మెయిన్ ఫీచర్

హరి నామం.. హరించును పాపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్వష్టప్రజాపతి కుమారుడు యజ్ఞప్రసాదంగా లభించిన వృత్రాసురుడు ఆకాశమంత నోటితో మహా భయంకరంగా ఇంద్రుణ్ణి అమాంతంగా మింగివేస్తాడా అన్నట్టు ఉరిమి చూశాడు. ఆ చూపుకే చిమ్మచీకట్లు ప్రపంచం అంతా వ్యాపించాయా అన్నట్టుగాకదనరంగం మసకబారింది. మా అన్న విశ్వరూపుణ్ణి దుర్బుద్ధితో నిర్జించిన ఓ ఇంద్రా! ఓ జంభారి ఇంకా ఎందుకు సందేహిస్తున్నావు. నా సంగతి నీకు తెలియదు కదా. ఒకే ఒక్కసారి ఒక పెట్టు పెట్టానంటే నా అంటూ ఓ పిడిగుద్దు ఐరావతం మీద వృతాసురుడు వేశాడు. అంతే ఐరావతం నవనాడులు తెగిపడినట్లుగా నేలకు ఒరిగిపోయింది. అట్లా కిందికి ఒరిగిపోయే ఐరావతాన్ని మెల్లగా తన అధీనంలోకి తెచ్చుకుంటూ తన అమృతం తాకిన చేతులతో ఐరావతానికి నొప్పి తగ్గేట్టుగా ఇంద్రుడు ప్రేమగా నెమురుతున్నాడు. దేవదానవ యుద్ధంలో పాల్గొనడానికి వచ్చిన ఇరుపక్షాల సైనికులు ఆశ్చర్యానుభూతులతో ఇంద్ర వృతాసురులను చూస్తున్నారు.
ఈ వృత్రాసురుడు విశ్వరూపుని తండ్రి అది పనిగా ఇంద్ర సంహారం కోసం యజ్ఞం చేసి పొందినవాడు కదా అని ఒకరంటే అవును కాని త్వష్ట ప్రజాపతి మంత్రోచ్చారణలో పొరపాటు వల్ల ఇంద్రుని చేత సంహరించబడే వాడే ఈ వృత్రాసురుడు కాని అమిత తేజోసంపన్నుడు, భయంకరాకారుడు, చూపుతోనే లోకాలన్నింటినీ మాడి మసిచేయగల సాహసి అని అంటున్నారు.
విశ్వరూపుడు సురల పురోహితుడు. ఇతనికి మూడు శిరస్సులుండేవి. ఒకదానితో సురాపానాన్ని, మరొక తలతో సోమరసాన్ని మూడో శిరస్సు ద్వారా అన్నాన్నీ స్వీకరించేవాడు. దేవతలకు పౌరోహిత్యం వహించి యజ్ఞహవిస్సులను స్వీకరించేవాడు. అట్లాంటి విశ్వరూపునికి కాల వైపరీత్యం వల్ల దుర్బుద్ధి పుట్టింది. అతడు యజ్ఞహవిర్భాగాలను రాక్షసులకు ఇవ్వడం ప్రారంభించాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు విశ్వరూపుని మూడు శిరస్సులను ఖండించివేశాడు. బ్రాహ్మణుడనీను, మొదటి తప్పిదమూగాను, లేక కాలమహిమ వల్ల చేసిన పొరపాటు అనీను ఇట్లాంటివేమీ పరిగణనలోకి తీసుకోకుండానే విశ్వరూపుని శిరస్సులను మూడింటిని ఇంద్రుడు తెగనరికివేసాడు అని ఒకరు చెప్పారు. అవును నిజమే! దాని వల్లనే ఇంద్రునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. దాన్ని భరించలేక ఆ పాతకాన్ని నాలుగువిభాగాలు చేశాడు. వాటిని భూదేవికి, స్ర్తిలకు, జలాలకు, వృక్షాలకు ఆ పాతకాన్ని పంచివేసాడు. ఇవి తీసుకొన్నందుకుగాను వారికి కొన్ని వరాలను అనుగ్రహించాడు. ఇలా బ్రహ్మహత్యాపాతకాన్ని దూరం చేసుకొని నేడు ఈ వృత్రాసురుని పైకి వచ్చాడు అని మరొకరు అన్నారు.
నిజమే కాని ఈ వృత్రాసురుడు త్వష్ట కుమారుడై సాధువులను హింసించడమే కాదు, దేవతల అస్త్రాలన్నింటిని ఒక్కపెట్టున మింగివేసాడు. సాధు సజ్జనులను యజ్ఞయాగాదులను ధ్వంసచేయడమే తన పని అనుకొన్నాడు. నక్షత్రలోకాని తన భుజబలంతో కిందికి దింపివేస్తాడు. భూతలాన్ని ఆకాశానికి ఎగురవేస్తాడు. వాని ఆగడాలను ముల్లోకవాసులు భరించలేకపోతున్నారు.
దేవతలంతా కలసి పాల కడలి పవళించి ఉన్న మహావిష్ణువును ప్రార్థించి వీని పీడను విరగడ చేయమని అడిగారు. దానికి మహావిష్ణువు ధధీచి మహర్షి మహా త్యాగశీలి. ఆయన అశ్విని దేవతలకు ‘అశ్వశిరం’ అన్న ఉపదేశించి వారిని జీవన్ముక్తులు అయ్యేట్లుగా చేశాడు. దధీచి మహర్షి నిరంతరం నన్ను ధ్యానిస్తు ఉంటాడు. ఆయనుంచి ఆయన వెన్నుముకను మీరు దానం తీసుకోండి దానినుంచి వంద అంచులుగల వజ్రాయుధాన్ని తయారు చేయండి దానితో వృత్రాసుర సంహారం జరుగుతుంది అని మహావిష్ణువే దేవతలకు చెప్పాడు. అటువంటి మహాయుధమైన వజ్రాయుధాన్ని తీసుకొని సంగ్రామానికి వచ్చాడు.
కాని ఈ సర్వ శస్త్రాలను మింగేసిన ఇతడేమిటి ఆ వజ్రాయుధాన్ని కూడా నేలపాలు చేశాడు అని ఆశ్చర్యం కలుగుతోందని అన్నారింకొకరు. దేవదానవ యుద్ధంలో అపూర్వమైన దధీచి మహర్షి వెన్నుముకతో తయారు చేసిన వజ్రాయుధాన్ని పట్టుకున్న ఇంద్రుని చేతినుంచి అంతటి మహిమాన్వితమైన వజ్రాయుధం చేజారింది. గుటకలు మింగుతూ దేవేంద్రుడు దిక్కులన్నింటినీ కప్పివేశాడా అన్నంత దీర్ఘశరీరధారుఢ్యమున్న వృత్రాసురుణ్ణి మ్రాన్పడి చూస్తున్నాడు.
అంతలోనే కోపంతోఎర్రనైన కనులు కలవాడైన వృత్రుడు చిరునవ్వులు చిందిస్తూ ‘‘ఓపాకశాసనా! అందుకో నీ వజ్రాయుధాన్ని, దధీచి మహర్షి ప్రసాదించిన అస్థులతో నిర్మించిన ఈ పవిని గట్టిగా పట్టుకో. నాడు దయాదాక్షిణ్యాలు మరిచి పాపపుణ్యాలను లెక్కచేయక మంచివాడైన నాఅన్నను రూపుమాపావు. ఇపుడు ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నావు. వెంటనే నేను ధర్మమెపుడూ తప్పను. నిరాయుధుడైన శత్రువును నిర్జించను కనుక నీవు భయం వీడి ఆ వజ్రాయుధాన్ని చేతిలోకి తీసుకొని నాపైకి లంఘించు.. అని మహేంద్రుడిని పరిపరివిధాలుగా ఉత్తేజితుణ్ణి చేశాడు.

- డా. రాయసం లక్ష్మి. 9703344804