AADIVAVRAM - Others

చైతన్యం (కథాసాగరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైతన్యానికి వృద్ధాప్యం ఉండదు. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి శరీరం ముసలిదవుతుంది. కానీ చైతన్యమెప్పుడూ నిత్య యవ్వనంతో నిగనిగలాడుతూ ఉంటుంది.
వౌలింగపుత్రుడు అన్న యువకుడు బుద్ధుని దగ్గరకు వచ్చాడు. అతనికి ఎంతో అనే్వషణా శక్తి, ప్రతి దాని రహస్యాన్ని పరిశోధించే ఆసక్తి. ఆ యువకుడు బాగా చదువుకున్నవాడు, పండితుడు. అతను పవిత్ర గ్రంథాన్ని ఆపోసన పట్టినవాడు. కొంతమంది ప్రతి విషయం పట్ల ఆసక్తి ప్రదర్శిస్తారు. విషయాన్ని ఆమూలాగ్రంగా గ్రహించాలని ఆకాంక్ష ప్రదర్శిస్తారు. వౌలింగపుత్రుడు అటువంటివాడు.
అతను బుద్ధుని దగ్గరకు వచ్చినపుడు ఎన్నో ప్రశ్నలు వేశాడు. ప్రశ్నల్ని వర్షంలా కుమ్మరించాడంటే బావుంటుంది. మొదటిరోజు గడిచింది. మరుసటిరోజు వచ్చింది. అతను మళ్లీ అదే విధంగా రోజంతా ప్రశ్నల్ని అడుగుతూనే ఉన్నాడు. బుద్ధుడు సహనంగా అతని ప్రశ్నలకు బదులిస్తూనే ఉన్నాడు. మూడోరోజు కూడా వౌలింగపుత్రుడు అవ్యవధానంగా ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు.
బుద్ధునికి ప్రధాన శిష్యుల్లో ఒకడయిన ఆనందుడు ఇదంతా గమనిస్తున్నాడు. అతను బుద్ధునితో ‘ఈ ఎడతెగని ప్రశ్నలతో మీకు విసుగు వెయ్యలేదా?’ అన్నాడు. ‘పైగా అతను అవేఅవే ప్రశ్నల్ని వేసి మిమ్మల్ని విసిగించడం లేదా?’ అన్నాడు.
బుద్ధుడు ‘అతను ప్రశ్నల్ని మళ్లీ మళ్ళీ అడిగాడా? వేసిన ప్రశ్నల్నే మళ్లీ వేశాడా? కనీసం ఒక్క ప్రశ్ననైనా మళ్లీ తిరిగి అడిగాడా?’ అన్నాడు.
బుద్ధుని చైతన్య మనసుకి ప్రతిక్షణం నవ్యమయిందే. ప్రతిదీ కొత్తదే. కాబట్టి ఆయనకు ఏదీ పునరుక్తి అనిపించదు. అదే ప్రశ్నను మళ్లీ వేసినా అది కొత్తగా అనిపిస్తుంది. పైగా నిన్న వేసిన ప్రశ్నను ఈ రోజు వేస్తే అది ఎలా పునరుక్తి అవుతుంది? జీవితం నదీ ప్రవాహం లాంటిది. నిన్న ప్రశ్న నిన్ననే సాగిపోయింది. నిన్న వ్యక్తి లేడు. కాబట్టి నిన్న వ్యక్తి లేడు గనుక ఈ రోజు వ్యక్తి కొత్తవాడు గనక అతను వేసిన ప్రశ్న పాతది కాదు. అతనికి కొత్తది.
అట్లాగే నిన్నటి బుద్ధుడు ఈరోజు లేడు. అతను అందుకున్న ప్రశ్న అతనికి తప్పనిసరిగా కొత్తదే అవుతుంది. కాబట్టి నేను నిన్న లేను. అట్లాంటప్పుడు విసుగుకి అవకాశమెక్కడిది?’ అన్నాడు.
ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి బుద్ధుణ్ణి బాగా ద్వేషించాడు. తిట్టాడు. బుద్ధుడు ప్రశాంతంగా విన్నాడు. ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. మరుసటిరోజు వచ్చి పశ్చాత్తాపంతో బుద్ధుని పాదాలపై పడి క్షమాపణలు కోరాడు. నిన్నతను తిట్టినందుకు మన్నించమని ప్రార్థించాడు. బుద్ధుడు ఆశ్చర్యంగా ‘చిత్రంగా ఉంది. నువ్వు ఒక వ్యక్తిని నిందించి ఇంకో వ్యక్తిని క్షమాపణ కోరుతున్నావు’ అన్నాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంగా ‘నిన్న వచ్చి నిందించాను కదా?’ అన్నాడు. బుద్ధుడు ‘నిద్రపోయి లేచాను. ఇప్పుడు వేరే మనిషి నయ్యాను. నది సాగుతూ ఉంటుంది. నిన్న అడుగు పెట్టిన నదిలో ఈరోజు నువ్వు అడుగుపెట్టలేవు. జీవితం కూడా నది లాంటిదే’ అన్నాడు!

- సౌభాగ్య, 9848157909