AADIVAVRAM - Others

చెక్కు (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య ఓ వీడియో చూశాను. అందులో ఓ వ్యక్తి 100 రూపాయల నోటుని నలిపి ‘దీని విలువ ఎంత’ అని ఆ క్లాసులో కూర్చున్న వ్యక్తులను అడుగుతాడు.
‘వంద రూపాయలని’ అక్కడ కూర్చున్న వ్యక్తులు చెబుతారు. ఆ తరువాత అతను ఆ వంద రూపాయలని బూటుకాలితో నలిపి మళ్లీ అదే ప్రశ్న వేస్తాడు.
మళ్లీ అందరూ ‘వంద రూపాయలు’ అని చెబుతారు. ఆ తరువాత ఆ వ్యక్తి ఇలా చెబుతాడు. మీ విలువ కూడా ‘అంతే!’. పరిస్థితులు ఎలా వున్నా మీ విలువ మారదు అని చెబుతాడు.
ఇది నిజమే! కాని మనిషిలోని ప్రతిభా పాటవాలు, శక్తియుక్తులు, తెలివితేటలు మాత్రం వంద రూపాయల నోటు, వెయ్యి రూపాయల నోటు లాంటివి కాదు. ఎందుకంటే వాటి విలువ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అవి చెక్కులాంటివి.
చెక్కుకు ఓ కాలపరిమితి ఉంటుంది. ఆ కాలపరిమితి దాటిన తరువాత అది మామూలు కాగితంగా మారిపోతుంది. అప్పుడు దానికి ఎలాంటి విలువా ఉండదు.
ఓ గాయకుడు వున్నాడనుకుందాం. అతను ఎంత గొప్ప గాయకుడైనా రోజూ సాధన చేసి అందరి ముందు ప్రదర్శించకపోతే అతని శక్తి పోతుంది.
చిత్రకారుడూ అంతే. రచయిత, కవి అంతే!
క్రీడాకారులు రోజూ సాధన చేస్తారు. అప్పుడే వాళ్లు అందరి దృష్టిని ఆకర్షించి వాళ్ల క్రీడలో నిలుస్తారు.
కొంతమందికి ఎన్నో తెలివితేటలు ఉంటాయి. కానీ వాటిని ఉపయోగించరు. దానివల్ల వాళ్లు తెలివితేటలు వున్న వ్యక్తులుగా పరిగణించబడరు.
మనలో వున్న శక్తియుక్తులు, తెలివితేటలు, ప్రతిభా పాటవాలని ఉపయోగించకపోతే ఉపయోగం ఉండదు. అవి కాలం నీడ కింద కరిగిపోతాయి.
చెక్కు మాదిరిగా ఎలాంటి విలువ లేకుండా పోతుంది. అందుకని ఎవరిలో వున్న శక్తిసామర్థ్యాలని, ప్రతిభా పాటవాలని గుర్తించి వాటిని వినియోగించాలి. దానివ్లల వాళ్లకి ఉపయోగం. సమాజానికి కూడా ఉపయోగం.
ఇక, రూపాయి నోటు గురించి ఆలోచిద్దాం. దాని విలువ కూడా రోజూ ఒకేలా ఉండదు. ద్రవ్యోల్బణం వల్ల దాని విలువ కూడా రోజురోజుకీ తగ్గిపోతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.
వీటితో గుర్తుంచుకోవాల్సింది సమయాన్ని. సమయం ఎవరి కోసం ఆగదు. పరుగెడుతూనే ఉంటుంది. దానితోబాటు మనమూ పరుగెత్తాలి.
రూపాయి నోటుని చెక్కుని, కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మన శక్తియుక్తులని, తెలివితేటలని, ప్రతిభాపాటవాలని ఎప్పుడూ ఉపయోగిస్తూనే ఉండాలి.

జింబో 94404 83001