Others

ఇదీ రూపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరాకారమైన భగవంతుడు భక్తులు కోరుకున్నరూపంలో వ్యక్తం అవుతాడని అంటారు. అట్లాంటి దైవాన్ని శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారుగా భావించి పూజలు చేస్తుంటారు. ఎవరి ఇంటి ఆచారాన్ని బట్టి వారు అమ్మవారిని రూపొందించుకుంటుంటారు.
కొంతమంది కొబ్బరి కాయకు మోమును పిండితో దిద్దికొని కళ్లు ముక్కు నోరు, చెవులును విభాగించుకుని వివిధ రకాల సొమ్ములు పెట్టి అమ్మవారిని కొలుస్తారు.
మరికొంతమంది కొబ్బరికాయకు పసుపురాసి, కుంకుమపెట్టి జాకెట్టు గుడ్డ చుట్టి పూలు అలంకరించి వరలక్ష్మిదేవిగా కొలుస్తారు.
మరికొంతమంది వారి ఇంటి వాడుకనుబట్టి ఏదైనా ఒక బిందెకు చీరకు కట్టి దానిపై ఒక చెంబు పెట్టి దానిపై అమ్మవారి ముఖాకృతిని బంగారంతోను, లేక వెండితోను చేయించి పూవులను రకరకాల నగలు పెట్టి అలంకరించి వరలక్ష్మీదేవిగా పూజిస్తారు.
మరికొంతమంది చెంబుపై కొబ్బరికాయను పెట్టి దానిపై అమ్మవారి ముఖాకృతిని పసుపుతో దిద్ది కళ్లుముక్కు చెవులు నోరును అమర్చి చిరునవ్వు చిందించే అమ్మవారి ఆకృతిని తయారు చేసి చీరకట్టి వివిధ నగలను అలంకరించి పూజడవేసి పూవులతో పూజచేస్తారు.
ఇలా పొద్దున వరలక్ష్మిదేవికి పూజ చేసి సాయంత్రం వేళ తోటి స్ర్తిలను ఇంటికి పిలిచి పండు తాంబూలాలను నానబెట్టిన శనగలను ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని శ్రావణ వరలక్ష్మి ఆశీస్సులు భావించి స్వీకరిస్తారు.

- లక్ష్మీగౌరి