Others

నైపుణ్యానికి మెరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు పదులు దాటిన కుర్రాళ్లు ఏం చేస్తారు. షికార్లు..్ఛటింగ్‌లు.. వీకెండ్ టూర్లతో ఎంజాయ్ చేస్తారు. ఈ ముగ్గురు కుర్రాళ్లు మాత్రం మురికివాడల ప్రజలలో మార్పు తీసుకువచ్చేందుకు కదిలారు. పనీపాటా లేకుండా సేవ పేరుతో కాలాక్షేపం చేయటం వీరి నైజం కాదు. పనిచేస్తూనే పదుగురికి సాయం చేయాలనే మంచి మనసు వీరిది. వీరే కమల్ నాయక్, సీతాకాంత్, నీలోఫర్,తబ్సమ్.
చారిటీ కేక్ ఏర్పాటు
హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ ప్రాంతాన్ని వీరు ఎంచుకున్నారు. గుడ్ యూనివర్స్ అనే ఎన్జీఓ సంస్థలో సభ్యులైన వీరు విభిన్న సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఈ ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలోనే కొండాపూర్ మురికివాడల్లో మార్పు తీసుకురావటానికి శ్రీకారం చుట్టారు. ఏ సామాజిక కార్యక్రమానికైనా ఓ వేదికంటూ కావాలి. సేవ చేయటానికి అవసరమైన నిధులు కావాలి. అందుకే చారిటీ కేక్ అనే బేకరీ స్టోర్‌ను ఆరంభించారు. బేకరికీ సంబంధించిన అనేక వస్తువులను ఇక్కడ తయారుచేసి నగరంలోని మల్టీనేషన్ కంపెనీలకు సరఫరా చేయటం ఆరంభించారు. మురికివాడల్లో ఉండే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటే వారు చేసే పనిలో నైపుణ్యానికి మెరుగులద్దాలని భావించారు. అందుకే బేకరీ వ్యాపారం చేస్తూనే అక్కడ ఉన్న నిరుద్యోగులను, చురుకైన వ్యక్తులను ఎంపికచేసుకుని శిక్షణ ఇవ్వటం ఆరంభించారు. వారిని బేకరి ఉత్పత్తుల తయారీలో భాగస్వాములను చేశారు.
పెరిగిన అమ్మకాలు
బేకరీ ఉత్పత్తుల అమ్మకాలు పెరగటం ఆరంభించాయి. ఐదు నెలల క్రితం ప్రారంభించిన ఈ బేకరీ దుకాణంలో నేడు రోజుకు 30-50 కేకుల వరకు అమ్ముడుపోతున్నాయి. ఎన్నో ఏళ్లగా మురికివాడలను సందర్శించి అక్కడ ప్రజలతో మాట్లాడిన తరువాత అర్థమైందేమిటంటే ప్రతి ఒక్కరు కూడా తమ జీవన విధానంలో మార్పును కోరుతున్నారు. సౌకర్యవంతమైన, సుఖవంతమైన జీవితం గడపాలని ఆరాటపడుతున్నారని గ్రహించం. దీనికి చదువే ఒక్కటే మార్గం కాదని భావించం. వారి చేసే పనిలోనే మెరుగైన ఫలితాలు సాధించేలా వారి నైపుణ్యాన్ని మెరుగులు దిద్దితే వారి సంపాదన కూడా పెరుగుతుందని భావించాం. ఇందుకోసం కొంతమందిని ఎంపికచేసుకుని వారికి రోజూవారీ వేతనం ఇస్తూ వృత్తి నైపుణ్యాలు నేర్పిస్తున్నాం అని చెబుతున్నారు కమల్ నాయక్.
నలభై వేల పెట్టుబడితో ఆరంభం
కొండాపూర్ ప్రాంతాన్ని ఎంపికచేసుకుని నలభై వేల పెట్టుబడితో ఈ చారిటీ కేక్ సెంటర్ ఆరంభించారు. కేవలం అమ్మకాల కోసం ఇది ఆరంభించలేదు. ఇక్కడ ప్రజలు బేకరీ ఉత్పత్తుల్లో శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందుతారనే ఉద్దేశ్యంతో దీన్ని ఏర్పాటుచేసామంటారు ఈ ముగ్గురు యువకులు. ఈ బేకరీకి అనుగుణంగా ఒక టీ స్టాల్ కూడా ఇక్కడ త్వరలో ఏర్పాటుచేయబోతున్నారు. ఈఉత్పత్తులను ఇంకా పెంచి మరింతమందికి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో వీరు ముందుకు కదులుతున్నారు.

చిత్రాలు.. కమల్ నాయక్, కమల్ నాయక్, సీతాకాంత్, నీలోఫర్,తబ్సమ్

-టి. ఆశాలత