Others

పరిచయాలతో ప్రాజెక్టులు రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలంటే చిన్నప్పటినుం ఆసక్తి ఉండడానికి కారణం- విఎమ్‌సి సంస్థ మా పెదనాన్న కొడుకుది కావడంతో ఎక్కువగా ఆ సంస్థలో వచ్చే చిత్రాల్లో పాలు పంచుకునేవాడిని. అలా చాలా విషయాలు దగ్గరుండి చూసుకోవడంతో సినిమా పట్ల అవగాహన ఏర్పడింది. ఆ అనుభవంతో ఎవరిదగ్గర పనిచేయకుండానే తొలిసారిగా ‘ఇదేం దెయ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించాను అంటున్నాడు దర్శకుడు వి రవివర్మ. చిన్మయానంద ఫిలింస్ పతాకంపై ఎస్ సరిత నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ జరుపుకుంటోంది. ఆగస్టు 4న విడుదలకు సన్నాహాలు
చేస్తున్నామంటున్నాడు రవివర్మ.
సినిమా రంగంలోకి..
మాది తిరుపతి. ఇంజనీరింగ్ పూర్తిచేశా. సినిమాలపై ఆసక్తి ఇప్పటిదేం కాదు. విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చదువుకునే రోజుల్లో.. సూపర్ సీనియర్ రాంగోపాల్‌వర్మ గురించి మిత్రులు గొప్పగా చెప్పేవారు. అలా వర్మ మీద, ఆయన చిత్రాల మీద అభిమానం పెరిగింది. అప్పటినుంచి డైరెక్టర్ అవ్వాలన్న కోరిక పెరిగింది. వర్మ దగ్గర శిష్యుడిగా పనిచేయాలని చాలాసార్లు ప్రయత్నించాను. కానీ స్టడీ కంప్లీట్ చేయమని సలహా ఇచ్చారాయన. తర్వాత మా పెదనాన్నకు చెందిన విఎమ్‌సి ప్రొడక్షన్స్ బేనర్‌లో రూపొందుతున్న చిత్రాల్లో పాలు పంచుకునేవాడిని. అలా సినిమాపై ఒకింత అవగాహన పెంచుకున్నా.
చిన్న సినిమానే ఎందుకు..?
పరిశ్రమలో చాలామందితో పరిచయాలు ఏర్పడ్డాయ. అయితే పరిచయాలతో సినిమాలు వచ్చేయవు. మనమేంటో చిన్న సినిమాతో నిరూపించుకుని తర్వాత మనకున్న పరిచయాలతో పెద్ద హీరోతో సినిమా చేయాలన్న ఆలోచనకు రావాలి. నేనదే చేస్తున్నా. అందుకే ముందు చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టా.
ఇదేం దెయ్యం గురించి..?
లవ్, కామెడీ మిక్స్ చేసి హర్రర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాం. రాజుగారిగది-2, ప్రేమకథా చిత్రాలను మించేలా కామెడీ ప్లాన్ చేశాం. ముగ్గురు ఫ్రెండ్స్ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ఏ ఒక్క అమ్మాయా ఇష్టపడదు. ఇలాంటి సమయంలో ఒక ముగ్గురు అందమైన అమ్మాయిలు కనిపించి లవ్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇస్తారు. కొంతకాలం తర్వాత ముగ్గురూ దెయ్యాలని తెలుస్తుంది. వారినుంచి ఎలా బయటపడ్డారన్నది చిత్ర కథాంశం. సన్నివేశాలన్నీ కామిక్‌గా ఉంటాయ.
షూటింగ్ ఎక్కడ?
హదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్‌లో షూట్ చేశాం. టీం సహకారంతో అనుకున్న సమయానికి అనుకున్న విధంగా సినిమా పూర్తి చేశా.
నటీనటుల గురించి..
జబర్దస్త్ కమెడియన్స్‌గా పాపులర్ అయిన రచ్చరవి, కిరాక్ ఆర్పీ, మాగంటి శ్రీనాథ్‌లు హీరోలుగా చేస్తున్నారు. సాక్షికక్కర్, రచనా స్మిత్, రుచి పాండే హీరోయిన్లు. మిగతా పాత్రల్లో జీవా, గౌతంరాజు, అప్పారావు కనిపిస్తారు. ప్రతి పాత్ర సినిమాకు కీలకం. రచ్చ రవి, కిరాక్ ఆర్పీలు జబర్దస్త్‌లో నవ్వించేదానికన్నా పదింతలు దెయ్యాలతో ఆటాడుతూ నవ్విస్తారు.
హైలెట్స్ గురించి..
కెపి ప్రతి విషయంలో సపోర్టుగా ఉంటూ కథకు తగ్గ విధంగా సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే బాలు స్వామి అద్భుతమైన ఐదు పాటలు అందించాడు. త్వరలోనే ఆడియో మార్కెట్‌కు రానుంది. ఏలేందర్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. ఓషో ప్రసాద్‌ను మా చిత్రం ద్వారా సంభాషణల రచయతగా పరిచయం చేస్తున్నాం. ప్రతి డైలాగ్ నవ్వించేలా, అర్థవంతమైనదిగా ఉంటుంది. త్వరలో సెన్సార్ పూర్తిచేసి ఆగస్టు మొదటివారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.
నిర్మాత సహకారం?
నిర్మాత యస్ సరితగారు నాకోసమే సినిమా నిర్మించారు. ఇది మీకు అతిశయోక్తిగా అనిపించినా, నిజం. నన్ను నమ్మి నిర్మాణ బాధ్యతలన్నీ నా మీద పెట్టారు. కథమీద నమ్మకంతో నిర్మాణ విషయాల్లో రాజీపడకుండా రూపొందించేందుకు నిర్మాత సహకరించటం నా అదృష్టం. అందుకు ధన్యవాదాలు.
తదుపరి చిత్రం..?
బ్రహ్మానందం హీరోగా ‘కత్తిరెడ్డి’ చిత్రాన్ని ఇదే బ్యానర్‌లో తెరకెక్కించనున్నాం. టిపికల్ స్టోరీ అది. ఇంతకుముందెన్నడూ చేయనటువంటి పాత్రలో బ్రహ్మానందం కనిపిస్తారు. త్వరలో కత్తిరెడ్డి చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తాం.

-శ్రీ