Others

జన్మల పూర్వాపరాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జన్మను పక్షులు, జంతువులు గొప్పవని ఎపుడూ చెప్పలేదు. మానవులే మానవ జన్మ గొప్పదని చెప్పారు. చెబుతున్నారు. ఇది అవనూ వచ్చు.
మరి ఇన్ని కోట్ల ప్రాణులున్న ఈ సృష్టిలో తన జన్మను తలుచుకుని ఒక విధంగా మానవుడు చాలా ఆశ్చర్యపోవచ్చు.కన్నుముక్కులు అవయవాదులు కలిగి ఉండడంలో మానవులు స్ర్తి పురుషులు ఆయా స్ర్తిలతో లేక పురుషులతో సమానంగా ఉండవచ్చు. కాని ఏ ఒక్క పురుషుడు, ఏ ఒక్క స్ర్తి ఇన్ని కోట్లమందితో ఏదో కొంత తేడాతో తన ప్రత్యేకతతో ఉంటున్నాడు.
అన్ని దేశాలల్లోను సన్నమనుషులను తీసుకొని ఆలోచించినా (సన్నవారు=ఎరుకగలవారు- భగవద్గీత) ఇప్పుడు ఉన్నవారి గురించి ఆలోచించినా రూపధారణలోను, ఆలోచనావిధానంలోను మార్పులు కనిపిస్తున్నాయి. రూపధారణలో ఆలోచనాధోరణిలోను మనిషి తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. ఇన్ని ప్రత్యేకతలున్నా ప్రతి ఒక్క వ్యక్తి మధ్యలోను, అంతిమ జీవన దశల్లోను ఒక ప్రశ్న వస్తోంది. సుమారు వందేళ్లు లేక తక్కువగానో, ఎక్కువగానో విలక్షణంగా జీవించిన నేను మరణించి ఏవౌతాను? ఎక్కడికి పోతాను? అన్న ప్రశ్న వేసుకొనని వాళ్లు అరుదు. ఈ ప్రశ్న మీద ఆధారపడే యావత్తు భూగోళ జ్ఞాన శాఖల్లో అనేక గ్రంథ విశేషాలు వచ్చాయి. అనేక తత్వ దర్శనాలు జరిగాయి.
ప్రపంచ వ్యాప్తగా మరణానంతర జీవితం పై ఎన్నో ఆసక్తికర పరిశోధనలు జరిగాయి. విశ్వాసాలు ఏర్పడ్డాయి. అంచనాలు వచ్చాయి. రూఢిగా ఇలా జరుగుతుందని ఎవరూ చెప్పే దాఖలాలు లేకపోయినా ఇంకో జన్మఅంటూ ఉంటే బాగుంటుందన్న ఆలోచనే అందరికీ సహజంగానే ఉంటుంది.
ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంది. మరణించాక ఒక జన్మ ఉంటే మరణించడానికి ముందు జీవించిన కాలానికి ముందు కూడా ఒక జన్మ ఉండి వుండవచ్చుకదా! అంటే పుట్టుకకు ముందు. దీనిలో రెండు జ్ఞానభాగాలు వచ్చాయి. ఆఖరికి కొంత మంది ప్రవక్తలు స్థానికం గా తయా రై మీ పూర్వజన్మ మేం చెప్పగలం అని విశ్వాసాలను కల్పించినవారు ఉన్నారు. ఇక్కడే మానవుని లౌల్యం కూడా కనిపిస్తుంది.
ఒక స్ర్తిని చూచి నీ పూర్వజన్మలో విక్టోరియా రాణివనో, ఏ రుద్రమ దేవి వనో ఏదో ఉన్నత స్థాయిలో ఉన్నావని అంటే ఆమె పొంగుతుంది. అదే ఆ స్ర్తితో నీ పూర్వజన్మ నాకు తెలుసు. నువ్వు క్రితం జన్మలో ఫలానా బస్టాండులో సరైన వస్త్రాలు లేకుండా సరైన తిండి లేకుండా ఒక అడుక్కునే బిచ్చగత్తెవి అని చెబితే ! అలా వినడానికి ఆమె కాదు పురుషుడుకూడా ఆకాంక్షించడు. మానవులు ఎప్పుడూ ఉన్నత స్థానాలు, ఉన్నత గతులే కోరుకుంటారు. బహుకాలం ఎండలకు వానలకు చిక్కి సుక్కి ఏళ్లతరబడి తపస్సు చేస్తే ఆ తాపసికి వచ్చే వరం ఇంద్ర పదవి. అంతే మరుసటి జన్మను రంభాదుల నృత్యాదులను చూస్తూనో, ఆనందాలతో జీవన సాఫల్యాలతో గడపాలని కోరుకునే మానవ చింతన ఒక స్వప్నంగా దాపురించవచ్చు.
అయితే ఈ జన్మ పరంపరలు అన్ని దాటి జన్మ రాహిత్య దశను పొందడమే తురీయ జీవన సాఫల్యమని ఆర్షగ్రంథాలు ఘోషిస్తున్నాయి. కర్మ సిద్ధాంతానికి జన్మ పునర్జన్మల అంశాలకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఫలానా తప్పుడు పనిచేస్తే మరుసటి జన్మలో దుష్టమైన జన్మ ఎత్తుతావని లేదా సత్కార్మాచరణలకు నడుంబిగిస్తే ఉత్తమ జన్మలను పొందుతావని చెప్పినప్పుడు విశ్వాసాల మాట అలా ఉంచి సామాజికంగా మానవులు నీతివంతులుగా సద్గుణ జీవన్మోఖులుగా ఉండడానికి అవకాశం ఉంది. కనుక ఈ పూర్వజన్మల పూర్వా పరాలను చర్చించడం వాని అనుపానులు తెలుసుకోవడం పురాణాది గ్రంథాల్లో ఎవరి జన్మకు ఎవరిది పూర్వజనం ఎవరి జన్మ ఉత్తర జన్మం అని తెలుసుకోవడం వల్ల ఒక సామాజిక ప్రయోజనం కూడా ఉంది. ఉదాహరణకు ద్రౌపది పూర్వజన్మను తీసుకొంటే రెండు మూడు కథనాలున్నాయి. ఒక కథనంలో ద్రౌపది తన పూర్వజన్మలో ఓ నదిలోస్నానం చేస్తోందట. ఆమెకు సమీపంలో ఓ పురుషుడు స్నానం చేస్తూ ఎంతకీ గట్టు వైపుకు వెళ్లడం లేదట. ఆమె అతనిని చూస్తూ అందరూ గట్టు పైకి వెళ్తున్నారు. కాని ఇతను మాత్రం ఎందుకు వెళ్ళడం లేదు? అని ఆలోచించిందట. ఆయన అధోభాగానికి చుట్టుకున్న వస్త్రం ఆ నీటిలో ఊడిపోయి నీళ్లల్లో కొట్టుకుని పోవడం వల్ల అతడు పైకి వెళ్లలేకపోతున్నాడని తెలుసుకుంది. వస్తర్రహితంగా ఎలా వెళ్లగలడు అనుకొన్న ద్రౌపది ఆయన వైపు తన చీరలోని కొంత వస్తభ్రాగాన్ని చించి పడవేసి తన దారిన తాను పోయిందట. అతడు మనసులో కృతజ్ఞతలు చెబుకుంటూ గట్టు ఎక్కగలిగాడన్నది చెప్పకపోయినా తెలిసే విషయమే. ఈ కథ ఇలా ఉంచితే ఈ మహిళనే ద్రౌపదిగా జన్మించిందని ఒక కథనం. అయితే సత్కర్మ ఫలితం ఎప్పటికీ నిలిచి ఉంటుందనేది ఆర్ష విశ్వాసం!
మహాసభలో పరమ పతివ్రత ద్రౌపది. ఆమెను అవమానిస్తూ వస్త్రాపహరణం చేస్తున్న సందర్భంలో ఆమెకు పరంపరగా చీరలు వచ్చేసాయి. దయాపరుడైన శ్రీకృష్ణపరమాత్మ వల్ల ఆ చీరలు వచ్చి ఆమె మాన గౌరవ సన్మానం చేశాయి.
ఇక్కడ ఇది పురాణంలో కావచ్చు. జనశృతిలో ఉండవచ్చు. కానిప్రజలను నీతిపరులను చేయాలి కదా అనేదే ప్రధానం. సత్కర్మ చేస్తే ఉత్తర జన్మలో మనకు మంచి జరుగుతుందనే నీతి. సత్కర్మల నిర్వహణ వల్ల ఉత్తరోత్తరా ఉత్తమ జన్మలు వస్తాయనే ఒక విశ్వాసం. అష్టాదశ పురాణాల్లో, ఎనె్నన్ని కథలు, ఎనె్నన్ని జన్మలు, ఎనె్నన్ని కథనాలు ఆ పురాణ గ్రంథాల పూర్వగాథాలహరుల పరిమళాలను శ్వాసించి స్వీకరించి ఇదిగో ఇలా మీ ముందుకు ఒక శాస్ర్తియ మార్గ దర్శకత్వంలో ఈ శీర్షిక పాఠకులను రుచిని కల్గిస్తుందని ...

డా॥ రాయసం లక్ష్మి