AADIVAVRAM - Others

చిన్నారుల మాదిరిగానే శునకాలకూ భావోద్వేగాలు! (విజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లిదండ్రులు, దగ్గరి బంధువులను చూడగానే పసికందులు ఎలా ముచ్చటపడిపోతారో తెలుసుగా? మాటలురాని స్థితిలో నెలల పిల్లలు కాళ్లూచేతులూ ఆడించి, బోసినవ్వులు చిందించి, నొసలు చిట్లించి, కేరింతలు కొట్టి ఇలా రకరకాలుగా భావోద్వేగాలను వెల్లడిస్తారు. కొంత పెరిగాక మీదపడడం, ముద్దుపెట్టుకోవడం, గారాలుపోవడం, వెనకాలే తిరగడం, శరీరాన్ని తాకుతూ ప్రేమను చాటడం వంటి చర్యలతో తమ అనుబంధాన్ని చిన్నారులు వెల్లడిస్తారు. ఇవన్నీ మనలో చాలామందికి అనుభవమే. అయితే చిన్నపిల్లల్లో భావోద్వేగాలు వ్యక్తీకరణ ఎలా ఉంటుందో శునకాల్లోనూ అలా వెల్లడించే శక్తి ఉందని ఓ పరిశోధనలో తేలింది. చిన్నపిల్లల్లో ఏ స్థాయిలో ఆ భావోద్వేగాల వెల్లడించగల శక్తి ఉందో, అదేస్థాయిలో శునకాల్లోనూ ఉందని తేలింది. మనుషుల్లోను, శునకాల్లోను భావోద్వేగాల మేధస్సు స్థాయి, చైతన్యం, చొరవ ఎలా ఉన్నాయన్న అంశంపై ఈ పరిశోధన సాగింది. మూడేళ్ల బాలబాలికలు ఏ స్థాయిలో అయితే ఈ భావోద్వేగాలు వ్యక్తీకరించగలరో శునకాల్లోను అదేస్థాయిలో ఆ శక్తి ఉందని తాజా పరిశోధన రుజువు చేసింది. మనుషుల్లాగానే సంతోషాన్ని, సానుకూల ప్రవర్తనను వ్యక్తీరించడాన్ని పరిశోధకులు గుర్తించారు. యజమానుల ఏ భాషలో మాట్లాడినా వారి ముఖాలు, శరీరభాషను గమనించి వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏఏ భావోద్వేగాలతో ఉన్నారో ఇట్టే గుర్తుపట్టేస్తాయని తేలింది. దానికి తగ్గట్టు ఇవి ప్రవర్తిస్తాయట. ‘డాగ్ ప్లే’ ద్వారా శునకాలను పరిశీలించినపుడు అవి ‘ఫెయిర్‌నెస్’ను, క్షమాగుణాన్ని చక్కగా ప్రదర్శించాయని ఆ పరిశోధన తేల్చింది. లండన్‌కు చెందిన క్రూయల్టీ ఫ్రీ ఇంటర్నేషనల్ సంస్థతో కలసి ఇండియన్ యానిమల్ వెల్ఫేర్ గ్రూప్ పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థ నిర్వహించిన పరిశోధనలో ఇవన్నీ తేలాయి. శునకాల్లో ఎమ్‌ఆర్‌ఐ వంటి బ్రెయన్ స్కాన్ పరీక్షలకు సంబంధించిన రీసెర్చిలో భాగంగా ఈ అధ్యయనం నిర్వహించారు. తమ పరిశోధనల ఫలితంగా శునకాలవంటి జంతువులపై విజ్ఞానశాస్త్ర పరీక్షలు నిషేధించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.