Others

లక్కీ.. ‘పిల్ల’వి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయి పల్లవి టాలెంట్‌కు తెలుగు ప్రేక్షకులే కాదు, నిర్మాతలు, దర్శకులూ ‘్ఫదా’ అయిపోయినట్టే. వరుణ్‌తేజ్ సరసన ఆమె చలాకీ తనం చూసిన తరువాత -అవకాశాలు ఆమె డైరీలో పేజీలు వెతుక్కోవడం ఖాయమనే అనుకున్నారు అంతా. ఇప్పుడదే జరుగుతోంది. ఒక్క సినిమా హిట్టయితే -అందరూ అదే కోరుకోవడం ఖాయమన్న ఇండస్ట్రీ సెంటిమెంట్‌ను నిజం చేస్తోంది సాయి పల్లవి. ‘్ఫదా’లో ఎగిరి గంతేసే పాత్రతో ఇట్టే ఆకట్టుకున్న తమిళమ్మాయికి -తెలుగు అవకాశాల ముసురు పడుతోందట. అందులో భాగంగా యంగ్ హీరో శర్వా సరసన నటించే చాన్స్ దక్కతోందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. మారుతితో ‘మహానుభావుడు’ చేస్తున్న శర్వానంద్, తదుపరి సుధీర్ వర్మతో సినిమా చేయనున్నాడు. ఇందులో శర్వాకు జోడీగా సాయిపల్లవిని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. చర్చలు కొలిక్కి వస్తే -శర్వా పక్కన సాయి ఇంకెంత అల్లరి చేస్తుందో చూడొచ్చు.