AADIVAVRAM - Others

నిఘా నేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య ఎక్కడికి వెళ్లినా ఓ బోర్డు దర్శనం ఇస్తుంది. మీరు ఎలక్ట్రానిక్ పర్యవేక్షణలో వున్నారన్నది ఆ బోర్డు సారాంశం. అంటే నిఘా నేత్రం మనల్ని చూస్తుందన్నమాట.
రోడ్డు మీద యాక్సిడెంట్లు ఎలా జరిగాయో, ఎర్రలైట్ వుండగా దాన్ని క్రాస్ చేసిన వ్యక్తులని ఈ నిఘా నేత్రం ద్వారా తెలుసుకుంటున్నారు.
ఏదైనా ఆఫీస్‌కి వెళ్తే అక్కడ కూడా ఇలాంటి బోర్డే కనిపిస్తుంది. దవాఖానాల్లోని వి.ఐ.పి. రూముల్లో, లిఫ్ట్‌లలో ఈ బోర్డు దర్శనం ఇస్తుంది. అక్కడ పని చేసే ఉద్యోగుల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించకుండా అది ఉపయోగపడుతుంది. అదే విధంగా ఎవరైనా నేరం చేయకుండా వాళ్లని నిరోధిస్తుంది.
హోటళ్లలో, సినిమా థియేటర్లలో, షాపింగ్ కాంప్లెక్స్‌లలో, సూపర్ మార్కెట్లలో ఎక్కడ చూసినా ఈ నిఘా నేత్రాలు దర్శనం ఇస్తూనే ఉన్నాయి. ఈ నేత్రాలు మన గుప్తతని (ప్రైవసీ) దెబ్బతీస్తున్నాయని చాలామంది బాధపడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. కొంతమంది తమ వేష భాషలని సరిచూసుకుంటున్నారు. తామ ఎవరి వెంట ఉన్నామోనన్న విషయం కూడా పట్టించుకుంటున్నారు. నైతికతకి భంగం కలగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
వ్యక్తుల గుప్తతలోకి నిఘా నేత్రాలు చొచ్చుకొస్తున్నాయి. కానీ ఈ ఆధునిక సమాజంలో ఇది తప్పనిసరిగా మారిపోయింది. ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న తరుణంలో ఇది కాదని అనలేని పరిస్థితి. నిఘా నేత్రం మనల్ని చూస్తుందన్న విషయం మనకు తెలుసు కాబట్టి అది మన అనుభవంలోకి వస్తుంది కాబట్టి దీని గురించి ఆలోచిస్తున్నాం.
మనకు తెలియని మరో నిఘా నేత్రం ఒకటి ఉందన్న విషయం మనలో చాలామందికి గుర్తుండదు. ఈ నిఘా నేత్రం మనల్ని అనుక్షణం పర్యవేక్షిస్తుంది. అయితే ఆ విషయం మన అనుభవంలోకి రాదు. మనలో చాలామంది ఆ విషయాన్ని విశ్వసించరు. కాని ఇది వాస్తవం.
మనలని ఓ నిఘా నేత్రం పర్యవేక్షిస్తుందని మనం నమ్మితే మనం తప్పిదాలు చేయడానికి జంకుతాం. సరైన పద్ధతిలో నడవడానికి ప్రయత్నం చేస్తాం. అనుక్షణం మనం నిఘా నేత్రం పర్యవేక్షణలో వున్నాం.
ఈ నిఘా నేత్రం మనల్ని భౌతికంగానే కాదు మనస్సు అంతరంగాన్ని కూడా పర్యవేక్షిస్తుంది.
ఈ విషయం మనం గుర్తుపెట్టుకుంటే మంచి ఆలోచనలతో, నడవడికతో మన ప్రయాణం కొనసాగుతుంది.
నిఘా నేత్రం అనుక్షణం మనల్ని పర్యవేక్షిస్తుంది.
మర్చిపోకండి.

- జింబో 94404 83001