Others

కృష్ణస్తు భగవాన్ స్వయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘యస్మిన్ సర్వాణి తేజాంసి విలీనయంతే స్వతేజసి, తం వదంతి పరే సాక్షాత్ పరిపూర్ణితమం స్వయం’’ ఏ తేజస్సులో ఐతే సర్వ తేజస్సులో లీనమవుతాయో అట్టి తేజస్సు... కారుచీకట్లకు ఆవల నిర్మలమైన వినీలాకాశంలో దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ చిన్మయుని తేజం, ఆ దివ్యకాంతి లోకంబులు, లోకేశులు, లోకస్థులు అందరూ అదృశ్యమైనప్పటికీ సర్వగ్రహమండలాలను ప్రకాశింప చేస్తూ నిత్యమై సత్యమై వెలుగొందే అద్భుతతేజోరాశి. చిరునవ్వులు చిందిస్తున్న ఆ తేజస్సును ఆ పరాత్పరుని చూస్తుండేవారు ఎంతటి పుణ్యాత్లులో కదా అనుకొన్నారు త్రిమూర్తులు ఒకేసారి.
అంతలో మోము చిన్నబుచ్చుకుని కనుల నీరు నింపుకుని భూదేవి ఆగమనం. ఆమెను చూచి త్రిమూర్తులు ఒక్కసారిగా అమ్మా అని సంబోధించారు. తండ్రీ నేనీ భూభారాన్ని మోయలేకున్నాను. మీరే ఏదోఒక ఉపాయం ఆలోచించి నా కష్టాలు తీర్చాలి అని ఆమె వాపోయింది. త్రిమూర్తులు తలపంకించారు. అమ్మా ఈ భూభారాన్ని తగ్గించేవాడు పరంధాముడు ఒక్కడే ఆయన దగ్గరకు మనం వెళ్దాం పదమ్మా అని నల్వురూ బయలుదేరారు.
శతయోజనాల దూరం నడిచారు. అద్భుతమైన బ్రహ్మద్రవపదార్థం అందులో బంతుల్లా దొర్లే బ్రహ్మాండాలు వారికి సూదరంగా కనిపించాయి. అనేక బ్రహ్మాండాలకు అధిపతియైన సాక్షాత్తు నిర్గుణ పరబ్రహ్మను చూడబోతున్నామన్న ఆనందాతిరేకంతో వడివడిగా అడుగులు వేస్తున్నారు. రత్న నిర్మితములైన ఎనిమిది పట్టణాలు వారికి కనిపించాయి.
అక్కడ శే్వతకాంతులు విరజిమ్మే విరజానది నిర్మలంగా ప్రవహిస్తోంది. అనేకమంది దేవతలు అందరూ విహరిస్తున్నారు. వారు చూస్తుండగానే అనంతకోటి సూర్యుల తేజస్సు ఒక్కటైందా అన్నట్టు పెద్ద వెలుగు విస్తరించింది. ఆ వెలుగులోపల శాంతి ధామం.. స్పటికకాంతులతో ప్రకాశించే ఆదిశేషునిపైన వినిర్మలంగా వెలిగే గోలోకం చేరగానే పహరా కాచే కావలి గాండ్లు అడ్డగించారు. ‘‘అయ్యా! మేము త్రిమూర్తులము, ఈమె భూదేవి. మేంనల్వురం శ్రీకృష్ణ దర్శనార్థమై వచ్చాము’’అని వీరు పలికారు. వీరిని చూచి శతచంద్రానన అనే చెలికత్తె దగ్గరకు వచ్చింది. అయ్యా మీరే బ్రహ్మండం నుంచి వచ్చారు ప్రశ్నించింది. ఆ మాటలకు విస్మయం చెందిమేము..
‘‘అమ్మా పృశ్నిగర్భుడుదయించిన బ్రహ్మాండం నుంచి వచ్చాం తల్లీ ’’ అని విష్ణువు చెప్పాడు. శతాచంద్రానన మెల్లగా మందహాసం చేసి దారిచ్చింది. మెల్లగా ఆ శాంతి ధామంలోకి అడుగుపెట్టారు. అద్భుతం! వేయి వెలుగుల పున్నమి ఒక్కసారిగా వికిసించినట్లుగా తేజస్సు ... అందులో సహస్రదళపద్మం.. షోడశదళం.. అష్టాదశ దళం.. ఆ పద్మంమీద రత్నసింహాసనం ఆ సింహాసనం పైన పద్మపత్రాక్షుడు, శ్రీవత్సలాంఛనుడు, శ్యామసుందరుడు అయిన పరాత్పరుడు తన దేవేరితో కలసి చిరునవ్వులు ఒలికిస్తున్నాడు.
ఆ సుందరదివ్యమూర్తిని చూచిన నల్వురూ ఆనందపారవశ్యంలో వచ్చిన పని మరిచారు. కొంత సేపటికి పరమాత్మనే ఓ దేవతలారా! భయం వీడుడు. నేనే దేవకీ వసుదేవులకు మరలా పుడతాను. అపుడీ భూభారాన్ని తగ్గిస్తాను. నా అంశతోనే బలరాముడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు లక్ష్మీదేవియే రుక్మిణిగా పార్వతి అంశలో జాంబవతి, తులసి అంశతో సత్య, భూదేవి అంశతో సత్యభామ, యజ్ఞపత్నియైన దక్షిణాదేవి అంశతో లక్ష్మణ, విరజానది కాళిందిగా, హ్రీ అనే కళ భద్రగా, జాహ్నవి మిత్రవిందగా, ఇలా వీరందరూ పలురూపాలతోభూలోకంలోకి వస్తారు. వీరంతా నా చుట్టూనే పరిభ్రమిస్తుంటారు. ఇక మీరు మీ స్వస్థానాలకు వెళ్లండి ’’అని ఆదేశించారు. ఆ దివ్యతేజోమయుని ఆదేశాన్ని పాటించి నల్వురు తిరుగు ముఖం పట్టారు.
మధురానగరం
శూరసేనుడు మధురానగరాధిపతి. శూరసేనుడు కుమారుడు వసుదేవుడు. ఉగ్రసేనుని కుమార్తె దేవకి. వీరిద్దరికి అంగరంగవైభోగంగా పెండ్లి జరిగింది. దేవకీదేవి సోదరుడు కంసుడు. అక్కబావలను రథంలో కూర్చోబెట్టుకుని సోదరిని అత్తవారింట దిగబెట్టి రావడానికి బయలుదేరాలు. మంగళధ్వనులు మోగుతున్నాయి. గుర్రాలు పూన్చిన రథాలు, ఏనుగులు, దాసదాసీజనం అందరినీ వెంటబెట్టుకుని తన సోదరిని తీసుకొని వెళ్లేసమయంలో ఆకాశవాణి ‘‘ఓ కంసా! నీవు చాలా సంతోషంగా మీ సోదరి కోసం బయలుదేరావు. కాని ఈ సోదరి గర్భంలోనే నిన్ను కడతేర్చేవాడు పుట్టబోతున్నాడు’’ అని పలికింది.
అంతదాకా సంతోషంగా ఉన్న కంసుడు వెంటనే రౌద్రాకారుడయ్యాడు. ఎవరు చెప్పినా వినకుండా దేవకీవసుదేవులను చెరసాల పాలు చేశారు. అక్కడే దేవకీవసుదేవుల సంసారం సాగుతోంది. వారికి ఆరుగురు పిల్లలు పుట్టారు. వారంతా కంసుని కరవాలానికి బలయ్యారు. దేవకీ ఏడవ గర్భం విచ్ఛిన్నమైంది. అష్టమ గర్భాన్ని దేవకీ ధరించింది. కంసునిలో చెమటలు ఆరంభమయ్యాయి. ఓ లోకాలన్నీ మాయాదేవికి వశమైనవేళ అర్థరాత్రివేళ దేవకీ దేవి గర్భం నుంచి దేవదేవడు ఆనందచిత్తుడు చిన్మయుడు, చిదానందుడు ఉద్భవించాడు. దివ్యాతిదివ్యమైన వెలుగు చిన్ని బాలునిరూపంలో కనిపించింది. ఆవెలుగునుచూచి నిశే్చష్టితులైన దేవకీ వసుదేవులు మూగవోయి కనులప్పగించి చూస్తున్నారు. దేవాదిదేవుడు వారిని అనుగ్రహించాడు. వసుదేవుడు తేరుకున్నాడు. చేతులెత్తి మొక్కాడు. అంతలో ఆబాలుడే శంఖచక్రగదాపద్మాలతో విలసిల్లే చతుర్భుజునిగా మారాడు. విశాలమైన వక్షస్థలం, కంఠంలో కౌస్త్భుం, శ్రీవత్సమనే పుట్టుమచ్చ మొలనూలు, కరకంకణాలు,బాహుపురులు, చెవులకు కుండలాలు, పాదాలకు మంజీరాలు ఇలా ఉన్న మహావిష్ణువును దేవకీవసుదేవులు ఎన్నో విధాలుగా స్తుతించారు. వారి స్తుతులను నుతులను విన్న పరంధాముడు‘‘అమ్మా! నేను నీకిచ్చిన వరం ప్రకారం నీకుమారుడినై పుట్టాను. నీవు ఇంతకు పృశ్ని అనే మహాపతివ్రతవు అపుడు ఈ వసుదేవుడు సుతవుడనే ప్రజాపతి మీకిద్దరికీ అపుడే నేనే కుమారుడిగా పుట్టాను. ఆ తరువాత మీకోరిక ననుసరించి మీరుఅదితి కశ్యపులైనపుడు మీకుమారుడిగా నేను పుట్టాను. ఇపుడిక దేవకీ వసుదేవులుగా వున్న మీకు నేను కృష్ణునిగా పుట్టాను. ఇక నేను చెప్పినట్లుగా మీరు చేయండి. వసుదేవా! నన్ను తీసుకొని వెళ్లి నందవ్రజంలో నందుని ఇంట యశోదాదేవికడ పడుకోబెట్టండి . అక్కడున్న యోగమాయను తీసుకొచ్చి దేవకీ దగ్గర పడుకోబెట్టండి. అపుడు అందరికీ ఈ దేవకీ గర్భాన ఉదయించింది ఆడపిల్లగా భ్రమిస్తారు. ఇక నేను చూస్తాను. మీకు ఇదే ఇక చివరి జన్మ. మీరిద్దరూ గోలోకానికి వస్తారు.’’ అని చెప్పితిరిగి బాలునిగా మారిపోయాడా పరంధాముడు.
వసుదేవుడు లోకాలన్నింటిని తన కుక్షిలో ఉంచుకున్న పరంధాముని గంపలో పెట్టుకొన్నాడు.
కావలి గాండ్లు గాఢనిద్రలోకి జారారు. కారాగారం తలుపులు వాటికవే తెరుచుకున్నాయి. యమునా నది దారిచ్చింది. వసుదేవుడు రేపల్లె చేరాడు. నందుని ఇంట యోగమాయనే ఆవరించి ఉంది. నిద్రవోతున్న యశోద పక్కన ఉన్న బాలిక తీసుకొని ఈ కృష్ణయ్యను అక్కడ పడుకోబెట్టి తిరుగు ముఖం పట్టాడు వసుదేవుడు. దేవకి చెంత చేరగానే అన్ని పరిస్థితులు పూర్వంలాగా మారిపోయాయి. దేవకి చెంత చేరిన పురిటబిడ్డ కెవ్వుమంది. కారాగారం మేల్కొంది. కంసునికి దేవదేవుని ప్రసవ వార్త చేరింది.
* * *

- చరణశ్రీ