AADIVAVRAM - Others

గొప్పదానం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురం మహారాజు విక్రమసింహుడు ప్రజారంజకుడు. ప్రతి ఏడాదీ తన జన్మదినాన విరివిగా పేద ప్రజలకు దానధర్మాలు చేసేవాడు. ఒకరోజున సభలో తన పాలన గూర్చి మాట్లాడుతూ తాను చేసే దానాల గురించీ కాస్త గర్వంగా చెప్పడం విన్న మహామంత్రి మాన్యుడు ‘మహారాజా! చాలామంది సామాన్యులు సైతం తమకున్న దాంట్లో చాలా దానాలే చేస్తూంటారు. బాగా సంపద ఉన్న వారికంటే తమ కష్టంతో సంపాదించిన దాన్లోంచీ దానం చేయడం గొప్ప అవుతుంది’ అన్నాడు.
దానికి మహారాజు ‘మంత్రివర్యా! తమరు అలాంటి వ్యక్తిని చూపిస్తే మీ మాట సత్యమని అంగీకరిస్తాను’ అన్నాడు.
‘అలాగే మహారాజా!’ అంటూ ఆ రాత్రే తామిద్దరూ మారువేషాల్లో బయల్దేరుదామని చెప్పాడు మహామంత్రి.
అదే రాజ్యంలో రామాపురంలో రామయ్య అనే ఒక నేతగాడు ఉండేవాడు. అతడు కష్టజీవి. నిజాయితీపరుడు. పేదవాడైనా పెద్ద మనసున్నవాడు. అతడు రైతుల నుంచీ మంచి పత్తి కొని స్వయంగా రాట్నంతో నూలు తీసి, పడుగు, పేక పోసుకుని బట్టలు నేసేవాడు. రామయ్య నేసిన చీరలకు మంచి గిరాకీ ఉండేది. నేతలో నైపుణ్యంతోపాటు, అందంగా, మంచి రంగుల కలయికతో ఉండటం, మన్నిక కలిగి ఉండటం ఆ చీరల ప్రత్యేకత. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అతడు నేసిన చీరలు కొని తీసుకెళ్లేవారు. రామయ్య ముతక దారాలను మాత్రం చీరలకు వాడేవాడు కాదు. ముతక పత్తితో వేరే దారాలు పోసి, వాటిని వృధా చేయక ఆ దారాలతో తీరిక సమయంలో ముతక దుప్పట్లు నేసేవాడు. అవి ఎవ్వరికీ అమ్మక చలికాలానికి దాచేవాడు. కార్తీక మాసంలో శివాలయం వద్ద చెట్ల క్రింద జీవించే బిచ్చగాళ్లకు ఆ ముతక దుప్పట్లు రాత్రిపూట వెళ్లి ఇచ్చేవాడు. అతడి గుప్తదానం ఎవ్వరికీ తెలిసేది కాదు. బిచ్చగాళ్లు సైతం తమకు దుప్పట్లను దానం చేసేదెవరో తెలీకపోయినా మనసారా దీవించేవారు. రామయ్య కుటుంబ సభ్యులు పొదుపుగా తమ ఆదాయంతో సంతృప్తిగా జీవించేవారు.
మారువేషాల్లో సంచారానికి బయల్దేరిన విక్రమసింహుడు, మంత్రి మాన్యుడూ ఆ గ్రామం వచ్చి ఆ రాత్రికి బస కోసం వెతుక్కుంటూ రామయ్య ఇంటి ముందు నిల్చి, ‘ఈ రాత్రికి మీ ఇంట బస ఇస్తారా?’ అని అడిగారు.
దానికి రామయ్య ‘మహద్భాగ్యంగా. ఐతే మా ఇంట సౌకర్యాలు తక్కువ. నేత పరికరాలు, పత్తి బస్తాలూ, రాట్నాలూ, మగ్గాలూ ఉంటాయి. మీకు సమ్మతమైతే సరే’ అన్నాడు రామయ్య.
దానికి వారు సమ్మతించాక వారికి, రామయ్య ఏర్పాటు చేసిన అతి సామాన్యమైన భోజనం చేసి, వారు విశ్రమించారు. అర్ధరాత్రయ్యాక, రామయ్య ఒక మూట భుజానికి వేసుకుని ఎక్కడికో వెళ్లటం గమనించిన వారిద్దరూ మెల్లిగా రామయ్యకు తెలీకుండా అతడ్ని అనుసరించారు. రామయ్య ముఖానికి ముసుగు కప్పుకుని, ఆ మూటలో దుప్పట్లు, శివాలయం వద్ద చెట్ల క్రింద చలికి వణుకుతూ ముడుచుకు పడుకునున్న వారికంతా కప్పేసి ఇంటికి రావడం గమనించి, రామయ్య ఇల్లు చేరక ముందే వారు వచ్చి పడుకుని నిద్రిస్తున్నట్లు నటించారు. తెల్లారాక తమకు ఆశ్రయమిచ్చినందుకు రామయ్యకు కొంత సొమ్ము ఇవ్వబోగా ‘అతిథి అభ్యాగతులను ఆదరించడం గృహస్తుల ధర్మం. మా మహారాజుగారు చేసే దానాల ముందు ఒక రోజు మీకు భోజనం పెట్టడం గొప్ప కాదు. ఆ పుణ్యాత్ముని పాలనలో హాయిగా జీవిస్తున్నాం. ఇది మా ధర్మం మహాత్ములారా’ అంటూ నమస్కరించాడు. మారుమాట్లాడకుండా వారు బయల్దేరారు. తన దానం కంటే రామయ్య దానం ఎంత గొప్పదో గ్రహించాడు విక్రమసింహుడు.

-ఆదూరి హైమావతి