Others

నవశకానికి నారుమడి.. గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతస్య మరణం ధ్రువం అన్నది ఆరోక్తి. మృత్యువు సహజం. పుట్టిన వాడు గిట్టక మానడు. కాని మానవుడుగా పుట్టి విచక్షణా జ్ఞానాలున్న మానవుడు అమృతత్వసాధన కోసం అహర్నిశమూ తపిస్తునే ఉన్నాడు. ఉంటాడు కూడా.
భారతదేశం కర్మభూమి. పురాకృత జన్మలను బట్టి ఈ జన్మ వచ్చింది అనేది కొందరి నమ్మకం. ఈ నమ్మకాన్ని బట్టి చూసినపుడు పుణ్యకర్మలు చేసుకొన్నవారికి మంచి జన్మలు, పాపకృత్యాలు చేసినవారికి దుర్గతలు కలుగుతాయనేది పురాణ వచనం.
మనిషి అన్నవాడు పుణ్యకర్మలు చేసినా చేయకపోయినా మానవీయ దృక్పధంతో ఉండాలి. మానవ విలువలను పాటించాలి. మానవత్వం లేనినాడు మనిషి జన్మ వ్యర్థమవుతుంది అనేది కేవలం ఆధ్యాత్మిక వాదులకే కాదు హేతువాదులు అంటారు. మానవత్వం తో మెసలే విధానం ఏమిటో భారతం చెబుతుంది.
మనిషి ఏవిధంగా నడక సాగిస్తే మంచి మనిషిగా నిలబడుతాడనేది మనకు భారతం కళ్లముందు చూపిస్తుంది. దుర్యోధనుడులాంటి వారి దుశ్చర్యల వల్ల వారు జీవించి ఉన్నంత కాలమూ కుట్రలతోకుతంత్రపు ఆలోచనలతోను గడిపారు. మహాపరాక్రమవంతులు, దేవతలనే జయించే నైపుణ్యం కలవారైన భీష్మద్రోణాది వీరులు వెంట వుండి కూడా చివరకు దుర్యోధనాదులందరూ అసువులు బాసారు.
ధర్మరాజాదులు అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా సదా శాంత చిత్తంతో ఉన్నారు. ఎక్కడికక్కడ వారికి ఏదో ఒక విధంగా భగవంతుని సాయం అందుతూనే ఉంది. దుర్యోధనాదుల కుట్రలను ఎదుర్కోవడానికి భుజబలం చూపించినప్పటికీ కూడా వారి దైవసాయం కావాలని తపస్సులు, యజ్ఞాలు, యాగాలు చేస్తునే ఉన్నారు.
స్వచ్ఛందమరణం అనే వరాన్ని పొందిన భీష్మాచార్యులు వారికి ఎన్నో నీతి నియమాలను ధర్మసూక్ష్మాలను చెప్పారు. చివరకు మానవుడు ఏవిధంగా సంతుష్టి జీవితాన్ని గడుపుతాడని, ఏవిధమైన కర్మలవల్ల ధర్మజీవనుడు అవుతాడని ధర్మరాజు అడిగినప్పుడు భీష్ముడు కేవలం తాను నిమిత్తమాత్రుడినని అనుకొంటూ సర్వమూ భగవంతుడే అని నమ్మినవారు ధర్మాన్ని అతిక్రమించలేరని చెబుతారు.
తన జీవితేచ్ఛను వదులుకుని నన్ను యమసదనానికి పంపివ్వమని అడిగిన ధీరోదాత్తుడు భీష్ముడు. అటువంటి భీష్మాచార్యులు యుధిష్టరునికి వినిపించిన విష్ణు సహస్రనామం చదివినందువల్ల అనేక పుణ్యగతులు వరిస్తాయి అని శృతి వాక్యం.
నాటి మహాభారతంలోని ప్రతి సంఘటనా నేడు భారతవనిలో జరుగుతున్నదే అంటారు. అప్పుడు జరగనిది ఇపుడు జరగడం లేదు ఇపుడు కనిపించేది పూర్వపరం అక్కడిదే అనీ అంటారు. అట్లాంటి మహాభారతంలో కురుక్షేత్ర మహాసంగ్రామంలో అన్నదమ్ములే సంగ్రామ యోధులు.
ఒకరు అసురీ ప్రవృత్తికి తార్కాణంగా నిలిస్తే మరొకరు దైవీశక్తులు చిహ్నంగా నిలబడ్డారు. బాల్యం నుంచి వైరాన్ని పెంచుకుని రోజురోజుకూ వైరభావాలనే ప్రచోదనం చేసుకొంటూ వచ్చి కూడా అనేక వాగ్దానాలు, ప్రతిజ్ఞలు కూడా చేసి కూడా చివరకు నేనీ యుద్ధాన్ని చేయలేను. నా అన్నదమ్ములను, నా గురువులను, నా పితామహులను, అంతా నావారే అయిన వీరితో నేను యుద్ధం చేయలేనని అరివీర భయంకరుడు ఎన్నో వరాలను పొందినవాడు, మరెన్నో బిరుదులు పొందినవాడు, పార్థుణ్ణే తన రథ సారథిగా చేసుకొన్నవాడు అయిన పాండవ మధ్యముడు, కాని చివరకు యుద్ధ్భూమికి తరలి వచ్చి తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి, తనను తన అన్నదమ్ములనే కాక తనను కన్నతల్లిని, కట్టుకున్నభార్యను కూడా అవమానించిన వారికి బుద్ధి చెప్పే సమయం ఆసనమయ్యందని వారికి ఎలాగైనా తాము అంటే ఎవరో నిరూపించాల్సిన అవసరం, సమయం రెండూ కూడి వచ్చాయని ఇలా ఎనె్నన్ని ఆలోచనలతోనో వచ్చిన అర్జునుడు బేలమొగం వేసాడు.
ఆయుధాలు పట్టుకోలేక నిరుత్తుడయ్యాడు. జావగారి పోయే కవ్వడిని చేరదీసి గాండీవాన్నిచ్చి అన్నింటికీ కారణం నేనే. చచ్చేది, చంపబడేది ఎవరు అనుకొంటున్నావు. అసలు నీవు ఎవరు? నీలోపలనున్న ఆత్మకు చావుపుట్టకలు లేవు అంటూ శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చేసిన గీతాబోధ నేటి నవశకానికి నారుమడే.
గీత వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తి మనుగడకు కావాల్సిన అంశాలెన్నో వున్నాయి. నేడు విస్తరిస్తున్న అస్తవ్యస్తస్థితిని బాగుచేయడానికి కూడా కావాల్సిన వస్తువు గీతాబోధ లో ఉంది. ఇన్ని విషయాలు చెప్పి సమరానికి ఆయత్తం చేసిన తానే సారథిగా ఉండి కురుక్షేత్ర రణరంగంలో పాండవుల విజయకేతనానికి కారణమైన ఆ శ్రీకృష్ణుడే కౌరవ పక్షంలోని భీష్మాచార్యుని దగ్గర ఉపదేశం తీసుకోమని ధర్మరాజాదులకు చెప్పాడు. ఇందులోని మర్మాన్ని మననం మనిషి చేయాల్సిందే. భీష్ముడు రాజ్య రక్షణ కోసం ఆజన్మబ్రహ్మచారిగా ఉండిపోయాడు. నిత్యమూ కురువంశపీఠాన్ని సురక్షితంగా ఉంచడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేశాడు. తాను కేవలం రథసారథిగా ఉంటానని, తానే ఆయుధం పట్టనని భీష్మించిన కృష్ణుడి చేతనే ఆయుధం పట్టించి భగవంతుడు ఎంతటి భక్తపరాధీనుడో లోకానికి ఆవిష్కరించిన ధీశాలి భీష్ముడు.
నకర్మణా నప్రజరుూ ధనేనా
త్యాగే నేక అమృతత్వ మానశుః అన్నట్లుగా జీవించిన ఆ మహానుభావుడు దాన, దయా, ధర్మ, యుద్ధ, సత్య, క్షమా, పాండిత్య, బలవీరమనే రసగంగాధర కారుడు చెప్పిన ఈ ఎనిమిది వీరాలను కలిగిన అతి వీరాధివీరుడు భీష్ముడు. ఆ భీష్ముడు మానవత్వానికి మచ్చుతునక గా ఉండి అమృతత్వసాధన చేసిన మహావీరుడు.
అతడు చివరకు అన్ని ధర్మాల్లోకి ఉత్తమ ధర్మాన్ని, ఉత్తమ మార్గాన్ని సూచిస్తూ జగద్యాపకుడైన జగన్నాథుని అనుక్షణం స్మరిస్తూ ఆ సర్వవ్యాపిని అచంచలమైన నమ్మకంతో అపార భక్తి విశ్వాసాలతో పూజిస్తూ మానవీయ విలువలతో జీవించిననాడు మానవుడుగా పుట్టినందుకు సార్థకత లభిస్తుంది అని చెప్పాడు. కనుకనే నాడు నేడు కూడా గీతాపారాయణ చేసి అందులోని మర్మాలను తెలుసుకొని భవిష్యత్తు గీతను సరిదిద్దుకోవాలి. గీతను నిత్యాచరణలో అనుసంధించుకుంటే మానవుడే మహనీయుడు అవుతాడు.

- ములుమూడి సుశీల