బరువు వలన వారికి వెన్ను నొప్పులు వస్తున్నాయని వారికి మార్కుల పోటీలో వత్తిడి అధికమై ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. మన పిల్లలు రాత్రింబవళ్లు చదివి బట్టీపట్టి ఉన్నది ఉన్నట్టుగా ప్రశ్నలకు జవాబులు రాయడానికే కృషి చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ప్రతిభ అంటే ఇదే అనని భావిస్తున్నారు. మంచి మార్కులు వస్తున్నాయని సంతోషిస్తున్నారు. మంచి విద్యార్థులను తయారుచేయాలనే సదాశయంతో పాఠాలు చెప్పడానికి ఎంతమంది ఉపాధ్యాయులు ముందుకు వస్తారు? మన విద్యా సంస్థల ఆశయం ధనవంతులను చేయడమే కాని గుణవంతులను తయారు చేయడం కాదు. అందువల్లనే ఉన్నత పదవుల్లో వున్న ఉద్యోగస్తులు కూడా లంచాలు తీసుకుంటున్నారు. అది దోషం అని తెలుసుకున్న వ్యక్తి లంచం ఎన్నడూ తీసుకోడు. పిల్లలు గుణవంతులు కావడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యత వహించాలి. ఇక, ఇద్దరికి మించి పిల్లలను కనే వారి సంఖ్య ఇంకా తగ్గాలి. నిరక్షరాస్యత వలన, అజ్ఞానం వలన, ఇతర సామాజిక కారణాలవలన ఇప్పటికి ఇద్దరు మించి పిల్లను కనేవారింకా ఉన్నారు. ఇది ఒక విధంగా జాతికి నష్టం. ఒక గణాంక ప్రకారం 2050 సంవత్సరం నాటికి దేశ జనాభా 175 కోట్లు కావచ్చునని అంచనా. అప్పుడు ఎన్ని చిక్కులు వస్తాయో ఆలోచించండి.

-వేదుల సత్యనారాయణ