Others

‘పన్ను’ భారం తగ్గదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జీఎస్టీ (వస్తు సేవల పన్ను)తో నూతన సంస్కరణలు అమలు చేస్తున్నాం. ఆర్థిక సంస్కరణల్లో కొత్త యుగం ప్రారంభమైంది. మరపురాని శకానికి శ్రీకారం చుట్టాం’- అంటూ కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నెత్తిన గుదిబండ వేసింది. నిత్యావసర సరకులను అందుబాటు ధరల నుంచి ‘పన్ను పోటు’తో సామాన్యుడికి చుక్కలు చూపించింది. ప్రజలు అయోమయంలో పడి ఆందోళన చెందుతూ ఉగ్రరూపం ధరిస్తున్నారు. అధిక పన్నులు విధిస్తూ ఆర్థిక భారాన్ని పెంచుతూ ప్రభుత్వం తన ఖజానాను భారీగా నింపుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందా? ఈ నేపథ్యంలోనే ‘ఒకే దేశం- ఒకే పన్ను’ అంటూ జిఎస్టీని అమలు చేస్తోందా? రాజకీయ నాయకులు తమని తాము ఉద్ధరించుకోవడానికి కాకపోతే ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేయడానికొచ్చి, లక్షలకు లక్షలు జీతభత్యాలు పెంచుకుంటూ, ఎవరికీ దక్కనంత అత్యాధునిక సౌకర్యాల్ని అనుభవిస్తూ, ప్రజలకు ఖర్చుపెట్టాల్సిన నిధుల్ని తమ సొంత ప్రయోజనాలకు వాడుకోవడం, మిగుల్చుకోవడం ఎవరికీ తెలియంది కాదు. ఇంకా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం కోసం కోట్లాది రూపాయలు వెనకేసుకోవడం, బంజరు భూముల్ని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం, ఇన్ని అనర్థాలు జరుగుతున్నా, జనం అరచి గీపెట్టినా పట్టంచుకునేదెవరు?
అకస్మాత్తుగా పెద్దనోట్ల రద్దుతో ప్రజలంతా అష్టకష్టాలు పడ్డ విషయం నుంచి ఇంకా తేరుకోకముందే జీఎస్టీ విధానంతో సామాన్యుడి బతుకుతెరువుపై విస్ఫోటనం కలిగినట్టయింది. సా మాన్య జనం ఆ శించే ‘రోటీ కపడా మఖాన్’ అందనం త ఎత్తుకు ఎదిగిపోయాయి. ప్రజలకు దైనందిన జీవితం లో అత్యవసరమైన పాలు, నీళ్లు, పె ట్రోల్, వంటగ్యాసు రోజుకో ధర పలకడం, ఏ వస్తువు పెరిగిందో, ఏది తరిగిందో తెలియక వినియోగదారులు గందరగోళంలో పడగా, అదనుచూసి వ్యాపారులు దోపిడీ చేయడం జరిగిపోతోంది. కాళ్లకు తొడుక్కునే చెప్పుల నుండి వొంటిపై వేసుకునే దుస్తుల వరకు పన్ను భూతం భయకంపితుల్ని చేయడం చూస్తున్నాం.
నిన్నటి వరకు బ్యాంకులు తమ సేవలన్నింటిని చిందరవందర చేశాయి. బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్న డబ్బు, నెలవారీ పెన్షన్ చెల్లించడానికి నానా ఇబ్బంది పెట్టారు, ఇప్పటికీ పెడుతున్నారు. కస్టమర్‌ను ఎవరో పరాయి వ్యక్తిలా తిరస్కరించడం, గంటల కొద్దీ క్యూలో నిలబెట్టడం, ఎవరి శ్రేయస్సు కోసం ఈ ఆర్థిక సంస్కరణలు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. మితిమీరుతున్న అవినీతికి అడ్డుకట్ట వేస్తున్నామని నూటికొకరిద్దర్ని టార్గెట్ చేస్తున్నట్టు హడావుడి చేయడం, ఆ తరువాత మరిచిపోవడం, కోట్ల సంపాదన, ఆస్తులు, దోపిడీతో అక్రమార్కులు దర్జాగా తిరుగుతున్నవారున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేటు విద్యా సంస్థలు మరీ ఘోరంగా నిలువుదోపిడీకి పాల్పడుతున్నా- ప్రభుత్వం చోద్యం చూస్తున్నదంటే వారికీ ఇందులో భాగస్వామ్యం ఉందనిపిస్తుంది. అమాయక ప్రజలే పన్నుపోటుకు బలి కావాలా? న్యాయం చేయమని సమ్మెలు, ఉద్యమాలు చేస్తే బలవంతంగా అణచివేయడం, ఈ క్లిష్ట పరిస్థితులకు తలవంచడమేనా? న్యాయం కోసం జీవితాంతం ఎదురు చూడడమేనా? మరో మార్గం లేదా?

- అడపా రామకృష్ణ