Others

నాకు నచ్చిన సినిమా-- ముత్యాల ముగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1975లో బాపు రమణల మేలికలయికతో రూపొందిన చిత్రమిది. టూకీగా ఒక ధనవంతుని (కాంతారావు) కుమారుడు హీరో (శ్రీ్ధర్) తన స్నేహితుని చెల్లి పెళ్ళికి వెళతాడు. అక్కడ పీటలమీదే పెళ్లి చెడిపోతుంది. ఆ పెళ్ళికి హీరో తండ్రి సాయం చేస్తాడు. తప్పిపోయిన పెళ్ళికొడుకు ఒక నిత్య పెళ్ళికొడుకు (నూతన్‌ప్రసాద్). తన తండ్రికి చెడ్డపేరు రాకుండానూ, చెడిన పెళ్ళిని ఉద్ధరించేందుకు నడుంకట్టి ఆ పెళ్ళికూతుర్ని (సంగీతను) వివాహమాడుతాడు హీరో.
హీరో బంధువు, మేనమామ (ముక్కామల) ధనికుడిని దుర్భాషలాడి ఒక బ్రోకర్ని (రావుగోపాలరావు) ఆశ్రయించి హీరో హీరోయిన్లని విడగొట్టడంలో కృతకృత్యుడవుతాడు. హీరోయిన్ అప్పటికే గర్భవతి. కట్టుబట్టలతో వెళ్ళి ఒక పూజారి ఇంట్లో తలదాచుకొంటుంది. ఆమెమీద కులట, దొంగతనం నేరాన్ని బ్రోకరు, వారి అనుయాయులు మోపుతారు. ఇది గ్రహించిన ధనికుడు ఇల్లు వదిలిపెట్టి చివరకు కోడలివద్దకే చేరుతాడు. ఆమెకు అప్పటికే కవలలు కలిగి పెద్దవారవుతారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. హీరో దారితప్పి హీరోయిన్ ఇంటివద్దకు వచ్చి ఆమెను చూడకుండానే వెళ్ళిపోతాడు. పిల్లలు ఇద్దరూ జరిగినది గ్రహించి తల్లిదండ్రులను కలపడానికి వెళ్ళిపోతారు. వారిద్దరూ కలసి తల్లిదండ్రులను కలపడంలోనూ, బ్రోకరు కుట్ర భగ్నంచేయడంలోనూ కృతకృత్యులౌతారు. ఉత్తర రామాయణానికి సమకాలీనంగా సోషలైజ్ చేసిన చిత్రమిది. విలన్‌గా రావుగోపాలరావుకి చక్కని పేరొచ్చిన చిత్రమిది. శ్రీ్ధర్, సంగీత, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, ముక్కామల, అర్జా జనార్దనరావు, కాంతారావు ప్రధాన పాత్రలు పోషించారు.
మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఒక పాట ‘శ్రీరామ జయరామ సీతారామ’ పాట పాడటం విశేషం. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ, ఎంతటి రసికుడవో తెలిసెర మొదలైన పాటలతో చక్కగా రూపొందిన చిత్రానికి ముళ్ళపూడి వెంకటరమణ మాటలు, బాపు దర్శకత్వం వహించారు. ఇషాన్‌ఆర్య ఫొటోగ్రఫీ, సంగీతం కెవి మహదేవన్ సమకూర్చారు. సన్నివేశాలు హైదరాబాదు జ్ఞాన్‌బాగ్ పేలస్‌లో చిత్రీకరించారు. లోబడ్జెట్‌గా నిర్మితమైన ఈ చిత్రం నాకే కాదు, అందరికీ నచ్చుతుంది, మెప్పిస్తుంది.

-పట్టిసపు.ఎస్.రావ్, విశాఖపట్నం