Others

నందనందుని ఆగడం.. పూతనా జీవిత హరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగమాయ చెప్పింది వినిన కంసుడు దేవకీవసుదేవులను కారాగార విముక్తులను చేశాడు. వసుదేవుని పాదాలపై బడి బావా! నేను మూర్ఖత్వంతో మిమ్మల్నిద్దరినీ బాధపెట్టాను. నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా కూడా ఆ మహావిష్ణువు ఎక్కడో పుట్టాడట. మీకే పుడతాడని చెప్పిన ఆకాశవాణి పలుకులు నేనునమ్మాను. అందుకే మీకీ చెరచాలవాసం విధించాను. కాని ఆ ఆకాశవాణి మాటలు కూడా నేడు కల్లలని తెలిసాయి కదా. ఇపుడు ఈ మాయావి ఏమో మరోచోట పుట్టాడని అంటోంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు. సరే నేను ఏదో చేస్తాను లే. కాని మీరిద్దరు ఇకనైనా సంతోషంగా ఉండండి అంటూ వారిద్దరిని అంతఃపురానికి తీసుకొని వచ్చి కొత్తవస్త్రాలు ఇచ్చి సత్కరించి వారిని సంతోషులను చేశాడు.
కాని కంసునికి మనసులో మాత్రం ఎక్కడో ఈ మహావిష్ణువు తనకోసమే పుట్టాడన్న సంశయం కలుక్కుమంటూనే ఉంది. నేను చిన్నప్పటినుంచి మంచి బలశాలినే కదా. ఒకవేళా ఆ మహావిష్ణువే నా ఎదురుగా వస్తే నేను ఒక్కపోటు పొడవగలను అంటూ తనకు తాను భయంపోగొట్టుకోవడానికి కంసుడు తనకు తాను చెప్పుకున్నాడు.అయినా నేను లక్ష ఇనుపపుట్ల బరువుగల విష్ణు ధనుస్సునే ఎక్కుపెట్టినవాణ్ణి నేను భయపడడమేమిటి అనుకొనేంతలో కంసుని మనసు ఎదురుతిరిగినట్లయింది. ఊఁ అపుడే కదా పరశురాముడు చెప్పిన ఆ ధనస్సును విరిచినవాడు మాత్రమే నన్ను సంహరించేది అని ఆనాడు పరశురాముడు చెప్పాడు కదా. మరి నేనీ చిన్నపిల్లవాడికి భయపడడం ఏమిటి? రోజులు, నెలల పసికందుకు నేను భయపడి వాడిని సంహరించాలా ఏమిటి? వాడు పెరిగి పెద్దయ్యి ఆ లక్ష ఇనుప పుట్ల బరువుగల ధనుస్సును విరిచేంత శక్తిసమన్వితుడైతే కదా అని తన్ను తాను ఊరడిల్ల చేసుకొన్నాడు కంసుడు. నేను అఘాసురుడిని, తృణావర్తుడిని, అరిష్టకాసురుడి లాంటి ఎంతమంది మహాబలవంతులను నా కింకరులను చేసుకొన్నాను. అని తన భుజబలాన్ని తానే కీర్తించుకున్నాడు కాసేపు. అప్పటికి కంసుని మనసు శాంతించినట్లు అయ్యింది. కాని అంతలో అతనికి గోకులం నుంచి నందుడు వచ్చాడన్న కబురు అందింది. నందుడికి కుమారుడు ఉదయించాడన్న విషయం తెలిసింది. అంతే మనసు సంశయాల సంచిని తెరిచింది. ఒకవేళ ఈ మహావిష్ణువేమన్నా గోకులం లో పుట్టాడా ఏమిటి అన్న సందేహం కంసునిలో కలిగింది.
వెంటనే తన అనుచరులను పిలిచాడు. మీరంతా వెంటనే ఆ వ్రజపురానికి వెళ్లండి. గోకులంలో పుట్టిన శిశువులందరినీ కనికరం లేకుండా చంపివేయండి అని చెప్పాడు. వారంతా చిత్తం అని అక్కడే నిల్చున్నారు. ‘ఇంకా ఇక్కడే నిలబడుతారే వెళ్లండి ఆ గోకులంలోనే కాదు ఎక్కడ చిన్ని పసికందు కనిపించినా చంపి అవతల పారేయండి’ అని గట్టిగా అరిచాడు. వెంటనే వారంతా ‘‘ఆజ్ఞ’’ అంటూ కదిలిపోయారు. ఇక ఇపుడు నాకు అంత భయం లేదు. పుట్టిన వారిని పుట్టినట్లుగా చంపేస్తూ పోతే ఇక ఆ పరమాత్మ పుట్టేదెపుడు పెరిగే దెపుడు నన్ను సంహరించ శక్తి పొందేదెపుడు? ఆహా ఆదిలోనే నేను ఆ ఆదినారాయణుడిని సంహరించివేస్తాను. చూస్తాను నా దగ్గరకు ఎలా వస్తాడో అని పదే పదే అటు తిప్పి ఇటు తిప్పి ఆ మహావిష్ణువు గురించే కంసుడు పదేపదే ఆలోచిస్తూన్నాడు.
గోకులం
గోకులం అంతా ఆనందనందంగా కనిపిస్తుంది. ఎక్కడ చూచినా చిన్ని బాలుని గురించిన ముచ్చట్లే. ప్రతి గోపిక ఇంట్లోనూ ఈ నందుడు పుట్టాడా అన్నట్టు ఉంది. యశోదమ్మకు క్షణం తీరికలేదు. చిన్ని పాపడి ఆలనా పాలనా చూడడం, పాపడిని చూడడానికి వచ్చిన వనితలందరికీ బహుమతులు ఇచ్చి పంపడంలో ఆయాసం వస్తోంది. ఈ క్షణం ఎవరూ రాలేదమ్మా అనుకోవడానికి కూడా వీలులేనట్టు బంధువుల, స్నేహితుల తాకిడి ఉంటోంది. అందుకే వారింట్లోనే ఉన్న రోహిణిని కూడా వచ్చిన అతిథులను ఆదరించమని పురమాయించింది. అసలే సౌశీల్యవతి అయిన రోహిణి మరింత ఉత్సాహంతో వచ్చిన వారినంతా పలుకరిస్తూ వారిచ్చిన బహుమానాలు అందుకుంటూ తాను వారిని బహుమతులతో సత్కరిస్తోంది.
అంతలో
కంసుని చేత ప్రేరేపించబడిన పూతన అను రాక్షసి గోకులం చేరింది. అక్కడా ఇక్కడా అంతా చూసింది. ఎక్కడా చిన్ని పాపడి సంగతులు వింటూ వుంది. కాని ఆ పాపడు ఎక్కడున్నాడో అని తెలుసుకోలేకపోయింది. అందుకే కామరూపి అయిన పూతన తన్ను తానుమరుగు పరుచుకుంటూ ఇల్లిల్లూ తిరుగుతూ ఉంది. అంతలో యశోదమ్మ ఇల్లు కనబడింది. ఎంతోమంది గోపికలు ఇంటి నిండా ఉన్నారు. అందరూ ఆ ఆనందంతో మాట్లాడుకుంటున్నారు. వారి మధ్యలో నందనందుడిని చూసింది. ఒక్క క్షణం తన్ను తాను మరిచింది. అద్భుత సౌందర్యాకర్షణకు లొంగింది. ‘ఆహా ఈ చిన్ని పాపడు ఎంత చక్కగా ఉన్నాడో కదా. వీనికి నేను స్తన్యమిస్తే ఎంత బాగుండునో’ అనుకొంది. ఆ పాపనికి స్తన్యమిచ్చే ఈతల్లి ఎంతటి పూర్వజన్మపుణ్యం చేసుకొందో కదా మళ్లీ అనుకొంది. అంతలో కంసుని ఆజ్ఞ గుర్తుకు వచ్చింది.
వెంటనే నవ వన వతిగా తన్న మార్చుకుంది. తాను గోపికగా మారింది. వడివడిగా చిన్న పాపడి దగ్గరకు వెళ్లింది. చేతులు వణుకుతున్నా అది బయటపడనీయకుండా పెదవులపై చిరునవ్వు చిందిస్తూ నందనందుడిని ఒడిలో తీసుకొంది. తన్ను తాను మైమరిచి ఆ కృష్ణయ్యను చూచింది. ఆగలేక తన స్తన్యాన్ని నోటికి అందించింది.
మెల్లగాఅప్పటి దాకా అక్కడే గుమి కూడి ఉన్న గోపికలందరూ ఏదో ఒక పనితో దూరంగా జరిగారు. స్తన్యం ఇస్తున్న పూతనకు మెల్లమెల్లగా పాపని అసలు సంగతి తెలుస్తున్నట్లు నొప్పి మొదలైంది. అబ్బా అమ్మా అంటూ కూర్చుంది. ఇంకొద్ది సేపటికి వదిలించుకుందామని అనుకొన్నా వదలకుండా పట్టినట్టు ఉన్న ఆ పాపని చేతుల్లోంచి విసిరి కొడదామని విసరబోయింది. కాని వక్షోజాన్ని గట్టిగా పట్టుకొన్న బాలుని వీసమెతె్తైనా జరగలేదు.
* * *

చరణ శ్రీ