సబ్ ఫీచర్

అమ్మ కడుపు చల్లగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశాన్ని పాలించే నాయకుడు కూడా తల్లి గర్భంలో తొమ్మిది నెలలుండిన తరువాతే భూమిపై అడుగుపెడతాడు. నేటి సమాజంలో ఉండడానికి ఇళ్లు అద్దెకు తీసుకున్న తరువాత, నెల అవ్వగానే ఇంటి అద్దె, నీళ్ల బిల్లు, కరెంటు బిల్లు అని అడిగే ఈ రోజుల్లో, ఉండడానికి తన గర్భాన్ని, బ్రతకడానికి తన వాయువుని, ఆహారాన్ని ఇంక అనురాగాన్ని ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చే ఏకైక ప్రాణి అమ్మ ఒక్కర్తే. తల్లి తన పిల్లలపై చూపే ప్రేమ ప్రతి జీవిలోను చూస్తాం. అందుకే తల్లి ప్రేమ నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ.
‘‘ప్రేమ కెరటం అయితే అమ్మ సముద్రం/ ప్రేమ వాన అయితే అమ్మ మేఘం
ప్రేమ నీడ అయితే అమ్మ వృక్షం/ ప్రేమ రాగం అయితే అమ్మ గానం’’
అందమైన అమ్మాయినించి అనురాగం నిండిన అమ్మగా మారే అతివ ప్రయాణం గర్భం దాల్చడంతో మొదలవుతుంది. అమ్మనవుతున్నానని తెలిసిన తరువాత ఏ అమ్మాయి అయినా తన గురించి ఆలోచించడం మానేసి తన బిడ్డ గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. అటువంటి ఆమెను చూసుకోవడం, కంటికిరెప్పలా కాపాడుకోవడం భర్త కర్తవ్యం, ఇంటి పెద్దల ధర్మం. గర్భందాల్చిన తల్లులకి ఎన్నో సమస్యలు. అందులో ఒకటి పంటి సమస్య. ముందుగా శ్రద్ధ చూపకో, సరైన చికిత్స అందకో గర్భం దాల్చా క వీరు పంటి నొప్పికి బాధితులవుతారు.
గర్భవతులు తరుచూ పంటినొప్పి ఉందని నా దగ్గరికి వస్తారు. ఎందు కు ఇంత ఆలస్యం చేశారని నేనడిగితే వారి దగ్గర సమాధానం ఉండదు. ఏం చెయ్యాలిప్పుడు అని వారు నన్నడిగితే నా దగ్గర సమాధానం ఉండదు. గర్భం దాల్చాక చాలా పంటి చికిత్స లు చెయ్యడానికి ఉండదు. ఎక్స్‌రే తీసుకోవడం కుదరదు, మెరుగైన మం దులు వాడడం అవ్వదు. అలా కాదని చేస్తే వీటి ప్రభావం శిశువుమీద పడుతుంది. అందుకే పెళ్ళయ్యాక పిల్లలు కావాలని అనుకునేవారు ముందుగా వారి పళ్లని దంత వైద్యుడికి చూపించుకొని తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం. అలా చెయ్యనివారు గర్భా న్ని దాల్చిన తరువాత పంటి నొప్పి లేక వాపు వస్తే ఈ క్రింది విధంగా చికిత్స పొందాలి. తల్లి గర్భంలో శిశువు వుండే సమయం తొమ్మిది నెలలు. ఈ తొమ్మి ది నెలలని వైద్యులు మూడు దశలుగా విభజిస్తారు.
మొదటి దశ
ఒకటి నుంచి మూడో నెల వరకు- ఇది శిశువు అవయవాలు పెరిగే సమయం. ఈ సమయంలో పంటినొప్పి వస్తే చాలా కష్టం. ఎక్స్‌రే చెయ్యకూడదు, అధిక మందులు వాడకూడదు, పంటికి సంబంధించిన ఏ చికిత్స చెయ్యడం కుదరదు. ఏ మందులైనా, ఏ చికిత్స అయినా మీ గైనికాలజిస్ట్ అనుమతి తీసుకునే ప్రారంభించాలి. అత్యవసర పరిస్థితులలో ఎక్స్‌రే తీయవలసి వస్తే కొన్ని నియమాలు పాటించాల్సి వుంటుంది. గర్భిణులకు జఉ -్గ్జ్ళజ తొడిగి ఎక్స్‌రే తియ్యాలి. అత్యవసర పరిస్థితులలో తప్ప పంటికి ఏ చికిత్స చెయ్యకూడదు.
రెండవ దశ
నాలుగు నించి ఆరో నెల వరకు- ఇది చాలా సురక్షిత సమయం. ఇపుడు కూడా ఎక్స్‌రే పై చెప్పిన నియమాలు పాటించి తియ్యాలి. మందులు గైనికాలజిస్ట్ అనుమతి తీసుకునే వాడాలి. పంటి చికిత్సలు ఏమైనా ఉంటే ఈ కాలంలో చెయ్యడం ఉత్తమం. ఈ సమయంలో తల్లి కాబోతున్న ప్రతి మహిళ దంత వైద్యుడిని సంప్రదించి తమ పంటి సమస్యల నుంచి విముక్తి పొందడం, గైనికాలజిస్ట్‌లు దీనిని ప్రోత్సహించడం చాలావరకు సబబు.
మూడవ దశ
ఏడు నుంచి తొమ్మిదో నెల వరకు- ఈ సమయంలో ఎక్స్‌రే, మందులు, చికిత్స అత్యవసర పరిస్థితులలో తప్ప చెయ్యరు. అలా కాదని చేయించుకుంటే ముందే ప్రసవించుట (ప్రీ మెచూర్ డెలివరీ) వంటి ప్రమాదం వుంది. ఒత్తిడి, నొప్పివల్ల ఇలా జరిగి నెలలు కాకుండా ప్రసవిస్తే పుట్టిన శిశువుకి ప్రమాదం కలగవచ్చు.
చిగురునుంచి రక్తం రావడం, చిగురు గడ్డలా మారడం (PREGNANCY TUMOR) కొంతమంది గర్భిణులలో కనబడుతుంది. HARMO NAL CHANGES వల్ల ఇలా జరుగుతుంది. దీనికి ఏ చికిత్స అవసరం లేదు. ప్రసవం తరువాత అవే తగ్గిపోతాయి. ఒకవేళ ఏదైనా చికిత్స చెయ్యాల్సి వస్తే అది తాత్కాలిక ఉపశమనం కోసమే. ఎందరో గర్భిణులు నా దగ్గరికి పన్ను నొప్పని, చిగురు వాపుకి వస్తారు. వారందరికీ చెప్పేది ఒక్కటే. జాగ్రత్త వహించండి. అయి తే తల్లి కాకముందు లేకపోతే రెండో ప్రాయంలో పంటి చికిత్స చేసుకొని, సుఖాంతమైన ప్రసవానికి అవకాశం ఇవ్వండి. మీ గైనికాలజిస్ట్ అనుమతి లేకుండా ఏ దంత వైద్యుడిచ్చిన మందులు వాడొద్దు. ఏ చికిత్స చేయించుకోవద్దు. అది మీ శిశువుకి మంచిది.
మనిషి రెండేచోట్ల ఆనందంగా నిద్రించగలడు. ఒకటి- పుట్టుక ముందు తల్లి గర్భంలో, రెండు- ప్రాణంపోయాక భూగర్భంలో. కని పెంచిన తల్లికి, నిత్యం మోస్తూ మనల్ని భరిస్తున్న భూమాతకి అన్ని ప్రాణులలోను ఉన్న తల్లులందరికీ వందనం, అభివందనం..
*

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com