Others

ఉత్తుంగతరంగాల గంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ప్రాణాన్ని నిలిపేది మనకు జనసత్వాలనిచ్చేది నీరే. ఈ నీటికి కూడా ఎంతో చరిత్ర ఉంది. సముద్రాలు జలాశయాలు, చెరువులు, కుంటలు ఇలా నీటిని నింపుకుని వుండేవి స్థానాలు ఎనె్నన్నో ఉన్నాయి. ఎక్కడెక్కడో నీళ్లు వున్నా వాటినన్నింటినీ గంగగానే భావిస్తాం మనం.
గంగేచ యమునే కృష్ణ గోదావఠి సరస్వతీ నర్మదే సింధూ కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు..అంటు ఇంట్లోని నీళ్లతొట్టిలోని నీళ్లతో స్నానం చేసి నదులన్నింటిలో స్నానం చేసిన పుణ్యాన్ని ఇవ్వమని భగవంతుడ్ని అడుగుతుంటాం.
అందుకే ఎక్కడ మంచి నీటినైనా సాధారణంగా గంగ అని సంభోదిస్తాం. అందరికీ రఘవంశంలోని భగీరధుడు తపస్సు చేసి ఆకాశగంగగా వున్న నీటిని భూలోకానికి తీసుకుని వచ్చాడని మనకు తెలుసు. కానీ ఈ ఆకాశగంగ కన్నా ముందు గంగ అసలు ఎక్కడ వుండేది? ఏ రూపంలో ఉండేదో తెలుసా!
గంగ పూర్వజన్మలో పూర్ణిమ. ఈమె తల్లిదండ్రులు మరీచి, కళ. పూర్ణిమగా పుట్టిన గంగకు విరజుడు, దేవకుల్య అనే వారికి జన్మనిచ్చింది. ఆ తరువాత మహా విష్ణువు కోసం తపస్సు చేసింది. ఆమె తర్వాతి జన్మలో గంగగా పుట్టింది. దీనికికన్నా ముందు గంగ, లక్ష్మి, సరస్వతి అను ముగ్గురు కూడా విష్ణ్భుగవానుని భార్యలుగా వుండేవారు. ఒకసారి వీరు నలుగురు ఒక చోట కూర్చున్నారు. అప్పుడు గంగ అదేపనిగా తన భర్తను చూసిందట. లక్ష్మీ సరస్వతులు చూసినా రెప్పవేయకుండా ఆ విష్ణు భగవానుడినే చూస్తోందట గంగ. ఆ గంగను మాత్రమే విష్ణువు కూడా చూడడం మొదలుపెట్టాడట. ఆంతే వీరిద్దరినీ చూసిన సరస్వతికి కోపం వచ్చి ఓ గంగా నీవు ద్రవరూపంలో పుట్టెదవుగాక! అని శపించిందట. వెంటనే గంగ కూడా ఆమెను నదివై ప్రవహిస్తావు గాక అని ప్రతిశాపం ఇచ్చిందట. ఇలా శాపాలు పొందిన వీరిద్దరు నదులుగా ప్రవహిస్తున్నప్పుడే వామనావతారుడు ఉద్భవించాడు. ఆయన బలి చక్రవర్తి దగ్గర దానం తీసుకుని ఆయన పాదాలు బ్రహ్మాండాలకు వ్యాపింపచేసే సమయంలో ఆకాశంపై వామనుడు తన పాదాన్నిపెట్టాడట. అప్పుడు బ్రహ్మలోకంలోని విధాత తన కమండలంలోని ధ్రవరూపంలోని గంగతో మహావిష్ణువు పాదాలను కడిగాడట. దాంతో ఆ మహావిష్ణువు పాదాలనుంచి జారిన నీరే గంగానదియై ప్రవహించిందని అంటారు. ఇదంతా భాగవతం చెప్తుంది.
అసలీ గంగ బ్రహ్మ కమండలం ఎలా చేరింది అంటే ఒకసారి మనం గోలోకం వెళ్లాలి. సరస్వతి శాపంవల్ల ద్రవరూపం పొందిన గంగ గోలోకంలో ప్రవహిస్తోందట. అక్కడ వుండే కృష్ణుడు ఈమె ప్రవహించే వంపుసొంపులను చూసి ముచ్చటపడి ఈమెను ప్రేమించాడట. ఎప్పుడు ఈ గంగానది వద్దే వుండేవాడట కృష్ణుడు. ఈ సంగతి రాధాదేవికి తెలిసింది. కృష్ణుని మీద అమిత ప్రేమ గల రాధ తన్ను విడిచి గంగ దగ్గరకు వెళ్లడాన్ని సహించలేక గంగ మీద కోపంతో ఆమె దగ్గరకు వెళ్లింది. అక్కడ వున్న కృష్ణుని చూసి తాను వచ్చినా గంగనే చూస్తున్నాడే అనే కోపంతో కృష్ణుడితో పోట్లాటకు దిగింది రాధ. పోట్లాడుకునే రాధాకృష్ణులను చూసి గంగ భయపడి విష్ణువు దగ్గరకు వెళ్లి తనను రక్షించమని కోరిందట. మహా విష్ణువు తన పాదం కింద దాక్కోమని ఆమెకు చెప్పాడట. అంతే లోకాలన్నీ నీళ్లు లేక అల్లాడిపోయాయట.
దాంతో బ్రహ్మ మహేశ్వరులు వచ్చి జరిగింది తెలుసుకుని గంగకు భయం అక్కరలేదని చెప్పి ఆమె విష్ణుపాదాల కిందనుంచి పైకి లేపారట. అప్పటినుంచి మళ్లీ అన్నీ లోకాలలో ప్రవహించడం మొదలుపెట్టింది. అప్పుడు బ్రహ్మ తన కమండలంలో కాసిని నీళ్లు తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్లాడు. అలా బ్రహ్మలోకానికి వెళ్లిన గంగ వామనుని పాదాలను కడగడానికి పనికి వచ్చింది. ఇదంతా బ్రహ్మవైవర్తన పురాణం మనకు చెబుతుంది.
ఇలాంటి ఆకాశ గంగను భగీరధుడు భూలోకానికి తెచ్చాడు. ఎందుకు అంటే ఓసారి సగర చక్రవర్తికి యజ్ఞం చేయాలని కోరిక కలిగింది. ఆయన తన పురోహితులతో చర్చించి యజ్ఞాన్ని ఆరంభించాడు. యాగాశ్వాన్ని వదిలిపెట్టాడు. ఆ యాగాశ్వాన్ని రక్షించడానికి తనకున్న అరవై వేలమంది కుమారులను నియమించాడు. యాగాశ్వం వెనుక వారంతా వెడుతున్నారు. కొన్నాళ్లకు వారికి యాగాశ్వం కనపడకుండా పోయింది. ఎవరు తీసుకువెళ్లారా అని తెలుసుకుందాం అనుకున్నారు అంతా వెతికారు కానీ వారికి ఆ అశ్వం కనపడలేదు. ఈ విషయం వారు సగరునికి చెప్పారు. యాగాశ్వం తీసుకురాకుంటే యజ్ఞం మధ్యలో ఆగిపోతుంది కదా అని వారిని నాలుగు చెరుగులా వెదకండి అని సగరుడు ఆజ్ఞాపించాడు. వెంటనే వారు వారి గోళ్లతో భూమినంతా పెకిలిస్తూ భూమిలోపల యాగాశ్వం కోసం వెతుకుతున్నారు.

- డా. రాయసం లక్ష్మి