Others

తండ్రిగా గెలిచాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలక్షణ నటుడిగా పేరు తెచ్చకున్న ప్రకాష్‌రాజ్ సినిమాలు తగ్గించాడా? తండ్రి, విలన్ పాత్రలు వదిలేసి
ఇప్పుడు కొత్త పాత్ర లపై దృష్టి పెట్టాడా? తండ్రిగా ఆయన గెలిచాడు.
*
ప్రకాష్‌రాజ్! చక్కని ప్రతిభ గల నటుడిగా, విలన్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా అనేక పాత్రలు పోషిస్తూ తనదైన శైలిలో పరిశ్రమలో రాణిస్తున్న ఆల్‌రౌండర్. పరిశ్రమలో ప్రస్థానం మొదలుపెట్టి రెండు దశాబ్దాలు కావస్తోంది. కన్నడంలో నాలుగైదు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘డ్యూయెట్’తో సంపాదించాడు ప్రకాష్‌రాజ్. రెండు దశాబ్దాల్లో మరే నటుడు నటించనన్నిసార్లు తండ్రి పాత్రల్లో కనిపించాడు ప్రకాష్‌రాజ్.
చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’ సినిమాలో హీరోయిన్ అంజలా జవేరికి తండ్రిగా నటించి, ఆ సినిమా సక్సెస్‌లో కీలకపాత్ర పోషించాడు. ‘వాడు సామాన్యుడు కాదు’ అంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘ఇంద్ర’ సినిమాలో సోనాలి బింద్రేకు, ‘అందరివాడు’లో హీరోయిన్‌కు తండ్రిగా విలన్ పాత్ర చేశాడు. ఇక ‘మృగరాజు‘ చిత్రంలో ఏకంగా చిరంజీవికే తండ్రిగా తనదైన శైలిలో నటించాడు.
హీరో సిద్ధార్థ్‌కు ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మరియు ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాల్లో తండ్రి పాత్రల్లో తనదైన నటన ప్రదర్శించాడు.
‘కొత్త బంగారు లోకం’లో టీనేజ్ కొడుకుగా నటించిన వరుణ్ సందేశ్‌కు తండ్రిగా, ‘ఆకాశమంత’ సినిమాలో కూతురిపట్ల అనుక్షణం ప్రేమను పంచే తండ్రిగా, ‘నువ్వే నువ్వే’లో శ్రీయకు ఫ్రెండ్‌లాంటి తండ్రిగా, ‘్భగీరథ’లో వ్యాపార బుద్ధిగల తండ్రిపాత్రలో విలన్‌గా, ‘దిల్’లో హీరోయిన్ తండ్రిగా నటిస్తునే విలన్‌గా ఆకట్టుకున్నాడు.
‘పరుగు’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘బృందావనం’ ‘ప్రేమకు వేళాయెరా’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘జల్సా’, ‘దూకుడు’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ప్రేమించేది ఎందుకమ్మా’, ప్రేమకు స్వాగతం’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాల్లో బాధ్యతగల తండ్రి పాత్రలో నటించి మాకు ఇలాంటి తండ్రి ఉండాలనుకునేంతగా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్న నటుడు ప్రకాశ్‌రాజ్. ఇంకా ‘కొంచెం టచ్‌లో ఉంటే చెపుతా’, ‘వర్షం’, ‘సుస్వాగతం’, ‘బన్నీ’, ‘బాబీ’, ‘మిరపకాయ్’, ‘ఇడియట్’ సినిమాల్లో హీరోయిన్‌కు తండ్రిపాత్రలో నటించి విలన్‌గా ఆకట్టుకున్నాడు. ఈ మధ్యకాలంలో మరే తెలగు నటుడు ఇన్ని సినిమాల్లో తండ్రిపాత్రల్లో నటించలేదు. ముప్పైకి పైగా సినిమాల్లో తండ్రిగా నటించాడు ప్రకాష్‌రాజ్.

-కె.సతీష్‌బాబు