Others

ప్రతిష్ఠ దిగజార్చవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రేక్షకులపై సినిమాల ప్రభావం చెరగని, చెదరని ముద్ర వేసిందని చెప్పవచ్చు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో పశువుల కాపరిగా ఉన్న యువకుడు చిత్తూరు నాగయ్య నటించిన యోగి వేమన సినిమా చూసి బాలయోగిగా మారి ప్రజలతో ఆధ్యాత్మిక చింతన కలగజేశారు. ఆ మహాయోగి కాలం చేసి దశాబ్దకాలం దాటినా ఆ క్షేత్రాన్ని ఇప్పటికీ ప్రజలు దర్శనాలు చేసుకోవటం వివేషం. అప్పట్లో ఆడపిల్లలు సినిమాల్లో నటించటానికి ఆసక్తి చూపకపోవడంతో తొలుత మగవారే స్ర్తి పాత్రలు వేసేవారట. క్రమేపీ కన్నాంబ, శాంతకుమారి, ఎస్.వరలక్ష్మి, భానుమతి, లక్ష్మీరాజ్యం, పుష్పలత వంటివారు తెరపై కన్పించడంతో ఈ రంగంపై మహిళలూ ఆకర్షితులయ్యారు. నందమూరి తారక రామారావు రాముడు, కృష్ణుడు రూపాల్లో ఉన్న చిత్తరువులను తమ ఇళ్ళల్లో గల దేవుని గదిలో పెట్టి పూజించుకోవటం లక్షలాది ఇళ్ళల్లో చూస్తుంటాము. మొదట్లో పౌరాణిక, జానపద చిత్రాలతోనే పురుడు పోసుకున్న పరిశ్రమ ప్రేమ ఇతివృత్తంగల చిత్రాలు బాలరాజు (1948), లైలామజ్ఞు (1949), అనార్కలి (1955) వంటి చిత్రాలలో నటించిన అక్కినేని నాగేశ్వరరావుగారి వేషధారణతో యువకులు కనిపించేవారు. బాలరాజు సినిమా తిలకించే పశ్చిమ గోదారి జిల్లా దెందులూరుకు చెందిన కొడాలి ఆంజనేయ చౌదరిగారి కుమార్తె అన్నపూర్ణ అక్కినేని నాగేశ్వరరావుని (18-2-1949) వివాహమాడారు. ప్రజలపై సినిమా రంగం విపరీతమైన ఆదరణ పెరుగుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ రంగాన్ని ప్రోత్సహించాలనే భావన కలిగి 1954 నుండి ప్రోత్సాహాలు, పురస్కారాలు, రాష్టప్రతి యోగ్యతాపత్రాలతో సత్కరించటం జరిగింది. మన తెలుగు చిత్రాలలో మొట్టమొదటగా విప్రనారాయణ, అనంతరం మల్లీశ్వరి వంటి చిత్రాలతో యావత్‌దేశం మన సినిమాలవైపు దృష్టి మరల్చారు. ఫలితంగా తెలుగులో విజయవంతమైన ఎన్నో చిత్రాలలో భారతీయ ప్రేక్షకుల్ని శాసించే హిందీ పరిశ్రమ సైతం మన చిత్రాల్ని పునఃనిర్మించుకోవడం జరిగింది. బెంగాలీ కథకులు శరత్ చంద్ర ఛటర్జీ రాసిన ‘దేవదాసు’ హిందీలో సైగల్‌తో నిర్మించారు. అనంతరం అక్కినేని నాగేశ్వరరావుతో తెలుగులో 26-6-1953, తమిళంలో 11.9.53లో విడుదల చేయగా రెండు భాషల్లోను రజితోత్సవం జరుపుకోగా, తమిళనాడు మధురై చింతామణి థియేటర్‌లో ఏకంగా సంవత్సరకాలం ప్రదర్శితమైంది. అదే కథతో హిందీలో ఎదురులేని శక్తిగా ఉన్న దిలీప్‌కుమార్‌తో పునర్ నిర్మించగా పరాజయం పాలైంది. స్వయంగా దిలీప్‌కుమార్ అక్కినేనితో నటనలో మీరు ట్రాజెడీ కింగ్ అని ప్రశంసించారు. అదీ తెలుగువాని ఖ్యాతి.
అటువంటి చిత్ర పరిశ్రమ ఎందర్నో అనేక విధాల వ్యసనప్రియులను మన తెలుగు చిత్రాల ద్వారా వారి స్థితిగతులను మార్చగా, ప్రస్తుతం సినిమా పరిశ్రమను మాదకద్రవ్యాల రూపంలో విచారణలకు హాజరుకావటం, గంజాయి, కొకైన్ స్వీకరిస్తున్నారన్న నేరారోపణలపై అబ్కారీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయటం, బాధితులుగా అరెస్టులు, జైలుశిక్షలు పడుతుండటం వంటి మకిలి పనులకు పాల్పడుతున్నారంటే, వీళ్లనా మనం అభిమానించేది, ఆరాధిచేది అని అసహ్యమేస్తోంది. స్ర్తిలు సినిమాలో కాలుమోపటానికి గడప దాటి బయటకు రాని నాటి తరాన్ని తలుచుకుంటే నేటి ఛార్మి, ముమైత్‌ఖాన్ వంటివారు తప్పు చేసినట్లు అంగీకరించటం, న్యాయస్థానాలను ఆశ్రయించటం- అలనాటి ఔన్నత్యం నేడు ఒక్కసారిగా అగాథంలోకి కూరుకుపోతున్నాయనే పరిస్థితి కల్పిస్తున్నారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ మాత్రం మచ్చ ఏర్పడకుండా ఎనభై అయిదేళ్ళు (1932-2017) తెలుగు సినీ పరిశ్రమ దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే మన కీర్తి పతాకాన్ని అలనాటి పెద్దలు ఎగురవేయటం జరిగింది. ఇటీవల రాజవౌళి తీసిన ‘బాహుబలి’ మరోమారు మన సత్తా చాటింది. ఇటువంటి తరుణంలో ప్రస్తుత తరం నటులు తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావలసిన పనిలేదు, అప్రతిష్ఠపాలు చేయకుంటే అదే మనల్ని ఈ స్థాయికి నిలిపిన మహనీయులకిచ్చే నిజమైన నివాళి.

-యర్రమోతు ధర్మరాజు