AADIVAVRAM - Others

భక్తుల పూజలందుకునే మోటారు సైకిల్! (లోకం పోకడ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కోసారి కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతాయి. అవెలా జరిగాయో, ఎందుకు జరిగాయో ఎవరూ చెప్పలేరు. అవి అంతుబట్టని రహస్యాల్లాగే ఉండిపోతాయి. వాటి గురించి జనం కథలు కథలుగా చెప్పుకుంటారు. మేధావులు ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని శోధిస్తూనే ఉంటారు. జోధ్‌పూర్‌లోని పాలి అనే ప్రాంతంలో కూడా అటువంటి ఒక అనూహ్యమైన సంఘటనే జరిగింది. అక్కడ ఒక బుల్లెట్ బైక్‌ని ప్రజలంతా పూజిస్తుంటారు. పెద్దవాళ్లు దానిని పూజించడమే కాదు తమ పిల్లల చేత ఆ బైక్‌కి దండాలు పెట్టిస్తారు. అటుగా వెళ్లే వాళ్లు ఎవరైనా తప్పనిసరిగా ఆ బైక్ పూజలందుకుంటున్న చోటుని దర్శించకుండా, ఆ బైక్‌ని పూజించకుండా వెళ్లరు. ఇంకా చెప్పాలంటే అలా చేస్తే తమకేదైనా ప్రమాదం జరుగుతుందని కూడా భయపడతారు.
దీనికంతటికీ కారణం బుల్లెట్ బాబా. బుల్లెట్ బాబా అసలు పేరు ఓంసింగ్ రాథోడ్. అతను 2 డిసెంబర్ 1991న ఇప్పుడు ఎక్కడైతే బుల్లెట్ పూజలందుకుంటుందో అక్కడ ప్రమాదవశాత్తు మరణించాడు. వేగంగా వస్తున్న రాథోడ్ బుల్లెట్ అక్కడున్న ఒక చెట్టును ఢీకొనడంతో ఓంసింగ్ రాథోడ్ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమైన బుల్లెట్‌ని తీసుకెళ్లి పోలీసు స్టేషన్‌లో భద్రపరిచారు.
కానీ చిత్రంగా ఆ బుల్లెట్ తెల్లారే సరికి పోలీస్‌స్టేషన్ నుండి
మా...య...మైం...ది...!
అక్కడ మాయమైన ఆ బుల్లెట్ ముందు రోజు ఎక్కడైతే ప్రమాదానికి గురైందో అక్కడ ప్రత్యక్షమయింది. స్టేషన్‌లో బుల్లెట్ మాయమవడం గమనించిన పోలీసులు ప్రమాదస్థలిలో దానిని గుర్తించి తిరిగి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.
చిత్రంగా ఆ మర్నాడు తెల్లవారే సరికి మళ్లీ బుల్లెట్ మాయమై ప్రమాదస్థలిలోనే ప్రత్యక్షమయింది.
ఇదెవరో కావాలనే చేస్తున్నారని భావించిన పోలీసులు ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య బుల్లెట్‌ని పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. బుల్లెట్ ఈసారి కూడా మాయమై ప్రమాదస్థలిలోనే ప్రత్యక్షమయింది.
దీంతో షాక్‌కి గురయ్యారు పోలీసులు. ఇదెలా సంభవమో వారికి అర్ధం కాలేదు. అప్పటికే ఈ విచిత్రం గురించి తెలుసుకున్న ప్రజలు బుల్లెట్‌ని సందర్శించడానికి తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. దాంతో పోలీసులు ఆ బుల్లెట్‌ని అక్కడే వదిలేశారు. అప్పటి నుండి బుల్లెట్ మాయమవడం వంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. అది శాశ్వతంగా అక్కడే భక్తులకు దర్శనమిస్తుంది. ప్రజలు ఆ బుల్లెట్‌కి గుడి కట్టి పూజించడం మొదలుపెట్టారు.
చాలా మంది ప్రజలు బుల్లెట్ బాబా టెంపుల్ వద్ద పళ్లు, పూలు ఉంచి పూజిస్తారు. కొందరైతే మద్యం కూడా అక్కడ ఉంచి భక్తిప్రపత్తులు చాటుకుంటారు. కొందరు బుల్లెట్‌కి తిలకం దిద్దుతారు. అటుగా వెళ్లేవాళ్లు బుల్లెట్ బాబా గుడి వద్ద ఆగకుండా వెళ్లిపోతే ఏదైనా జరుగుతుందని భయపడతారు. అందుకే అటుగా వెళ్లేవాళ్లు అంతా అక్కడ ఆగి బుల్లెట్ బాబా ఆశీస్సులు తీసుకుని వెళతారు.
మన దేశంలో అనేకానేక విచిత్రాల్లో ఈ బుల్లెట్ బాబా విచిత్రం ఒకటిగా కొనియాడబడుతోంది. *

- దుర్గాప్రసాద్ సర్కార్