Others

మూర్త్భీవించిన పూర్ణావతారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణపరమాత్మ శ్రీమహావిష్ణువు పదహారు కళల్లో మూర్త్భీవించిన పూర్ణావతారం. పుట్టిన నాటి నుంచి మరణించేంతవరకూ అడుగడుగునా భక్త సంరక్షణార్థం, లోక కళ్యాణార్థం ఎనె్నన్నో మహిమలు చూపుతున్నట్టుగా ఎన్నో సంస్కరణలు చేశాడా కృష్ణమూర్తి.
శ్రీరాముడు నవమినాడు జన్మిస్తే, శ్రీకృష్ణుడు అష్టమినాడు జన్మించాడు. నలుగురికోసం మంచి కోసం ధర్మసంస్థాపన కోసం ఆ ఇద్దరూ ఎన్నో అవస్థలు పడ్డారు.
శ్రీకృష్ణజననం- ఒకానొక కాలంలో పృశ్నిసుతపుడు అనే దంపతులు ఇరువురు విష్ణువును గూర్చి తపస్సు చేసారు. విష్ణువు వారికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వాళ్లు ‘నీవే మాకు పుత్రుడివై జన్మించు’ అని అర్థించారు. మాకు లభించిన ఏ జన్మలో నైనా నీవే మాకు పుత్రుడివై పుట్టుతూ మా పుణ్యపాపనాశనం తర్వాత నీ సాయుజ్యాన్ని మాకివ్వలసిందని ప్రార్థించారు. అందుకే ఆ జన్మలో ఆయన వాళ్ళకు పుత్రుడై పుట్టాడు. ఆ తర్వాత జన్మలో వాళ్ళు అదితి కశ్యపులై పుడితే వాళ్లకు వామనుడై జన్మించాడు. మూడవ జన్మలో వాళ్ళు దేవకీ వసుదేవులైతే దేవకీదేవి అష్టమ గర్భంగా అష్టమినాడు ఆయన కృష్ణుడై అవతరించాడు.
పసికందుగా పుట్టినప్పటినుంచి ఏడేండ్లు దాటకుండానే సమస్త లీలలు ఆయన చూపాడు. పూతనను చంపాడు. శకటాసురుణ్ణి సంహరించాడు. వత్సాసుర, బకాసురులను వధించాడు. ఆఘాసురుణ్ణి చంపా డు. కాళీయమర్థనం చేశాడు. చివరకు పెరిగి పెద్దవాడు అవుతూ చిటికెనవేలుతో గోవర్థన పర్వతానె్నత్తి, గోవర్థణోద్ధరణం చేశాడు. తన్ను నమ్ముకున్న వారిని ఆనంద తన్మయులును చేయడానికి ఎన్నో పనులు చేశాడు కృష్ణ్భగవా నుడు. కుచేలునితో స్నేహం చేసి స్నేహం విలువను చెప్పాడు. పాండవులతో రక్తసంబంధాన్ని పెటు టకుని బంధుప్రీతి ని తెలియచేశాడు. తన వారైనా సరే ధర్మాన్ని తప్పకూడదనే చెప్పడానికే భారతయుద్ధంలో పాల్గొని ధర్మసంస్థాపన చేశాడు.
ఇన్ని పనులు చేసిన కృష్ణుని స్మరిస్తూ కృష్ణజననాన్ని పురస్కరించు కుని ఉత్తరాదిలోని గోకులం, బృందావనం, మధురలలో, పశ్చిమాన ద్వారకలో, తూర్పున పూరీలో, దక్షిణాదిన, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో విభిన్న సంస్కృతులు సంప్రదాయాలను బట్టి జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఇవన్నీ చేయడం కేవలం ధర్మం పట్ల ఆశేషజనానికి ప్రీతి కల్గించడానికే.

- జి. కల్యాణి